For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుకుంబర్ మింట్ స్మూతీ

|

వేసవిలో వాతావరణం వేడి, ఎండ వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. డీహైడ్రేషన్ నుండి మన శరీరానికి ఉపశమనం కలిగించడానికి పుదీనా మరియు కీరదోసకాయ బాగా సహాయపడుతాయి. అంతే కాదు కీరదోసకాయలో ఫైబర్ అధికంగా ఉండి, శరీరాన్ని చల్లబరచడంతో పాటు, కీరదోసకాలో వాటర్ కంటెంట్ మరియు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.

అలాగే పుదీనా శరీరానికి చల్లదనాన్ని చేకూర్చుతుంది. మరియు చర్మాన్ని చల్లగా ఉంచుతుంది అంతే కాదు జీర్ణ సమస్యలను, చర్మ సమస్యలను నివారించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ లో పెరుగు కూడా చేర్చి చిక్కటి స్మూతీ తయారుచేసుకోవడంతో వేసవి వేడిని బీట్ చేయడంతో పాటు, శరీర రుగ్మతలను నివారించుకోవచ్చు. మరి కీరదోస పుదీనాతో స్మూతీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Cucumber -Mint Smoothi

కావలసిన పదార్థాలు:
కీర దోసకాయ ముక్కలు - అర కప్పు (దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కలు గా తరగాలి);
పుదీనా ఆకులు - 5;
ఐస్ క్యూబ్స్ - కొన్ని;
గట్టి పెరుగు - రెండు కప్పులు;
నీళ్లు - కొద్దిగా;
చాట్ మసాలా - చిటికెడు;
నల్ల ఉప్పు - కొద్దిగా

తయారు చేయు విధానం:
1. ముందుగా కీరదోసకాయ ముక్కలు, పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
2. తర్వాత ఒక పాత్రలో పెరుగు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, టేబుల్ స్పూను నీళ్లు వేసి గిలక్కొట్టాలి.
3. తర్వాత కీరదోస + పుదీనాను మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పెరుగు మిశ్రమంతో జత చేసి మరోమారు గిలక్కొట్టాలి.
4. ఇలా తయారైన స్మూతీని గ్లాసులలో వేసి ఐస్ క్యూబ్స్ జత చేసి అందించాలి. అంతే కుకుంబర్ మింట్ స్మూతీ రెడీ

English summary

Cucumber -Mint Smoothi

The heat is showing no signs of respite and the humidity levels are at an all time high. Eagerly awaiting the onset of monsoon and if the weather forecast is to be trusted, its just 2-3 days away, making way for comforting, deep fried foods. On a hot day like today, there is nothing more refreshing than a chilled yogurt based drink. Prepared a smoothie using chilled homemade curd, fresh mint leaves and cucumber. Quick, easy and a healthy way to get calcium into your diet.cucumbers contain mostly water and are a good source of vitamin C, silica, potassium and magnesium.
Story first published: Tuesday, June 3, 2014, 12:19 [IST]
Desktop Bottom Promotion