For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగు వంకాయ: స్పైసీ అండ్ టేస్టీ

|

పెరుగు వంకాయ (కర్డ్ బ్రింజాల్)ఒక సులభమైన ఇండియ ఫుడ్. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా వండుకుంటారు. ముఖ్యంగా ఈ బ్రింజాల్ ఫ్రైకి చాలా తక్కువ మసాలాదినుసులతో తయారుచేస్తారు. కానీ ఇందులోఅల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగు వాడకం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది.

మీరు ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకొన్నప్పుడు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు వంకాయ చాలా తర్వగా అతి తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. వేరే ఏ ఇతర కర్రీ లేకపోయినా కూడా కర్డ్ బ్రింజాల్ తో రైస్ ను ఇష్టంగా తినవచ్చు. మరి మీరు కూడా ఈ కమ్మని పెరుగు వంకాయను రుచి చూడాలంటే ఎలా తయారుచేయాలో తెలుసుకోండి....

Curd Brinjal: A Spicy Delicacy

కావల్సిన పదార్థాలు:

వంకాయలు: 7-8 చిన్న తరహా
పసుపు: 1-2tsp
పంచదార: 1tsp
ఉల్లిపాయ పేస్ట్ 2-3tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ :1 ½tbsp
పచ్చిమిర్చి: 2-3 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కారం: 2tsp
ధనియాల పొడి: 1tsp
పెరుగు : 2cups
కొత్తిమీర: ½ cups(తురుము)
వెజిటబుల్ ఆయిల్: 1cup
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:

1. ముందుగా వంకాయలను తీసుకొని వాటిని మద్యలోకి కట్ చేసి, నీళ్ళలో వేసి, పసుపు,పంచదార మరియు ఉప్పు వేసి మీడియంగా ఉడికించిపెట్టుకోవాలి.
2. తర్వాత 3/4కప్పు నూనెను పాన్లో వేసి ఉడికించుకొన్న వంకాయ ముక్కలకు మీడియం మంట మీద డీఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మిగిలిన నూనెను అందులో పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ పేస్ట్ , అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పచ్చిమిర్చి వేసి 5నిముషాలు ఫ్రై చేసురకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, ధనియాల పొడి మరియు కొద్దిగా పసుపు వేసి, మొత్తం మిశ్రమాన్ని మరో 5నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. వేగుతున్న మసాలాలన్నీ కూడా పెరుగుతో బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. చాలా తక్కవు మంట మీద ఫ్రై చేసి 2,3నిముషాలు ఉడికించుకొని తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
6. తర్వాత ఒక బౌల్ లేదా డీప్ ప్లేట్ లో వంకాయలను సర్ధి తర్వాత వాటిమీద పెరుగు మిశ్రమాన్ని పోయాలి. మీ పెరుగు బ్రింజాల్ తినడానికి రెడీ . చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే కర్డ్ బ్రింజాల్ రెడీ...

English summary

Curd Brinjal: A Spicy Delicacy

This is one of the easiest Indian food recipes that you can try making at home. The best part of the brinjal or eggplant recipe is that it requires very less spices and time. If you are in a mood to do something different with your vegetables then this is one of the perfect eggplant recipes for you.
Story first published: Saturday, June 21, 2014, 11:52 [IST]
Desktop Bottom Promotion