For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునక్కాయ తీపికూర

|

Drumstick Sweet Curry
వేడి వేడి మునక్కాయ పులుసు నోట్లో పడుతుంటే.. ఆ రుచి వర్ణించడానికే వీలుకాదు. కమ్మటి వాసనకు తోడు.. పసందైన రుచిని ఆస్వాదించే వాళ్లంతా మునక్కాయలను ఇష్టపడతారు. వీటిలో పౌష్టిక విలువలు కూడా పుష్కలం. మునక్కాయలు ఎంత ఘుమఘుమలాడినా ఎప్పుడూ వండుకొనే సాంబారు, పులుసంటే బోర్ కొడుతుందనే వాళ్లూ లేకపోలేదు. అందుకే అలాంటి వాళ్ల కోసం...

కావాల్సిన పదార్థాలు:
ములక్కాయలు: 2పెద్దవి
కొబ్బరి తురుము: 1/2cup
నానబెట్టిన బియ్యం: 4-6tbsp
బెల్లం లేక పంచదార: 50grms (తీపి ఇష్టమున్నవారు మరికాస్త ఎక్కువ వేసుకోవచ్చు)
ఆవాలు, జీలకర్ర, మినపప్పు: 2tbsp
ఎండు మిరపకాయలు: 2-4
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. రెండు గంటల ముందుగా బియ్యం నానబెట్టి, కూర వండే ముందు తురిమిన పచ్చి కొబ్బరి వేసి మెత్తగా, జారుగా గ్రైండ్ చేసుకోవాలి.
2. ములక్కాడ ముక్కలు రెండంగుళాలు చప్పున ముక్కలు తరుక్కుని, చిటికెడు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి.
3. పాన్ లో గ్రైండ్ చేసిన బియ్యం, కొబ్బరి పేస్ట్ కు గ్లాసు నీళ్ళు కలిపి పోసి అడుగంటకుండా ఉడకనివ్వాలి.
4. బియ్యప్పిండి కాస్త ఉడికినట్లు అనిపించాకా అందులో బెల్లం లేదా పంచదార వెయ్యాలి.
5. ఈ మిశ్రమం వండేప్పుడు ఎంత జారుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వండిన కాసేపటికి (బియ్యంతో రుబ్బిన పేస్ట్ వేయటం వలన) గట్టిపడి అంతా గట్టి ముద్దగా అయిపోతుంది.
6. బెల్లం లేదా పంచదార కరిగాకా ఉడికిన ములక్కాడ ముక్కలు వేసి, చిటికెడు ఉప్పు కూడా వేయాలి.
7. మొత్తం అంతా మరో ఐదు నిమిషాలు ఉడికాకా పోపుదినుసులతో విడిగా పోపు పెట్టి, ఉడుకుతున్న ఈ కూరలో కలపాలి. అంతే మునక్కాయ తీపికూర రెడీ.

English summary

Drumstick Sweet Curry... | మునక్కాయ తీపికూర

It's hardly authentic curry, but it's a really easy and delicious dish. It helps to use a big oven proof pan.
Story first published:Tuesday, March 6, 2012, 17:25 [IST]
Desktop Bottom Promotion