For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలీఫ్లవర్ కోఫ్తా కర్రీ: నవరాత్రి స్పెషల్

|

గోబికోఫ్తా ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి వెజిటేరియన్ రిసిపి. ఈ వంటను ఎక్కువగా నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ లో సర్వ్ చేస్తుంటారు. అంతే కాదు, నార్త్ ఇండియన్స్ ఏ పార్టీయైనా, మరియు ఫామిలీ ఫంక్షన్స్ అయినా, ఈ వంటను ఒక సిగ్నేచర్ డిష్ గా వండుతుంటారు. ఇంకా ఇది వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వారికి ఇష్టమైనటువంటి మంచి ఫ్లేవర్ మరియు టేస్ట్ కలిగి ఉంటుంది.

కోఫ్తా గురించి మీరు వినేటప్పుడు, ఇది తయారుచేయడానికి చాలా ఎక్కువ టైమ్ పడుతుందనుకుంటారు. మరియు తయారుచేసే పద్దతి కూడా డిఫరెంట్ అనుకుంటారు. కానీ, ఈ శ్రమ, టైమ్ ను సేవ్ చేయడం కోసమనీ, చాలా వరకూ ఈ వంటను రెస్టారెంట్స్ లో ఆడర్ ఇచ్చి చేయించుకుంటుంటారు. అయితే ఈ క్రీమి వెజిటేరియన్ రిసిపిని 30-40నిముషాలు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి ఎలా తయారుచేయాలి? అందుకు కావల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం...

Gobi Kofta Curry: Navratri Special

కావలసిన పదార్థాలు:
కాలీఫ్లవర్‌: 1(మీడియం సైజ్)
టమోటాలు: 3(ముక్కలు చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
మొక్కజొన్న పిండి: 1/2cup
పచ్చిమిర్చి: 3-4
కారం : 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటా సాస్‌: 2tbsp
జీలకర్ర: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
శనగపిండి: 1/2cup

తయారీ విధానం:
1. కాలీ ఫ్లవర్‌ను విడదీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు గిన్నెలో శెనగపిండి, మొక్క జొన్న పిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా గంటెజారుగా కలుపుకోవాలి.
3. తర్వాత పాన్ లో తగినంత నూనె పోసి కాగిన తరువాత పై మిశ్రమంలో ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టు
కోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు కొన్నింటిని, టమోటా ముక్కలను కలిపి ముద్దగా చేసుకొని అదే నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి వేయించుకోవాలి.
5. ఇవి బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన కారం, టమోటా సాస్‌, రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించాలి.
6. ఇది గట్టిపడుతున్న సమయంలో వేయించిపెట్టుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలను జత చేసుకోవాలి. సన్నపు సెగన కూర గట్టిపడేంత వరకూ ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతీల్లోకి మంచి రుచిగా వుంటుంది.

English summary

Gobi Kofta Curry: Navratri Special: Telugu Vantalu

Gobi Kofta Curry: Navratri Special, Kofta curry can be made with a variety of ingredients. Gobi kofta is a specialty of the Eastern states of India. This kofta recipe includes Gobi and Tomatoes.
Desktop Bottom Promotion