For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖనిజలవణాలు సంవృద్ది..ముడిపెసల మసాలా

|

Green Gram Masala
విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రొటీన్లు, ఇతర ఎంజైములను శరీరానికి సమృద్దిగా అందించాలంటే ..అందుకు సులువైన, చౌకైన, సురక్షితమైన మార్గం ఏమైనా ఉందా? అందుకు సమాధానమే మొలకెత్తిన గింజలు, మొలకెత్తిన గింజల్లో కొవ్వుశాతం తక్కువ పీచుపదార్ధాల పరిమాణం ఎక్కువ కొలెస్ట్రాల్ ఆనవాళ్ళే ఉండవు. ఇంత మేలుచేసే మొలకెత్తిన గింజల నుండి ఇంటిల్లీపాదీ మరింత ప్రయోజనం పొందాలంటే ముడిపెసళ్ళను తినాల్సిందే..

కావలసిన పదార్ధాలు :
ముడిపెసలు : 1glass
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 2
టమోటా : 2
బంగాళా దుంపలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tsp
గరంమసాలా: 1tsp
కారం: 1tsp
నూనె: సరిపడా
పసుపు: 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం :-
1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మిక్సి లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత బంగాళా దుంపలు ఉడకపెట్టి పైన తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి ఒక నిమిషం తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనిచ్చి అందులో టమేటా వేసి బాగా మగ్గనివ్వాలి. 4. తరువాత అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కొద్దిగా వేగనిచ్చి ముడిపెసలు, తరుమి పెట్టుకొన్న బంగాళా దుంపలు వేసి ఒక గ్లాస్ నీరు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.
4. పెసలు ఉడికాక అందులో గరంమసాలా వేసి భాగా కలిపి ఒక పదినిమిషాలు ఉడకనిచ్చి, కొత్తిమీర వేసుకొని స్టౌ ఆఫ్ చేయాలి. ఇది సాయంత్రం పూట స్నాక్ గా కూడా సర్వ్ చెయ్యొచ్చు.

English summary

Green Gram Masala | గ్రీన్ గ్రామ్(ముడిపెసలు) మసాలా..

These nutrient-filled, small green beans are popular in the cuisines of India. Parathas in combination with green gram masala and chopped onions was a dinner favourite at home.
Desktop Bottom Promotion