For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ పీస్ పూరి రిసిపి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

మటర్(పచ్చిబఠానీల పూరి)నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అయినటువంటింది. ఈ పచ్చిబఠానీలతో తయారు చేసి పూరీలను రన వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టంగా తింటారు . ఎందుకంటే ఇందులో మసాలాలు జోడించడం వల్ల మరియు దీన్ని తయారుచేసిన తర్వాత మంచి సువాసన వస్తుంది.

ఈ మట్టర్ పూరీని తయారుచేయడం చాలా సులభం . ఇది అంత టేస్ట్ గా ఉండటానికి ప్రధాన కారణం ఇందులో జోడించే పదార్థాలు వల్ల . అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది .గ్రీన్ పీస్ పేస్ట్ స్టఫ్ చేసి తయారుచేసే ఈ మట్టర్ పూరీలు ఆలూ మసాలతో వడ్డిస్తే చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గాను లేదా సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ హెల్తీ గ్రీన్ పీస్ పూరీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Healthy Matar Puri Recipe for Breakfast

కావల్సిన పదార్థాలు:
మైదా: 2cups
బేకింగ్ పౌడర్: 1/2tbsp
నీళ్ళు: పిండి కలుపుకోవడానికి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

స్టఫింగ్ కోసం కావల్సినవి:
పచ్చిబఠానీలు: 1/2cup
పచ్చిమిర్చి: 3-4(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1/4tbsp
ఉప్పు: రుచికి సరిడా
గోధుమపిండి: కొద్దిగా

తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మరియు కొద్దిగా నీళ్ళు పోసి మృదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి మరియు పచ్చిబఠానీలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. తర్వాత తవా తీసుకొని వేడి చేసి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి.
4. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, పచ్చిబఠానీల మిశ్రమం, కారం, నిమ్మరసం మరియు ఉప్పు వేసి ఒక నిముషం ఎక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిశ్రమం కలగలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే కొద్దిగా గోధుమ పిండిని చిలకరించి ఒక నిముషం ఫ్రై చేసి, దించి క్రింద పెట్టుకోవాలి.
6. అంతలోపు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా పూరిలుగా వత్తుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని పూరీల్లో స్టఫ్ చేయాలి.
7. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నెయ్యి వేసి వేడయ్యాక అందులో వేసి రోస్ట్ చేసుకోవాలి. అంతే బ్రేక్ ఫాస్ట్ కు సర్వ్ చేయడానికి మటర్ పూరీ రెడీ.

English summary

Healthy Matar Puri Recipe for Breakfast


 Matar puri is quite popular in north India. The recipe for this green peas puri is a favourite among all age groups because it is loaded with spices and gives a good aroma after it is cooked. The matar ki puri recipe will blow your mind away, and it will surely be a treat to your family. Recipe for matar puri is all about mixing the right ingredients, and this fried stuffed puri is healthy as well.
Story first published: Thursday, November 13, 2014, 10:32 [IST]
Desktop Bottom Promotion