For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే హెల్తీ ఉసిరికాయ చట్నీ రెసిపి

By Nutheti
|

పుల్ల పుల్లని, వగరైన రుచిని కలిగి ఉన్న ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. వీటిని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా వంటకాల రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా.. ఉసిరికాయల్లోని పోషకవిలువలు మాత్రం సొంతం చేసుకోవచ్చు. చలికాలంలో ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.

ఉసిరికాయల్లో విటమిన్ సి, ఆకలి పెరగడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి డయాబెటీస్ తో బాధపడే వాళ్లు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టుకి, కళ్లకు మేలు చేకూరుస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరికాయను తీసుకోవడం తప్పనిసరి కదూ. అయితే డైరెక్ట్ గా తినాలంటే చాలా మంది ఇష్టపడరు. అలాంటప్పుడు టేస్టీగా చట్నీ తయారు చేసుకుని తినండి. రుచితోపాటు ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉసిరికాయ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం..

amla

కావలసిన పదార్థాలు:
ఉసిరికాయలు - 10
పచ్చిమిరపకాయలు - 8
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - టేబుల్ స్పూన్
ఉప్పు - టేబుల్ స్పూన్
నూనె - రెండు స్పూన్స్

పోపు పెట్టడానికి:
ఆవాలు - అర టీ స్పూన్
ఎండుమిరపకాయలు - రెండు
కరివేపాకు - కొద్దిగా
జీలకర్ర - అరటీ స్పూన్

తయారు చేసే విధానం:
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కడిగిన పచ్చిమిరప కాయలను వేసి కాస్త వేపుకోవాలి. మిరిపకాయలు వేగుతుండగా అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. కాసేపయ్యాక ఉసిరికాయ ముక్కలు కూడా వేసి ఐదు నిమషాలు చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఉసిరికాయలు చల్లారనివ్వాలి. అన్నీ చల్లబడిన తర్వాత వేయించిన వాటన్నింటికీ కాస్త ఉప్పు జోడించి మీక్సీ పట్టాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మరో కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు చిట వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పచ్చడిలో కలుపుకోవాలి. అంతే నోరూరించే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంగువ ఇష్టపడే వాళ్లు పోపులో ఇంగువ చేర్చుకుంటే సరి.

English summary

Healthy and Tastey Amla Chutny Recipe

This is the season of Amla and Amla Chutney is an easy way to eat Amla in your daily meal. You can get Amla in market round the year but it is abundantly available in winters. Amla is rich in vitamin c, improves appetite, digestion, good for diabetics, has a lot of anti oxidants to improve your immunity, and good for hair and eyes.
Story first published: Monday, December 7, 2015, 15:04 [IST]
Desktop Bottom Promotion