For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాజు క్యాప్సికమ్ మసాలా: బెస్ట్ కాంబినేషన్ ఫర్ వైట్ రైస్

|

మీరు ప్రతి రోజూ తిన్న వెజిటేబుల్సే మరియు కర్రీస్ తిన్నవే, తిని మీకు బోరుగా అనిపిస్తుంటే, ఇక్కడ మీకోసం ఒక టేస్టీ కర్రీ ఉంది . ఈ వంటను చాలా సులభంగా మరియు చాలా త్వరగా తయారుచేయవచ్చు .

ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను, క్రీమి టెక్చర్ ను కలిగి ఉంటుంది. ఇందులో మసాలా దినుసులు ఉపయోగించడం వల్ల మంచి ఆరోమా వాసను ఇస్తుంది. కాజు, మరియు గసగసాల పేస్ట్ , పాలు జోడించడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ ఇస్తుంది. ఇది మరింత టేస్ట్ గా ఉంటుంది. మరి ఈ స్పైసీ డిష్ ను మీరు టేస్ట్ చూడాలంటే, తయారుచేసే పద్దతిని చూడండి...

Kaju Capsicum Masala

కావల్సిన పదార్థాలు
క్యాప్సికం: 6
రెడ్ క్యాప్సికమ్: 2
పాలు: 1/2cup
ఉల్లిపాయలు: 3
వెల్లుల్లి రెబ్బలు: 15
పసుపు: 1/2tsp
కారం: 1tsp
గరం మసాలా: 1/2tsp
జీలకర్ర పొడి: 1/2tsp
కొబ్బరి తురుము: 1tbsp
జీడిపప్పు : 15
జీలకర్ర: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 1/2cup

తయారుచేయు విధానం:
1. గంట ముందుగా జీడిపప్పు, గసగసాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి.
2. తర్వాత అందులో కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3.ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యకా అందులో జీలకర్ర వేసి వేగించుకోవాలి.
4. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
5. అవి కూడా వేగాక క్యాప్సికం ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి.
6. కొద్దిసేపటికి క్యాప్సికం ముక్కలు మగ్గిన తర్వాత, అప్పుడు అందులో పాలు, ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
7. 10నిముషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది, నూనె పాన్ కు సైడ్స్ లో అంటుకుంటూ వేరుపడుతున్నట్లు కనబడుతుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే కాజు క్యాప్సికమ్ మసాలా రెడీ. ఇది ప్లెయిన్ వైట్ రైస్ కు మరియు చపాతీల్లోకి మంచి కాంబినేషన్ .

English summary

Kaju Capsicum Masala: Telugu Vantalu

If you are bored of eating the same vegetables and curries every day, here is a fresh and hassle-free recipe for you. This is a regal dish taken from the Mughlai cuisine and improvised to suit our food habits.
Story first published: Wednesday, September 23, 2015, 12:41 [IST]
Desktop Bottom Promotion