For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మజ్జిగ పులుసు: సమ్మర్ స్పెషల్ రిసిపి

|

మజ్జిగ పులుసు(బట్టర్ మిల్క్ సూప్) ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్పెషల్ రిసిపి. కమ్మగా మరియు కొంచెం పుల్లగా ఉండే ఈ మజ్జిగ పులుసు రైస్ కు ఒక బెస్ట్ కాంబినేషన్. ముఖ్యంగా మజ్జిగ పులుసు ఆంధ్రాలో చాలా ఫేమస్ అయినటువంటి వంట ఇది. రుచికరంగా, కమ్మగా ఉండే ఈ హెల్తీ డిష్, శరీరానికి చలువ చేస్తుంది. రుచిమాత్రమే కాదు మంచి ఫ్లేవర్, రంగు కూడా ఉంటుంది.

మజ్జిగ పులుసును తయారుచేయడానికి వివిధ మార్గాలున్నాయి. అయితే ఆంధ్రా ప్రాంతంలో చేసే మజ్జిగ పులుసు పసుపు రంగులో, ఆవాలు, కరివేపాకు పైకి తేలి, మంచి రంగు, వాసన కలిగి ఉంటుంది. ప్లెయిన్ గా ఇష్టపడని వాళ్ళు ఇందులో వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేసి మజ్జిగ పులుసును తయారుచేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అంటే పొట్లకాయ, సొరకా, మునగకాయ, టమోటో వంటివి ఉపయోగించి తయారుచేసుకోవచ్చు. వేసవి కాలంలో ఇది వంటికి చలువ చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి ఈ మజ్జిగపులుసును ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన దినుసలు:

మజ్జిగ: 2glss
పచ్చి మిరపకాయులు: 4
ఉల్లిపాయ: 1
పసుపు: చిటికెడు
నూనె: 2tbsp
పోపుదినుసులు:
ఆవాలు:1/2tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: మూడు రెబ్బలు
పచ్చిశెనగపప్పు: 1tsp

Majjiga Pulusu: South Indian Summer Special Recipe


తయారుచేయు విధానము:

1. మజ్జిగను బాగా చిలికి మరీ నీళ్ళగా కాకుండా కొద్దిగా చిక్కగా తయారుచేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తరిగి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకయాలు, పచ్చిశెనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి.
4. పోపు వేగుతుండగా పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. పోపు వేగిన తరవాత స్టౌ ఆఫ్ చేసి, అందులో ముందుగా చిలికి పెట్టుకొన్న మజ్జిగను వేసి, పోపులో బాగామిక్స్ చేయాలి. అంతే! ఎంతో రుచిగా వుండే మజ్జిగ చారు రెడీ!

English summary

Majjiga Pulusu: South Indian Summer Special Recipe


 Majjiga Pulusu is a traditional South Indian tangy accomplishment for hot piping rice.This is a very famous dish in Andhra.It is a delicious and healthy combination of vegetables and yogurt.This dish has a unique flavor.There are numerous ways to prepare Majjiga Pulusu, our Andhra version of Kadhi, a buttermilk based stew. This pale yellow colored stew calls for vegetables cooked in a delectable combination of fresh coconut-green chillis paste and well beaten sour curd.
Story first published: Tuesday, March 18, 2014, 12:27 [IST]
Desktop Bottom Promotion