For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar sankranti recipes : సంక్రాంతి సంబరాల్లో నోరూరించే రుచులు.. స్పెషల్ రెసిపీలివే...!

|

మన దేశంలో ఏ పండుగ వచ్చినా.. బోలెడన్నీ పిండి వంటలు రెడీగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద పండుగ సంక్రాంతి.

ఈ పండుగ సందర్భంగా చేసే వంటకాలంటే ప్రతి ఒక్కరికీ నోరూరుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గారెలు, బూరెలు, అరిసెలు, బొబ్బట్లు, కర్జూరాలు, సున్నుండలు, జంతికలు, సకినాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వంటలే ఉన్నాయి.

ఇలా రకరకాల పిండి వంటలన్నీ ఈ పండక్కి తమ పిల్లలకు, అల్లుళ్లకు, బంధువులకు తయారు చేసి పెడుతుంటారు పెద్దలు. చాలా మంది ఈ వంటల కోసం పట్నం నుండి పల్లెబాట పడతారంటే అతిశయోక్తి కాదు.

దీంతో పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. కానీ, ప్రాంతాలను బట్టి చాలా మంది అనేక వంటకాలను చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది ఎలాంటి వంటలు చేసుకుంటారు.. ఈ వంటల హడావుడి కూడా సుమారు వారం నుండే మొదలైపోతుంది. వంటకాలకు అవసరమయ్యే సమయాన్ని బట్టి ఆ రోజు ఎన్ని రకాల వంటలు చేయాలో ముందే డిసైడ్ అయిపోతారు. అలా అనేక రకాల రెసిపీలను పండక్కల్లా సిద్ధం చేసేస్తారు.

Pongal Special Recipe : సంక్రాంతికి ఈ రెసిపీ చాలా స్పెషల్ అని మీకు తెలుసా...

రవ్వలడ్డు..

రవ్వలడ్డు..

సంక్రాంతి సందర్భంగా చాలా మంది రవ్వలడ్డూతో స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేస్తారు. గోధుమ నూక, చక్కెరతో తయారు చేసే ఈ లడ్డూలంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీనే.

అరిసెలు..

అరిసెలు..

సంక్రాంతి పండుగ వస్తుందంటే.. ఎక్కువ మందికి గుర్తొచ్చే రెసిపీ అరిసెలు. అయితే ఈ అరిసెలను తయారు చేయడానికి మాత్రం కాసింత ఎక్కువ సమయమే పడుతుంది. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వీటిని ఎక్కువగా తయారు చేస్తుంటారు. అరిసెల తయారీకి బియ్యం, బెల్లం, నువ్వులు, నూనె, నెయ్యి కావాలి.

జంతికలు..

జంతికలు..

జంతికలను సంక్రాంతి పండక్కి మాత్రమే కాదు.. ప్రతి పండగలోనూ చేస్తుంటారు. ఎందుకంటే ఇవి మంచి స్నాక్స్ ఐటమ్స్. అయితే ఇవి ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. కొందరు బియ్యం, శనగపిండి, ఉప్పు, కారం, మాత్రమే వేసి వీటిని తయారు చేస్తారు. మరికొందరు వీటికి అదనంగా వాము, నువ్వులు చేర్చుతారు. వీటిలో వాడే శనగపిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియకు మంచిగా పని చేస్తుంది.

Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!

నువ్వుల ఉండలు..

నువ్వుల ఉండలు..

సంక్రాంతి సమయంలో నువ్వులతో కలిపిన వంటకాలను ఎక్కువగా చేస్తారు. రాయలసీమలో నువ్వుల రొట్టెలు తయారు చేస్తుంటారు. నువ్వుల ఉండలు.. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ నువ్వుల ఉండల్లో చాలా ప్రోటీన్లు ఉంటాయి. వీటిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెసిపీలో ఉండే బెల్లంలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉండే వారికి ఈ రెసిపీ ఎంతో బాగా పని చేస్తుంది.

సున్నుండలు..

సున్నుండలు..

సంక్రాంతి సమయంలో చేసే సున్నుండలంటే చాలా మంది తెగ ఇష్టపడుతూ ఉంటారు. సంక్రాంతి వేళ సున్నుండల తర్వాతి స్థానం సున్నుండలదే. ఎందుకంటే ఇవి తినడం వల్ల తక్షణమే మనకు కొంత శక్తి వస్తుంది. మినుములతో చేసే సున్నుండలు మనకు ఎంతో బలాన్ని కూడా ఇస్తాయి. అందుకే మన పెద్దలు ఎక్కువగా వీటిని తినడానికి ప్రియారిటీ ఇవ్వాలంటూ ఉంటారు.

సకినాలు..

సకినాలు..

ఈ రెసిపీని తయారు చేయడానికి బియ్యం, నువ్వులు, వాము, ఉప్పు మాత్రమే చాలు. ముందుగా బియ్యం నానబెట్టి.. వాటిని పిండిలా చేసుకుని.. దానిలో కొద్దిగా నువ్వులు, వాము, తగినంత ఉప్పు వేసి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ గుడ్డలో దాన్ని వేసుకుని నూనెలో ఫ్రై చేస్తే చాలు. ఎంతో రుచికరమైన సకినాలు రెడీ అయినట్టే. వీటిని తెలంగాణలో ఎక్కువగా చేస్తారు. ఇలా వండిన వాటిని సుమారు నెలరోజులకు పైనే నిల్వ ఉంచి, ఎంతో ఇష్టంగా తింటారు. కొన్ని చోట్ల దీన్నే అల్పాహారంగా స్వీకరిస్తారు.

English summary

Makar sankranti recipes in Telugu

Here we talking about the makar sankranti recipes in Telugu. Read on
Story first published: Saturday, January 9, 2021, 11:21 [IST]