For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిక్స్డ్ వెజిటేబుల్ తీయల్ ఓనమ్ స్పెషల్

|

ఓనమ్ పండుగ పాపులర్ ఇండియన్ ఫెస్టివల్. దక్షిణభారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ పండుగను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగకు ఆహారాలు, తినబండారాలు చాలా ముఖ్యం. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో స్పెషల్ గా వివిధ వెరైటీ వంటకాలను తయారుచేసుకుంటారు. దీనినే ‘ఓనమ్ సద్య' అంటారు.

మన ఇండియన్ కుషన్స్ లో కర్రీస్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో కేరళ వంటకాలు కూడా ఒకటి. కాబట్టి, ఇక్కడ ఒక కేరళ వంటకాన్నీ ప్రత్యేకంగా మిక్డ్స్ వెజిటేబుల్స్ తో తయారుచేసిన వంటను మీకు అందిస్తున్నాం. కేరళీయులకు ఓనమ్ పండుగ సందర్భంగా నోరూరించే మిక్డ్స్ వెజిటేబుల్ తీయల్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Mixed Vegetable Theeyal

కావల్సినపదార్థాలు:
క్యారెట్: 1(medium sized, diced)
మునక్కాయ: 2(medium sized, diced)
వంకాయ: 2(medium sized, diced)
కాకరకాయ: 1(medium sized, diced)
ఉల్లిపాయ :1
కొబ్బరి: ½cup(తురుము)
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
మెంతులు: 1tsp
కారం: ½tsp
చింతపండు గుజ్జు: 2tbsp
ఆవాలు: 1tsp
ఎండు మిర్చి: 3
కరివేపాకు : 6-7రెమ్మలు
నూనె: 2tbsp
నీళ్ళు: 1 ½cup

తయారుచేయు విధానం:
1. ముందుగా కూరగాయ ముక్కలన్నింటిని శుభ్రంగా కడిగి అరకప్పు నీళ్ళు పోసి, కుక్కర్ లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా ఆరనివ్వాలి.
2. కుక్కర్ లో ఆవిరి అంతా తగ్గిన తర్వాత, మూత తీసి కూరగాయ ముక్కలను మరో బౌల్లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. కొబ్బరి తురుమును, మెంతులు, ధనియాలపొడి మీడియం మంట మీద 2 నిముషాలు లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. రెండు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4. తర్వాత వేగించిపెట్టుకొన్ని కొబ్బరి తురుము, మెంతులు, ధనియాలపొడి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.
6. అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకొన్న కూరగాయ ముక్కలను కూడా వేసి, మీడియం మంట మీద 5-6నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకొన్నమసాలా ముద్దను కూడా వేసి వేగిస్తూ ఐదునిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే చింతపండు గుజ్జు, ఉప్పు, అరకప్పు నీళ్ళు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
8. తర్వాత మరో పాన్ లో ఒక టీస్పూన్ ఆయిల్ వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మరో పక్క ఉడుకుతున్న కర్రీ మిశ్రమాన్ని ఇందులో పోసి బాగా మిక్స్ చేసి, మరో రెండు నిముషాలు ఉడికించుకొని, స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మిక్స్డ్ వెజిటేబుల్ తీయల్ రెడీ . వేడి వేడి అన్నంకు చాలా ఫర్ ఫెక్ట్ గా కర్రీ

English summary

Mixed Vegetable Theeyal For Onam

Onam is a popular Indian festival. It is especially celebrated with great enthusiasm all over the Southern state of Kerala. Food is the most important part of this festival. Various kinds of special food items of Kerala are prepared and served together on a plate which is known as the 'Onam Sadhya'.
 
 
Story first published: Saturday, September 14, 2013, 13:20 [IST]
Desktop Bottom Promotion