ముల్లంగి పరాటా (పరోటా): నార్త్ ఇండియన్ స్పెషల్

Posted By:
Subscribe to Boldsky

ముల్లంగి (రాడిష్)యొక్క శాస్త్రీయనామం 'రఫనస్ సటివస్'. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకుని తింటారు. ఇది మంచి రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను ఎక్కువగా కలిగిస్తుంది.

ముల్లంగిని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. ఎందుకంటే గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. కానీ నిజానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అయితే ముల్లంగిని వండే విధానంలోనే అసలు కిటుకంతా ఉంది.వైట్‌ వండర్‌ని సరిగ్గా వండితే..అందరూ పోటి పడి తినాల్సిందే..

కాబట్టి, ముల్లంగితో ఒక అద్బుతమైన రిసిపిని మీకు ఈ రోజు పరిచయం చేస్తున్నాము..ముల్లంగా వేపుడు, చట్నీ, సాంబార్లా కాకుండా కాస్త వెరైటీగా చేయ్యండి పోటి పడి మరీ తింటారు..మరి ముల్లంగా పరోటాను ఎలా చేయాలో తెలుసుకుందాం..

Mooli Paratha Recipe

కావల్సినవి:

గోధుమపిండి : 2 కప్పులు

ముల్లంగి తురుము : కప్పు,

ముల్లంగి ఆకుల తరుగు : పావు కప్పు

పచ్చిమిర్చి : 1 (తరగాలి)

గరం మసాలా : పావు టీ స్పూన్

ధనియాలపొడి : టీ స్పూన్

కారం : టీ స్పూన్

పసుపు : పావు టీ స్పూన్

నూనె : 3 టీ స్పూన్లు

ఉప్పు : తగినంత

సూచన: ముల్లంగి తరుగును గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఈ నీళ్లను పిండి కలపడానికి వాడచ్చు.

తయారు చేయు విధానం:

1. ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఆరు భాగాలు చేసి, ముద్దలుగా చేసుకోవాలి.

2. ఒకటిన్నర కప్పు పిండిలో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీంట్లో ముల్లంగి నీళ్లతో పాటు మరికొన్ని నీళ్లు కూడా కలిపి ముద్ద చేయాలి.

3. ఈ ముద్దను కవర్‌ చేసేలా పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మిగతా సగం కప్పు పిండి పరాటా చేయడానికి కోటింగ్‌లా ఉపయోగించాలి.

4. మెత్తగా అయిన ముద్దను 6 భాగాలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేయాలి.

5. ఈ ఉండలను అరచేతి వెడల్పున ఒత్తి, మధ్యన ముల్లంగి ఉండ పెట్టాలి. చుట్టూ పిండితో రోల్‌ చేయాలి.

6. (ఇది భక్ష్యం ఉండ మాదిరి చేయాలి) తర్వాత రొట్టెల పీట మీద ఒక్కో ఉండ పెట్టి, కాస్త మందం చపాతీ మాదిరి చేయాలి.

7. పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధంగా ఉంచిన పరాటాలను వేసి, నూనె వేస్తూ రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చుకోవాలి.

8. స్టఫ్డ్‌ ముల్లంగి పరాటా సిద్ధం. వీటికి వెన్న రాసి వేడి వేడిగా టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం.

English summary

Mooli Paratha Recipe

Radish filled parathas are a delicacy up North. This Indian breakfast recipe is most popular in Punjab. Make sure you cook the radish stuffing for the mooli paratha very well.