For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ రైతా రిసిపి: సమ్మర్ స్పెషల్(వీడియో)

|

రైతా సమ్మర్ లో చాలా ఎక్కువగా ఎంపిక చేసుకొనే ఒక కూల్ ఫుడ్ రిసిపి. రైతాను చిక్కటి పెరుగుతో తయారుచేస్తారు. రైతాకు వివిధ రకాల వెజిటేబుల్స్ ను కూడా జోడించి తయారుచేస్తారు. కొన్ని సార్లు కొన్ని స్పైసీ జోడించి తయారుచేస్తారు. కానీ ఈ రోజుమనం మరో హెల్తీ అండ్ టేస్టీ పద్దతిలో రైతాను తయారుచేస్తున్నాం.

పాలక్ రైతా కూలింగ్ ఎఫెక్ట్ను అంధిస్తుంది. హాట్ సమ్మర్ లో ఇటువంటి కూలింగ్ ఎఫెక్ట్ కలిగిన రైతా ఆరోగ్యానికి చాలా మంచిది . ఈ రైతా ఆరోగ్యం కూడా. ఎందుకంటే దీన్ని పాలకూరతో తయారుచేస్తారు. పాలకూరలో పుష్కలమైనటువంటి ఐరన్ మరియు విటమిన్స్, కాల్షియంలు అధికంగా ఉన్నాయి. మరియు ఈ రైతా బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. మరి ఈ పాలక్ రైతా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Palak Raita Recipe To Beat The Heat (Watch Video)

కావల్సిన పదార్థాలు:
పాలక్(పాలకూర): 1/2cup(ఆకులను విడిపించి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి)
గాజాగా ఉండే చిక్కటి పెరుగు: 2cups
పచ్చిమిర్చి: 1/2tsp(సన్నగా తరిగినవి)
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: చిటికెడు
బ్లాక్ పెప్పర్ పౌడర్: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఆకుకూరను శుభ్రంగా కడిగి తర్వాత వేడినీటిలో వేసి ఒక నిముషం పక్కన పెట్టుకోవాలి(ఉడికించకూడదు)
2. ఒక నిముషం తర్వాత ఆకుకూరను వేడినీటి నుండి బయటకు తిసి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, పంచదార, పచ్చిమిర్చి మరియు బ్లాక్ పెప్పర్ వేసి స్పూన్ తో బాగా గిలకొట్టాలి.
4. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న పాలకూరను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
5. అంతే దీన్ని అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టి తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేయాలి. అంతే పాలక్ రైతా రెడీ.

<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="MTI1Nzc1fHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

English summary

Palak Raita Recipe To Beat The Heat (Watch Video)

Raita is the most preferred food during summer. A typical raita is prepared with thick curd and adding a medley of vegetables to it. Sometimes it is also prepared by just adding spices to it. Today we have another healthy and tasty version of raita for you.
Desktop Bottom Promotion