For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెప్పర్ కార్న్ రవ్వ దోసె-స్పెషల్ ఇన్స్ టాంట్ దోసె

|

Pepper Corn Rava Dosa
రవ్వ దోసె ఇన్స్ టాంట్ టిఫిన్. దీని మీకు టైమ్ లేనప్పుడు త్వరగా ఆఫీసులకు వెళ్ళాలనుకొనే వారు అతి తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగిన ఇన్స్ టాంట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. ఈ దోసె పిండి చాలా నీళ్ళ నీళ్ళ గా ఉంటుంది. అయితే కొంచెం ఎక్కువ పిండితో మందంగా దోసెలా పేసుకొంటే కరకరలాడే దోసె తయారవుతుంది.

ఇది సౌంత్ ఇండియన్ టిఫిన్స్ లో చాలా ఫేమస్. ఇందులో పెప్పర్ కార్న్ చేర్చడం వల్ల కొద్దిగా కారం కారంగా మంచి వాసనతో రుచికరంగా వుంటుంది. అలాగే ఇందులో మజ్జిగను కూడా చేర్చాం. మజ్జిగకు బదులు కొబ్బరి పాలు చేర్చడం వల్ల మరో వెరైటీ టేస్ట్ మీరు రుచి చూడవచ్చు.

కావల్సిన పదార్థాలు:
రవ్వ: 1cup
బియ్యం పిండి: 1cup
మైదా: 1/4cups
మజ్జిగ: 4cups
అల్లం: చిన్న ముక్క(తొక్కడుగా దంచుకోవాలి)
పచ్చిమిర్చి: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెప్పర్ కార్న్(మిరియాలు): 1tsp(పొడి చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
కొత్తిమీర: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దోసె సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి, నాలుగు కప్పుల నీళ్ళు పోసి చిక్కగా దోసె పిండిలా కలుపుకోవాలి.

2. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి బాగా వేడి చేసి, మంట మీడియంగా పెట్టి దోసె పిండిని తీసుకొని దోసెలా పోయాలి.

3. మీడియం మంట మీద రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ కాలనిచ్చి తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టి చట్నీ లేదా సాంబార్ తోటి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే పెప్పర్ కార్న్ రవ్వ దోసె రెడీ.

English summary

Pepper Corn Rava Dosa | పెప్పర్ కార్న్ రవ్వ దోసె

Rava dosai is an instant tiffin,which can be prepared in no time.The batter shud be watery and poured into a thin & cripy dosai.This is a most wanted tiffin in south Indian cuisine.
Story first published:Wednesday, January 9, 2013, 11:47 [IST]
Desktop Bottom Promotion