For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్మా పరోటా-బ్రేక్ ఫాస్ట్ రిసిపి

|

రాజ్మా పూర్తి న్యూట్రీషియన్ ఆహారం. ఇది భారత్ లో నార్త్ స్టేట్స్ లో బాగా ప్రసిద్ది. కిడ్నీ బీన్స్ ను గ్రేవీలా తయారు చేసి, వేడి వేడి అన్నం లేదా పులావ్ తో సర్వ్ చేస్తుంటారు. అలాగే రాజ్మా కూడా ఇండియన్ సబ్జీలలో చాలా పాపులర్. దీన్ని ఉల్లిపాయలు ఉపయోగించి తయారు చేస్తారు. ఉల్లిపాయలు ఉపయోగించ కుండానూ తయారు చేస్తారు. అలాగే నార్త్ సైడ్ చాలా ఇల్లలో రాజ్మాను బ్రెడ్ తో తింటారు. రాజ్మాతో పరోటాలను కూడా తయారు చేయవచ్చు .

పరోటా అనేది ఒక ఇండియన్ బ్రెడ్ గా చెప్పుకుంటారు. దీన్ని గోధుమ పిండి లేదా మైదాతో తయారు చేస్తారు. చాలా చోట్ల పరోటాలు చాలా ప్రసిద్ది చెందిన బ్రేక్ ఫాస్ట్. మరి ప్రతి రోజూ ఉదయం మీరు బ్రెడ్, ఆమ్లెట్, ఓట్ మీల్ వంటి బ్రేక్ ఫాస్ట్ తిని బోర్ కొడుతుంటే రాజ్మా పరోటాను ట్రై చేయండి . ఈ కిడ్నీ బిన్స్ ను పరోటాలో స్టఫ్ చేసి రోల్ చేసి తయారు చేస్తారు. మరి దీని తయారీ విధానం ఎలాగో చూద్దామా...

Rajma Parantha: Breakfast Recipe

కావల్సిన పదార్థాలు:
రాజ్మా: 1cup(ఉడికించి, చిదిమి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో ప్యూరీ: 1tbsp
పచ్చిమిర్చి: 3(సన్నగా కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
కారంం 1tsp
గరం మసాలా: 1/2tsp
జీలకర్ర: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 1cup
నూనె: 2tbsp

పిండి కలుపుకోవడానికి
గోధుమ పిండి: 2cups
ఉప్పు: చిటికెడు
నూనె : 2tsp
నీళ్ళు: 2cups

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవని, పిండికోసం తీసుకొన్న పదార్థాలన్నింటిని వేసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకొని, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసిన తర్వాత అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిముషాలు బాగా వేగించుకోవాలి(ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకోవాలి)
3. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు ఉప్పు కూడా వేసి కొన్ని నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులోనే టమోటో గుజ్జును కూడా వేసి బాగా ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో స్మాష్ చేసి పెట్టుకొన్న రాజ్మా, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మీడియం మంట మీద గ్రేవీ పూర్తిగా ఇగిరిపోయే వరకూ ఉడికించుకోవాలి. మసాలా అంతా ఉడికిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, చల్లారినివ్వాలి.
5. తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. అంతలోపు, పిండిలో కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా చుట్టుకోవాలి, తర్వాత చపాతీ కర్రతో పరోటాలా చుట్టుకోవాలి.
6. తర్వాత పరోటా మద్యలో ముందుగా తయారు చేసి పెట్టుకొన్న రాజ్మా మసాలను పెట్టి రోల్ చేసి అన్ని వైపులా కవర్ అయ్యేలా చేసి తర్వాత మళ్ళీ పరోటాలా వెడల్పుుగా చుట్టుకోవాలి.
7. ఇలా అన్నింటిని తయారు చేసిపెట్టుకొన్నాక, కాలే పాన్ మీద వేసి రెండు వైపులా నూనె వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే, తినడానికి రాజ్మా పరోటా రెడీ. వీటిని పెరుగు లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

English summary

Rajma Parantha: Breakfast Recipe | రాజ్మా పరోటా-బ్రేక్ ఫాస్ట్ రిసిపి

Rajma is a nutritious bean that is widely popular in the northern states of India. The kidney beans is prepared as a gravy and teamed up with steamed rice or pulao. Rajma is a popular Indian sabji that is made with and without onion.
Story first published: Monday, June 24, 2013, 11:16 [IST]
Desktop Bottom Promotion