For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ : సేమియా బిసిబేళబాత్

|

Semiya Bisi Bele Bath
సాధారణంగా సేమియా అంటేనే పాయసం గుర్తొస్తుంది. ఎందుకంటే సేమియా పాయసం అంటే అందరీకి ఇష్టం కనుక. సేమియా పాయసం లేనిదే ఏ పండుగ, శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. సేమియాతో వివిధ రకాల వంటలు చేస్తారు. సేమియా ఉప్మా, సేమియా పాయసం... అందరికీ తెలిసిన స్వీట్ అండ్ సాల్ట్ ఐటమ్స్! సేమ్ టు సేమ్ కాకుండా... సేమ్యాను ఇంకోరకంగా చేసుకోలేమా? కచ్చితంగా ప్రయత్నిస్తే ఓ కొత్త రుచిని చూడవచ్చు. బిసిబేళబాత్ ఇది కర్ణాటక స్పెషల్ బ్రేక్ ఫాస్ట్, బియ్యం, కందిపప్పు, కూరగాయలతో తయారు చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ అక్కడ చాలా ఫేమస్. అదే తరహాలో కొంచెం డిఫరెంట్ గా ఆంధ్రా స్టైల్లో బిసిబేళబాత్ బియ్యం కాకుండా సేమియాతో ట్రై చేస్తే చాలా అద్భుతమైన సాఫ్ట్ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ ను పిల్లలు, పెద్దలు అందరూ హ్యీపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు.

కావలసినవి:
సేమియా: 250grms
కందిపప్పు : 1cup
మునగకాడలు: 2
వంకాయ ముక్కలు: 1/2cup
ఉల్లి తరుగు: 1cup
క్యారట్ తరుగు: 1cup
టొమాటో తరుగు: 1cup
పచ్చిమిర్చి తరుగు: 4
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ : చిటికెడు
చింతపండుగుజ్జు: 2tbsp
ఎండుమిర్చి : 2, లవంగాలు : 3
పసుపు : 1/2tsp
దాల్చినచెక్క : చిన్నముక్క
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
నూనె : గరిటెడు, ఉప్పు : రుచికి తగినంత
కారం : 1/2tsp
సాంబారు పొడి: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు కప్పుల నీటిలో టీ స్పూను నూనె వేసి సేమియాను ఉడికించాలి. ఉడికిన సేమ్యాను చల్లని నీటితో బాగా కడిగి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత కందిపప్పు కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరవాత లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
4. తరవాత కూర ముక్కలన్నీ వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక చింతపండురసం, సాంబారు పొడి వేసి బాగా కలిపి, ఉప్పు, కారం, ఉడికించిన కందిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలసేపు ఉడికించాలి. చివరగా ఉడికించిన సేమియా, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. అంతే సేమియా బిసిబేళబాత్ రెడీ..

English summary

Semiya Bisi Bele Bath | వెరైటీ సేమియా బిసిబేళబాత్

Bisi bele bath is a famous dish from Karnataka. Bisibelebath is the most common of dishes to the Karnataka cuisine.... Nothing beats home made Bisibelebath.
Story first published:Wednesday, January 2, 2013, 11:49 [IST]
Desktop Bottom Promotion