For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షహీ మటర్ పనీర్ రిసిపి: రాయల్ స్పెషల్ రిసిపి

|

ఇప్పుడు ఉన్న సీజన్ చాలా బ్యూటిఫుల్ సీజన్. సీజన్ లో చాలా వరకూ అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వింటర్ లో గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా మనకు అందు బాటులో ఉంటాయి. అటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ లో గ్రీన్ పీస్ (పచ్చిబఠానీ)ఒకటి. గ్రీన్ పీస్ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఈ గ్రీన్ పీస్ తో ఒక పాపులర్ వంటను మీకు పరిచయం చేస్తున్నాము. అదే షమీ మటర్ పనీర్ రిసిపి. ఇది ఒక అద్భుతమైనటువంటి వెజిటేరియన్ రిసిపి. ఇది ఒక రాయల్ కిచెన్ వంట, ఇది నిజామ్ ల కాలం నాటి అద్భుతమైన రుచికరమైన వంట. షహీ వంటలు ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఈ మటర్ పనీర్ రిసిపినే షహీ మటర్ పనీర్ గా పిలుచుకుంటారు. షహీ అంటే రాయ్ అని అర్ధం మరియు ఈ వంటను తయారుచేయు విధనాంలోనే మీ టేస్ట్ బడ్స్ కు ఒక రాయల్ ట్రీట్ వంటిది. సిల్కీ పన్నీర్ మరియు ఫ్రెష్ గ్రీన్ పీస్ మరియు జీడిప్పు జోడించి తయారుచేసే ఈషహీ గ్రేవి మీకు మరింత క్రేజీ వెజిటేరియన్ రిసిపిగా మారిపోతుంది. మరి ఈ షహీ మటర్ పనీర్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Serves: 3
Preparation time: 10 minutes
Cooking time: 20 minutes

కావల్సిన పదార్థాలు:
ఫ్రెష్ గ్రీన్ పీస్(పచ్చిబఠానీలు): 200grm
పనీర్: 1cup
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6-7
జీడిపప్పు: 10-15 (నీటిలో నానబెట్టుకోవాలి)
టమోటాలు 2 (సన్నగా తరిగినవి)
ధనియా పౌడర్ - 1tsp
పసుపు పొడి: 1tsp
మిరప పొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాల పొడి: 1tsp
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
మెంతి ఆకులు(ఎండినవి): 2 tbsp
కుక్కింగ్ బటర్ / నూనె : 2 tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక చెంచా నూనె లేదా బట్టర్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేయాలి.
2. వేగిన ఉల్లిపాయలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి , అదే పాన్ లో పన్నీర్ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. పన్నీ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి మార్చుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రై చేసుకొన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు టమోటో ను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5.అలాగే జీడిపప్పును కూడా మిక్సీలో వేసి సరిపడా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6.ఇప్పు పాన్ లో మరో చెంచా నూనె లేదా బటర్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
7. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి టమోటో పేస్ట్ వేసి మీడియం మంట మీద 3-4నిముషాలు ఫ్రై చేైసుకోవాలి.
8. ఇప్పుడు అందులోనే పసుపు, ధనియాలపొడి, కారం మరియు పచ్చిబఠానీలు వేసి 5నిముషాలు ఫ్రై చేయాలి.
9. తర్వాత ఉప్పు మరియు జీడిపప్పు పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేయాలి.
10. ఇప్పుడు చేతిలోకి ఎండిన మెంతి ఆకులు తీసుకొని బాగ నలిపి పొడి చేసి ఉడుకుతున్న కర్రీ మీద చల్లి, మొత్తమిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
11. ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
12. పన్నీర్, మటర్ రెండూ మెత్గగా ఉడికి తర్వాత గరం మసాలా పౌడర్ చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే షహీ మటర్ పనీర్ గ్రేవీ రెడి . దీన్ని రోటీ లేదాపులావ్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

Shahi Matar Paneer Recipe

న్యూటిషనల్ వాల్యూస్: షమీ మటర్ పనీర్ రిసిపిలో మంచి కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీనలున్నాయి. అందువల్ల జీడిపప్పు మరియు వెన్నతో వండేటప్పుడు మరిన్ని క్యాలరీన్స్ ను తయారుచేస్తుంది .

English summary

Shahi Matar Paneer Recipe

It is the beautiful season of winter and the season of the best vegetables that we can consume. During winter, green peas are available in abundance. The fresh green peas taste incredible and anything made of it tastes heavenly in this season.
Story first published: Tuesday, November 25, 2014, 18:03 [IST]
Desktop Bottom Promotion