మెత్తని చపాతీలకు చిట్కాలు

By: Deepti
Subscribe to Boldsky

రోటీలు, చపాతీలు దేశవ్యాప్తంగా మనకి ముఖ్యాహారంగా ఉంటూ వచ్చాయి. చపాతీలైతే కేవలం నిమిషాల్లో తయారవుతాయి. కానీ కొంతమంది సమస్య ఏంటంటే, ఎన్నిరకాలుగా ప్రయత్నించినా, తమ చపాతీలు మెత్తగా రావు.

వంటచేసేటప్పుడు, ఆ పదార్థాలను తయారుచేసే సరియైన విధానం తెలిసివుండటం ముఖ్యం. అలాగే, చపాతీలు చేసేటప్పుడు కూడా కొన్ని పాటించాల్సిన పద్ధతులున్నాయి. మెత్తని చపాతీ కావాలంటే గోధుమపిండిని వేడినీటితో మర్దనచేసి పక్కన అలా ఉంచండి (కనీసం 30నిమిషాలు).

రెగ్యులర్ గా చపాతి తినడం వల్ల పొందే లాభాలు

గుర్తుంచుకోవాల్సిన విషయం పిండిని వత్తేటప్పుడు అదనంగా పిండిని వేయకండి. ఇలాంటివే మెత్తని చపాతీలు రావటంలో సాయపడతాయి.

అయితే ఈ రోజు మనం చపాతీలు మెత్తగా ఎలా వండాలో నేర్చుకుందాం. ఈ కింది చిట్కాలు పాటించి మృదువైన చపాతీలు ఆస్వాదించండి.

Making soft Chapatis

కావాల్సిన వస్తువులు:

గోధుమపిండి -3 కప్పులు

వేడి నీరు

ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా

నూనె

Making soft Chapatis

హెల్తీ అండ్ టేస్టీ పాలక్ చపాతీ

చేయాల్సిన పద్ధతి:

1. ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి. కప్పు వేడినీటితో కలిపి అరగంట సేపు ఆ మిశ్రమాన్ని నానబెట్టండి.

2. అరగంట తర్వాత, ఆ మిశ్రమాన్ని కలుపుతూ మర్దన చేస్తూ పిండిముద్దగా చేయండి. ఆ పిండిముద్దను శుభ్రమైన, చదునైన స్థలంపై వేసి పది నిమిషాలపాటు మర్దన చేస్తూ ఉండండి.

Making soft Chapatis

3. నీరు తగినంత కలుపుతూ ఉండండి. ఎక్కువగా వేయకండి. గిన్నెలో పిండి మిగలకుండా కలపండి. పదినిముషాల పాటు అలా ఉంచేయండి.

4. ఇక చిన్న చిన్న గుండ్రని ముద్దలు తీసుకుని, వాటిని క్రమంగా వత్తి, మెత్తని చపాతీలు తయారుచేసుకోండి.

రైస్ -చపాతీ ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ వంకాయ కర్రీ:

గమనిక: పిండిని కలిపేటప్పుడు మరీ ఎక్కువ పిండిని వేయకండి. పిండిని వత్తేటప్పుడు ఇరుపక్కలా అదనంగా పిండిని వేస్తూ ఉండటం వల్ల చపాతీలు కొన్నిసార్లు గట్టిగా వస్తాయి.

Making soft Chapatis

5. పెనాన్ని వేడిచేసి ఈ వత్తిన పిండిని దానిమీద వేయండి. చపాతీ పెనంపై ఉన్నప్పుడు ఎక్కువ నూనెను వేయకండి. రెండుపక్కలా సన్నని మంటపై వేయించండి.

ఇక మీ వేడి వేడి, మెత్తని చపాతీలను కూరతో కలిపి వడ్డించుకోండి. ఈ కొత్త పద్ధతిని ప్రయత్నించాక మాకు మీ అనుభవాన్ని తెలియచేయండి.

Read more about: roti, recipe, చపాతీ
English summary

Simple Tricks To Make Soft Chapati

Want to make soft chapati? Take a look at the simple tricks to make soft chapatis.
Story first published: Thursday, July 6, 2017, 12:00 [IST]
Subscribe Newsletter