For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోయా పాలక్ పరోటా...

|

Soya Palak Paratha.
కావలసిన పదార్ధాలు:
సోయా పిండి: 1/2kg
పాలకూర: 4కట్టలు
పచ్చిమిర్చి: రుచికి సరిపడా
అల్లం: 2tsp
దనియాల పొడి: 1/2tsp
గరం మసాలా: 1/2tsp
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి

తయారు చేయు పద్దతి:
1. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేయాలి. పచ్చిమిర్చి కూడా సన్నని ముక్కలుగా కోయాలి. వీటన్నింటిని సోయాపిండిలో వేసి కలిపి చపాతి ముద్దలా చేసుకోవాలి.
2. ఇప్పుడు ఈ ముద్దపై తడిబట్ట కప్పి అరగంట పాటు కప్పి నాననివ్వాలి. తర్వాత దీనిని చిన్న ఉండలుగా చేసుకోవాలి.
3. తర్వాత చపాతీల్లా వత్తుకొని, పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి రెండువైపులా కాల్చుకోవాలి. అంతే సోయా పాలక్ పరోటా రెడీ. దీన్ని పెరుగు పచ్చడితో వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

English summary

Soya Palak Paratha...| సోయా పాలక్ పరోటా...

Learn to keep a check on your blood cholesterol levels with this easy soya paratha recipe. Try out one paratha and you are sure to be tempted..Palak is a type of spinach that is available more in winter season. It is tasty, easy to clean and also cooks faster.
Story first published:Monday, April 30, 2012, 12:30 [IST]
Desktop Bottom Promotion