For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పినాచ్ మరియు గార్లిక్ రైస్

|

Rice(రైస్) తో వండే వంటలు ఎప్పుడూ చాలా సులభంగా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు . ముఖ్యంగా పనిచేసే మహిళలకు రైస్ వరైటీ వంటలు చాలానే తెలిసి ఉంటాయి . అలాంటి రైస్ రిసిపిలలో టమోటో రైస్, ఆలూ రైస్, జీరా రైస్ చాలా సాధారణంగా చేసుకొనే వంటలు . ఆకుకూరలతో కూడా రుచికరమైన రైస్ రిసిపిని తయారుచేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా..; ఇది చాలా డిఫరెంట్ రిసిపి. ఈ వంటను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.

ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్. ఇందులో విటమిన్ కె, సి, లు మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ పుష్కలంగా ఉండి బెటర్ బ్లడ్ షర్కులేషన్ కు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భినీ స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి . ఇది పొట్టలో పెరిగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఫీటస్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. మరి ఈ స్పినాచ్ గార్లిక్ రైస్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Spinach and Garlic Rice


కావల్సిన పదార్థాలు:
సన్నగా తరిగిన పాలకూర: 4cups
అన్నం: 2cups
జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ తరుగు: 1cup
వెల్లుల్లి రెబ్బలు: 15
టమోటో తరుగు: 1/2cup
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాలకూర తరుగును శుభ్రంగా కడిగి, మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
3. తర్వాత టమోటో తరుగు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.
4. 5నిముషాలు ఈ మొత్తం మిశ్రమాన్ని వేగించుకొన్నాక ముందుగా తయారుచేసి పెట్టుకొన్ని పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.
5. పాలకూరలో పచ్చివాసన పోయేదాక వేయించి, ఆపై అన్నం కూడా వేసుకుని కలిపి సన్నని మంటపై వేయించాలి. అన్నం బాగా వేడయ్యాక దింపేస్తే చాలు.

English summary

Spinach and Garlic Rice

Spinach and Garlic Rice,Rice recipes are the quickest and easiest recipes to prepare, specially for working women. Some common rice recipes include tomato rice, aloo rice, jeera rice, etc. However, did you know that you can cook a delicious rice recipe with Spinach? This is a very different recipe, and trust
Story first published: Wednesday, February 24, 2016, 12:35 [IST]
Desktop Bottom Promotion