For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ కార్న్ పాలక్ కర్రీ...

|

Sweet Corn Palak
ఎప్పుడూ పాలకూర వెరయిటీగా ఎలా వండాలా అని ఆలోచిస్తుంటాం. ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. పాలకూరలో ఉన్న పోషకాలు మరి ఎందులోను అంత ఎక్కువగా ఉండవు. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. ఇందులో ఉన్న విటమిన్‌ ఏ, సీ, పీచుపదార్థం‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియంలు అధిక మోతాదులో ఉన్నాయి. మరి ఈ పాలకూరతో కొంచెం వెరైటీగా స్వీట్ కార్న్ చేర్చి చేస్తే మరింత రుచిగా ఉంటుంది..అదెలాగో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
పాలకూర తరుగు: 2cup
స్వీట్ కార్న్: 1cup
పెసరపప్పు: 2tbps
పచ్చిమిర్చి: 6-8
టమోటో: 2
అల్లం: చిన్న ముక్క
ఉల్లిపాయ: 2
క్రీమ్: 1/2cup
లవంగాలు: 10
యాలకులు: 4
గరంమసాలా: 1tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కారం: తగినంత
ఆమ్ చూర్ పొడి: 1/2tsp
నెయ్యి: 3tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
2. తర్వాత స్వీట్ కార్న్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పెసరప్పు, పాలకూరనూ శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. పాలకూరను తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండింటినీ కలపి అందులో పసుపు యాలకులు, లవంగాల పొడి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరుగు, అల్లం, టమోటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి.
4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఉడికిన పెసరపప్పును మొత్తగా మెదపాలి.
5. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి స్టౌ మీద పెట్టి, కరిగిన తర్వాత ఉడికించి పెట్టుకొన్న కార్న్, పెసరప్పు, పాలకూర, ఉప్పు, పసుపు ఆమ్ చూర్ పొడి, కారం, గరంమసాలా వేసి కలియతిప్పాలి.
6. కొద్దిసేపయ్యాక క్రీమ్ వేయాలి. ఇది అందుబాటులో లేకపోతే పాల మీగడ వేసినా సరిపోతుంది. కర్రీ దగ్గరపడగానే స్టౌ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే స్వీట్ కార్న్ పాలక్ కర్రీ రెడీ...

English summary

Sweet Corn Palak Curry... | స్వీట్ కార్న్ పాలక్ కర్రీ...

Palak is a healthy vegetarian food. It contains iron. We can cook many varieties of items using this leaves. This time we can try this Sweet corn palak...
Story first published:Friday, May 25, 2012, 17:34 [IST]
Desktop Bottom Promotion