For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే పుల్లని టేస్టీ మామిడికాయ పచ్చడి: సమ్మర్ స్పెషల్

|

వేసవిలో అందరి కళ్లు మామిడి చెట్లమీదే. ఆకుల మధ్యన వేలాడే పచ్చి మామిడికాయలను చూడగానే ఎంతటివారికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లటివైతే పప్పులో వేసుకుంటారు. కాస్త పులుపు తక్కువగా ఉంటే ప్లేట్లో ఉప్పు, కారం వేసుకుని లాగిచేస్తారు. కాయలు పళ్లయ్యేవరకూ ఆగడమంటే చాలా కష్టం. రెండు కాయలందుకుంటే గాని మనసు ఊరుకోదు. పచ్చిమామిడి. ఆ పులుపు తలచుకుంటేనే నోరూరుతుంది. ఈ ఏడాది తొలి మామిడికాయ.భలే పుల్లగా ఉంది.మామిడికాయతో ఎలా పచ్చడి. చేసినా ఇష్టమే.చేసీచేసీ నాకు విసుగురావాలే కానీ రోజూ చేసినా తింటారు మా ఇంట్లో. అందుకే మొదటగా కొబ్బరితో కలిపి ఈ పచ్చడి చేశాను.

Tasty And Tangy Mango Pachadi Recipe

పచ్చిమామిడియ- 1 cup (chopped)
బెల్లం: 1/2 cup
ఎండు మిర్చి: 5 to 6
ఆవాలు:1tps
కరివేపాకు : 8 to 10
కొబ్బరి తురుము: 1/2 cup
కొత్తిమీర : 4 to 5
ఉప్పు రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో పచ్చిమామిడికాయ ముక్కలు వేయాలి.
2. ఈ బౌల్ స్టౌ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
3. అంతలోపు , మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు వేసి, బెల్లం తురము వేసి చిక్కటి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాిలి.
4. ఇప్పుడు మెత్తగా ఉడికిన మామిడి ముక్కలనుండి అదనపు నీరు పక్కకు వంపేసుకోవాలి. తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేయాలి.
5. ఇప్పుడు అందులోనే ముందుగా వేగించి పెట్టుకొన్న ఎండు మిర్చి , కొబ్బరి తురుము వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టి అందులో బెల్లం నీటినివేసి కొద్దిగా సేపు ఉడికించుకోవాలి.
7. కొద్దిసేపటి తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకొన్ని మామిడికాయ పచ్చడి వేయాలి మొత్తం మిశ్రమాన్ని కలగలుపూత ఉడికించాలి.
8. అవసరం అయితే కొద్దిగా నీరు, ఉప్పు వేసి బాగా ఉడికించి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.

English summary

Tasty And Tangy Mango Pachadi Recipe

Tasty And Tangy Mango Pachadi Recipe,There is one special reason for you to wait for summer. And do you know why? Well, summer is the season for mangoes and the varieties of mangoes that are available in the market.
Story first published: Thursday, April 21, 2016, 12:43 [IST]
Desktop Bottom Promotion