For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరించే మూంగ్ దాల్ దోస రిసిపి: హెల్తీ బ్రేక్ ఫాస్ట్

|

మీరు ఈ రోజు ఉదయం ఒక ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తినాలనుకుంటున్నారా,మరి అయితే మీకోసం ఒక అద్భుతమైన రుచిగల బ్రేక్ ఫాస్ట్ రిసిపిని అందిస్తున్నాం. పెసరట్టు మీకు బాగా తెలుసు. ఆంధ్రస్టైల్ పెసరట్టు అంటే అందరికీ చాలా ఇష్టం.

వేడి వేడి పెసరట్టును కొంచెం స్టైల్ మార్చి దోసెలా తయారుచేస్తే ఎలా ఉంటుందో, ఈ పెసరట్టు దోస తెలుపుతుంది. అందుకు ముడిపెసళ్ళుతో పాటు, పచ్చిబియ్యం కూడా కొద్దిగా నానబెట్టి, తయారుచేసే ఈ పెసరట్టుదోసె కొబ్బరి చట్నీతో మీ టేస్ట్ బడ్స్ కు అద్భుతమైన రుచి అంధిస్తుంది. మరి మీరు కూడా ఈ ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి టేస్ట్ చేయాలంటే, తయారుచేసే పద్దతి తెలుసుకోవాలిగా మరి....

Tempting: Moong Dal Dosa Recipe

కావల్సిన పదార్థాలు :
ముడి పెసలు: 2cups
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఇంగువ: చిటికెడు
బియ్యం పిండి: 1/4tbsp
కొత్తిమీర: 1/4cup(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా

టాపింగ్ కోసం:
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు: కొద్దిగా
నెయ్యి: ఫ్రై చేసుకోవడానికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ముడి పెసళ్ళను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. మరుసటి రోజు ఉదయం నీరు వంపేసి, మిక్సీలో వేసి, వాటితో పాటు పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ, బియ్యం పిండి, కొత్తిమీర, ఉప్పు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోనికి మార్చుకోవాలి. మరికొద్దిగా బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక అందులో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా వేడయ్యే వరకూ అలాగే ఉంచాలి.
5. ఇప్పుడు ఒక పెద్ద గరిటతో పిండి తీసుకొని దోసెలాగ పాన్ మీద పోసి, పాన్ మొత్తం సర్దుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ను దోసమీద చిలకరించుకోవాలి.
6. తర్వాత ఫ్రై అవుతున్న దోసె మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు చల్లులకొని స్పూన్ తో దెసెలోపలికి ప్రెస్ చేయాలి. మరికొద్దిగా నూనె చిలకరించి మీడియం మంట మీద దోసెను కాలనివ్వాలి.
7. దోసెకు సైడ్స్ లో క్రిస్పీగా బ్రౌన్ కలర్ లో మారినప్పుడు దోసెను తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి.

English summary

Tempting: Moong Dal Dosa Recipe


 The dosa can be made with whole moong beans or spilt moong lentils which are popularly known as green gram too. The health gram is well known in Andhra Pradesh and there are a lot of other dishes too which is prepared with this ingredient.
Story first published: Wednesday, December 10, 2014, 10:09 [IST]
Desktop Bottom Promotion