For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ టమోటో మజ్జిగ పులుసు

|

మజ్జిగ పులుసు సౌత్ ఇండియన్ రిసిపిలలో చాలా ఫేమస్ అయినటువంటి వంట(దీన్నే సౌత్ ఇండియన్ కడి) అంటారు. ఒక్కోక్కరు ఒక్కో విధంగా తయారుచేస్తారు. ఒక్కోక్కటి దానికదే ప్రత్యేక టేస్ట్ ను కలిగి ఉంటుంది. మజ్జిగ పులుసు ఇతర పులుసుల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే వీటిని వివిధ రకాల వెజిటేబుల్స్ తో తయారుచేస్తారు. అదే విధంగా పోపుకోసం వివిధ రకాల పోపుదినుసులు ఉపయోగించడం వల్ల మంచి సువాసనతో పాటు కమ్మటి టేస్ట్ ఉంటుంది.

మజ్జిగ పులుసును మజ్జిగతో తయారుచేస్తారు మరియు దీన్ని తయారుచేయడానికి కొన్ని పోపుదినుసులు మరియు మసాలా దినుసులు, టమోటోలు కూడా ఉపయోగిస్తారు. ఈ వంట తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టడు. మరియు ఇది ఆరోగ్యానికి చాలా మేలు మరియు చలువ చేస్తుంది. పొట్టను చల్లగా ఉంచుతుంది. పుల్లని రుచి ఫ్లేవర్ కలిగిన ఈ మజ్జిగ పులుసును ఎలా తయారుచేయాలో చూద్దాం...

Tomato -Butter Milk Pulusu

కావలసిన పదార్థాలు:
టమాటాలు - రెండు(సన్నగా
మజ్జిగ - నాలుగు కప్పులు,
శనగ పిండి - ఒక టీస్పూను,
పసుపు - చిటికెడు,
ఉప్పు - రుచికి తగినంత,
పచ్చి మిర్చి - రెండు,
అల్లం ముక్కలు - ఒక టీ స్పూను,
వాము - అర టీ స్పూను,
కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూను.
తాలింపు కోసం -
శెనగపప్పు: 2tsp
ఉద్దిపప్పు: 1tsp
ఎండుమిర్చి: 3
మెంతులు: 1tsp
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఇంగువ: చిటికెడు
ఉప్పు రుచికి సరిపడా

తయారుచేసే విధానం:
1. టమాటా ముక్కల్లో మజ్జిగ, ఉప్పు, పసుపుతో పాటు, శనగ పిండిని నీళ్ళల్లో కలిపి వేసి ఉడికించాలి.
2. తరువాత వాము, పచ్చి మిర్చి, అల్లం ముద్ద నూరుకుని, ఉడుకుతున్న టమోటో ముక్కల్లో వేసి మరికాసేపు సన్నని మంట మీద ఉడికించి దించుకోవాలి.
3. చల్లారాక తాలింపు వేసుకుని కొత్తిమీర చల్లుకోవాలి. అంతే టమోటో మజ్జిగ పులుసు రెడీ

English summary

Tomato -Butter Milk Pulusu

Butter milk is basically beaten yogurt or yogurt diluted with water. In olden days the yogurt/curd and water mixture is churned repeatedly in order to separate the fat (butter) and then the remaining butter milk is used in making this recipe.
Story first published: Thursday, October 8, 2015, 12:22 [IST]
Desktop Bottom Promotion