For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటింగ్ వల్ల ఇన్ని సమస్యలా...?

By Sindhu
|

ఒకప్పుడు పెళ్లికాని ఆడ, మగా కలిసి మాట్లాడుకుంటుంటేనే నోరు వెళ్లబెట్టి చూసే కాలానికి ఏనాడో కాలం చెల్లింది. పెళ్లికాకుండానే ఒకే ఇంటిలో సంవత్సరాల తరబడి ఉంటున్న వారినిచూసి, ఓహో... వారు సహజీవనం చేస్తున్నారా...ఈ రోజుల్లో ఇవన్నీ సర్వసాధారణమే అనుకునే రోజులకు మన నాగరికత ఎదిగింది.(?) విదేశాలలో ఉండే ఈ సంస్కృతి మనదేశంలోకి ప్రవేశించి అన్ని మెట్రో నగరాలతో పాటు ఓ మోస్తరు పట్టణాలకు కూడా వేగంగా విస్తరించింది. మనం ఆహ్వానించిన ఈ విచిత్ర సంబంధానికి సుప్రీంకోర్టుకూడా ఆమోదం తెలుపడంతో ఈ బంధం మరింత బలపడింది. సుధీర్ఘ కాలం జంటలు కలిసి ఉన్నట్లయితే అలాంటి బంధం వివాహంతో సమానమేనని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఇలాంటి బంధాలు కలకాలం నిలవలేని పరిస్థితులు నేడు ఏర్పడుతున్నాయి.

1. ఆకర్షణ, ప్రేమతో: ఒకటైన జంటలు నేడు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నాయి. దాంతో కొత్తగా సహజీవన బంధంలోకి అడుగుపెట్టాలను కు నేవారికి ఇది ఒక హెచ్చరికగా మారుతోంది. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌తో ఒకటైన వారు నేడు లీవ్‌ ఇట్‌ అని అర్థాంతరంగా విడిపోతున్నారు. వీటన్నింటికీ నిబ ద్ధత లోపమేనని నిపుణులు అంటున్నారు.రరకాల కారణాలతో నగరాలకు చేరిన యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ లో పడి ఇద్దరి అంగీకారంతో ఒకే ఇంట్లో నివసించేందుకు నిర్ణయించుకుంటు న్నారు. తమ ప్రేమ కోసం, ఆకర్షణకు సమాజ ట్టుబాట్లు, సాంస్కృతిక వైరు ధ్యాలు, కుటుంబచరిత్ర, ఆర్థికపరమైన అంశాలను పక్కన పెడుతున్నారు. అయితే వీరు విస్మరిం చిన ఈ విషయాలన్నీ తరువాత వారి మధ్య విభేదాలకు దారితీస్తు న్నాయి. అంతేకాదు ఆ ఉల్లాస స్థితి ముగిశా క ఈ బంధం తాలూకు ఆకర్షణను సమాధి చేస్తున్నాయి. నిబద్ధతలేమి, అక్రమ సంబం ధాలు వీరి సహజీవన బంధాన్ని తెగతెంపులు చేస్తున్నాయి.

5 Common Relationship Problems in Dating

2. అర్థాంతరంగానే ముగుస్తున్నాయి: 'నాగరికత పెరగడం, యువతీ యువకులు ఇద్దరూ ఉన్నత చదువలు చదివి ఉద్యోగాలు చేస్తుండటంతో ఆడామగ మధ్య ఉండే విభజన రేఖ చాలా చిన్నదై పోయింది. దాంతో కలిసి ఉద్యోగాలు చేయడాలు, ఒకే బైక్‌మీద ప్రయాణించ డాలు మామూలు విషయమై పోయింది. ఆడా మగా ఒకే చోట ఉండే అవకా శాలు పెరగడంవల్ల వారి మధ్య ఆకర్షణ, ప్రేమ కలగడం సాధారణమై పోయిం ది. దీంతో చాలామంది యువతీయువకులు పెళ్లిచేసుకోకుండానే సహ జీవనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తమ పెద్దలను కలుసుకోకుండానే ఒకే ఇంటిలో కలిసి ఉంటున్నారు. అయితే, ఈ బంధం కాలక్రమేణా అనేక పొరపొ చ్చాలతో విడిపోతున్నాయి. ఇందుకు బలమైన కారణం వారిమధ్య అవగాహనా లోపం పెరగడం, ఇరువురిమధ్య ఉండే ఆకర్షణ తగ్గడం మొదటి కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ సహజీవన బంధాల్లో అత్యధిక శాతం అర్థాంతరం గానే ముగుస్తున్నాయి' అని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

3. ఆధిపత్య దోరణి: మగాళ్ల కుండే ఆధిపత్య ధోరణి కూడా ఈ బంధాలు విడిపోవడానికి కారణ మని కొంతమంది అమ్మాయిలు అంటున్నారు. అలాకాకుండా పనిని విభజించుకోవడం మంచిదని చెబుతున్నారు. సహజీవనం చేసే ఆ జంట ఉద్యోగస్తులైతే ఒకరితో ఒకరు స్నేహంగా మెలిగడం మాత్రమే కాదు, చేసే పనుల్లో కూడా పాలుపంచుకోవాలి. ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి పెంచుకోవడం వల్ల విడిపోవడం వరకూ దారితీస్తుంది.

4. ఆకర్షణ తగ్గిపోయాక: ఆకర్షణ తగ్గిపోయాక ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సహజీవనం చేసే ఇద్దరిలో కొంత కాలం తర్వాత ఆకర్షణ తగ్గిపోవడంతో ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి తిరుగుళ్ళు వారి. అవి వారికి రుచించకపోవచ్చు. డేటింట్ చేస్తూనే అమ్మాయి వేరే అబ్బాయితో తిరగడం లేదా అబ్బాయి వేరే అమ్మాయితో తిరగడం వంటివి విడుపోవయేందుకు కారణం అవుతున్నాయి

5. బాధ్యత ఉండదు: డేటింట్'ఇలాంటి బంధంతో కలిసున్నవారి మధ్య బంధం అంత బలంగా ఉండదు. తమ భాగస్వామిపట్ల శ్రద్ధ కూడా తక్కువే. తమ తల్లిదండ్రులనుంచి బలమైన ఒత్తిడి వచ్చిందంటే వెళ్లిపోతుంటారు. అదే పెళ్లయిన వారైతే ఇరువురూ బాధ్యతతో వ్యవహరిస్తారు. ఒకరిపట్ల ఒకరు గౌరవాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబ మంటే గౌరవం, భయం భక్తిని కలిగి ఉంటారు. అందువల్ల ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకం కుదిరాకే సహజీవనం చేయడం మేలు. అసలు ఇలాంటివి కాకుండా ప్రేమించిన విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లిచేసుకోవడం ఎంతోమేలు.

English summary

5 Common Relationship Problems in Dating | డేటింగ్ వద్దు...పెళ్ళే ముద్దు..!

There are times in all romantic relationships when things don't run smoothly and can be difficult to understand--even in the most ideal of circumstances. Although relationships have their ups and downs, there are things you can both do that can minimize problems.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more