For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్ అఫైర్స్ ఎంత ప్రమాధకరమో తెలుసుకోండి...!?

|

కొందరు ఉద్యోగస్థులు ఆఫీసులోనే అక్రమ సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. కలిసి పనిచేస్తున్న కొందరు యువతీయువకుల మధ్య స్నేహం ఏర్పడు తోంది. రానురాను ఈ స్నేహం ఒకరిపై మరొకరికి వ్యామోహంగా మారుతోంది. పెళ్లయి తమకు జీవిత భాగస్వామి ఉన్నా కొందరు ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగస్థులతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న కొందరు యువతీయువకుల్లో ఇది ఎక్కువగా కని పిస్తోంది. డే షిఫ్టులే కాదు నైట్‌ షిఫ్టులు కూడా కలిసి పని చేస్తున్న యువతీయువకుల మధ్య అనుబంధాలు పెరుగుతున్నాయి. ఇది వారి మధ్య శారీరక సంబంధాలకు దారి తీస్తోంది.

కొద్దిపాటి సరసం ఎవరిని ఇబ్బంది పెట్టదు. పెట్టినప్పటికి అనిపించదు. కాని అది అధికమై వికటిస్తే దానిని ఎలా సరిచేసుకోవాలి? లంచ్ బ్రేక్ లో అడ్డూ ఆపూ లేని సరసాలు. కాఫీ లంటూ కేంటీన్ లో రాసుకు పూసుకు తిరుగుతూ ఒకరికొకరు మెసేజ్ ఇచ్చేసుకోవటాలు. పని ముగిసిందంటే ధియేటర్ లో మకాం పెట్టేయడాలు. ఇదంతా ఆఫీస్ రొమాన్స్ గా బాగానే వుంటుంది. అయితే, అది అధికమై చివరకు విషాదం చూపితే దానిని ఎలా సరిచేసుకోవాలనేది పెద్ద అంశంగా తయారైపోతుంది. కలసిపని చేస్తున్నారంటే, ప్రతిరోజూ మీరు ఒకరినొకరు చూసుకోవాల్సిందే! మరి అటువంటపుడు మీరు ఎవరికి బాధ కలిగించినా, అసభ్యంగా ప్రవర్తించినా కష్టమే. కనుక ఆఫీస్ రోమాన్స్ హద్దు దాటి చెడితే ఏం చేయాలి? ఆ చెడు పరిస్ధితులను మరల ఆఫీస్ లో తిరిగేటపుడు ఎలా ఎదుర్కొనాలి? ఆమెతో ఎలా వ్యవహరించాలి? ఆఫీస్ అఫైర్స్ ఎందుకు మంచిది కాదు అనడానికి ఒక్కడ కొన్ని ఐడియాస్ మీకోసం...

An Office Affair

సహోద్యోగితో డేటింగ్: సహ ఉద్యోగితే డేటింగ్ చేస్తే మీ శత్రువుతో నిద్రించినట్లే. ఎందుకంటే అక్కడ స్థిర పోటి అనేది ఉంటుంది. మరియు మీరు ఆపోటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు పరస్పరం మద్దతు మరియు ప్రేమను తెలుపుతాయి కానీ పోటీ కాదు. ఆ అఫైయిర్స్ బ్రెక్ అప్ అవనంత వరకూ ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే బ్రేక్ అప్ అయితే ఆఫీసులో పరిస్థితి ఏంటి?

బాస్ తో డేటింగ్: ఈ విషయంలో, మీరు చాలా అద్రుష్టంగా భావించవచ్చు. ఇది మీ నిద్రలో ఒక డ్రీమ్ వంటిది. మీ బాస్ మమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ..ఇతరులకు మీ గురించి గొప్పగా చెబుతూ బాగా పనిచేస్తారు..మీకు అన్ని విషయాలు తెలుసున్నావారే..మీ డేటింగ్ వికటిస్తే ఏం జరగుతుంది? అది ఒక పీడకల అవుతుంది.

సబార్డినేట్ తో డేటింగ్: ఈ విషయంలో మాత్రం మీ సబార్డినేట్ తో డేటింగ్ చేయడం వల్ల ఖచ్చితమైన దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. సబార్డినేట్ తో డేటింగ్ అంగీకరించినప్పటికీ, మీ నిపుణత లేని వృత్తి మీద ఆఫీసులో మీ మీద పుకార్లు ప్రారంభమౌతుంది. మరియు బ్రేక్ అప్ తర్వాత లైంగిక వేధింపులు తప్పవన్న నమ్మకం ఏమిటి.?

మీరు పనిచేసే చోటు మీరు ఒకరిని పొగిడినా లేదా ఒకరిని విమర్శించినా అది మీ పర్సనల్ లైఫ్ కు ముడిపడి ఉంటుంది. కాబట్టి అందరితో బ్యాలెన్డ్ గా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. లేదంటే మీ మీద వేసే పుకార్లు బాస్ వరకూ వెళ్ళి మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడేలా చేస్తాయి.

వృత్తిని పోగొట్టుకోవల్సి వస్తుంది: మీరు ఆఫీస్ అఫైర్ సాగించడానికి ముందు ఆ ఉద్యోగం మీకు ఎంత అవసరమో గుర్తించాలి. కొన్ని కంపెనీల్లో కోవర్స్ డేటింగ్ మీద కొన్ని నియమాలు పెట్టిఉంటారు, అవి మీ కెరీర్ కు భంగం కలిగించవచ్చు. చాలా సమయాల్లో రిలేషన్ షిప్ దెబ్బతిన్నతర్వాత తెలుసుంది మీరు ఎంత మోసపోయారో..ఆఫీస్ అఫైర్ వల్ల ఏమి పోగొట్టు కున్నారని. మరియు మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించవచ్చు . దాంతో మీ కెరీర్ పాడవచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఆఫీస్ అఫైర్ వల్ల ఎదుర్కోవల్సి వస్తుందని గుర్తించుకోవాలి.

ఆధిపత్య దోరణి: మగాళ్ల కుండే ఆధిపత్య ధోరణి కూడా ఈ బంధాలు విడిపోవడానికి కారణ మని కొంతమంది అమ్మాయిలు అంటున్నారు. అలాకాకుండా పనిని విభజించుకోవడం మంచిదని చెబుతున్నారు. సహజీవనం చేసే ఆ జంట ఉద్యోగస్తులైతే ఒకరితో ఒకరు స్నేహంగా మెలిగడం మాత్రమే కాదు, చేసే పనుల్లో కూడా పాలుపంచుకోవాలి. ఒకరి మీద ఒకరు ఆధిపత్య ధోరణి పెంచుకోవడం వల్ల విడిపోవడం వరకూ దారితీస్తుంది.

ఆకర్షణ తగ్గిపోయాక: ఆకర్షణ తగ్గిపోయాక ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సహజీవనం చేసే ఇద్దరిలో కొంత కాలం తర్వాత ఆకర్షణ తగ్గిపోవడంతో ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి తిరుగుళ్ళు వారి. అవి వారికి రుచించకపోవచ్చు. డేటింట్ చేస్తూనే అమ్మాయి వేరే అబ్బాయితో తిరగడం లేదా అబ్బాయి వేరే అమ్మాయితో తిరగడం వంటివి విడుపోవయేందుకు కారణం అవుతున్నాయి

బాధ్యత ఉండదు: డేటింట్‘ఇలాంటి బంధంతో కలిసున్నవారి మధ్య బంధం అంత బలంగా ఉండదు. తమ భాగస్వామిపట్ల శ్రద్ధ కూడా తక్కువే. తమ తల్లిదండ్రులనుంచి బలమైన ఒత్తిడి వచ్చిందంటే వెళ్లిపోతుంటారు. అదే పెళ్లయిన వారైతే ఇరువురూ బాధ్యతతో వ్యవహరిస్తారు. ఒకరిపట్ల ఒకరు గౌరవాన్ని ఏర్పరచుకుంటారు. కుటుంబ మంటే గౌరవం, భయం భక్తిని కలిగి ఉంటారు. అందువల్ల ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకం కుదిరాకే సహజీవనం చేయడం మేలు. అసలు ఇలాంటివి కాకుండా ప్రేమించిన విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లిచేసుకోవడం ఎంతోమేలు.

English summary

Dangers Of Having An Office Affair | ఆఫీస్ అఫైర్స్ ఎంత ప్రమాధకరమో తెలుసుకోండి...!?

Fooling around with your co-worker might seem to be a good idea at the time, especially if your hectic work schedule leaves you no time to have a social life.
Story first published: Monday, May 27, 2013, 16:29 [IST]
Desktop Bottom Promotion