For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Breakup Benefits: బ్రేకప్ తో ఇన్ని బెనిఫిట్సా..? విడిపోవడమే బెటర్ కదా గయ్స్

చాలా మంది జీవితంలో విడిపోవడం అనే సందర్భం ఒకటి తప్పకుండా ఉంటుంది. ఒక సంబంధాన్ని కోల్పోవడం, ఒక బంధం నుండి బయటకు రావడం, ఒక వ్యక్తిని వదిలి వెళ్లడం ఎవరినైనా బాధిస్తుంది.

|

Breakup Benefits: చాలా మంది జీవితంలో విడిపోవడం అనే సందర్భం ఒకటి తప్పకుండా ఉంటుంది. ఒక సంబంధాన్ని కోల్పోవడం, ఒక బంధం నుండి బయటకు రావడం, ఒక వ్యక్తిని వదిలి వెళ్లడం ఎవరినైనా బాధిస్తుంది.

Benefits of breaking up in Telugu

జీవితంలో అనివార్యంగా జరిగే కొన్ని సందర్భాలను ఆహ్వానించడం తప్పా.. ఏమీ చేయలేం. అయితే, విడిపోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. మీరు మీ ప్రస్తుత సంబంధాన్ని విడిచి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే లేదా ఇటీవల బాధాకరమైన ముగింపును ఎదుర్కొన్నట్లయితే, ఇక్కడ పరిగణించవలసిన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

1. కొత్త స్వేచ్ఛ

1. కొత్త స్వేచ్ఛ

ఇప్పుడు మీరు ఆలోచించడానికి ముఖ్యమైన ఇతర వ్యక్తులు లేనందున, మీరు మీ సొంత కోరికలు, లక్ష్యాలు మరియు ఇష్టాయిష్టాల ఆధారంగా ప్రధాన జీవిత ఎంపికలను చేయవచ్చు. మీరు ఇకపై వారి ప్రాధాన్యతలను తీర్చాల్సిన అవసరం లేదు. మీరు కొత్త ఉద్యోగం కోసం ఇతర నగరాలకు వెళ్లవచ్చు. ఇన్ని రోజులు పోవాలని ఉన్నా, ఇంకా వెళ్లలేని ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. మీకు నచ్చినట్లుగా బతకొచ్చు. ఇష్టమైనది తినొచ్చు.

2. మీదే అంతా..

2. మీదే అంతా..

ఇన్ని రోజులు ఒకరితో ఉన్నప్పుడు ఇరుకుగా అనిపించిన జీవితం.. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తుంది. రూములో మీరు మాత్రమే ఉంటారు. ప్రతి చోటా మీరే ఉంటారు.

3. నటించాల్సిన అవసరం లేదు

3. నటించాల్సిన అవసరం లేదు

మీ పార్ట్ నర్ యొక్క భయంకర స్నేహితులను అలాగే బాధించే బంధువులను ఇష్టపడినట్లు నటించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చకపోయినా.. నచ్చిందని చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. మీకు మీదైనా చాలా సమయం ఉంటుంది. మీరు మీ సమయాన్ని మీ స్వంత స్నేహితులు మరియు బంధువులతో గడపవచ్చు.

4. ఎప్పుడు ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం లేదు

4. ఎప్పుడు ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం లేదు

బంధంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎలా జరుగుతుందో.. అని తెగ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామి ఏమంటారో.. ఎలా ఫీల్ అవుతారో.. ఏమి చేస్తారో అని భయపడాల్సిన పని లేదు. ప్రతి క్షణాన్ని సంతోషంగా, ఆహ్లాదంగా, ఫుల్ ఎగ్స్జైట్ మెంట్ తో గడపవచ్చు.

5. మరింత సానుభూతి

5. మరింత సానుభూతి

మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న ట్రయల్స్ మరియు కష్టాల గురించి మిమ్మల్ని మరింత సున్నితంగా మార్చడానికి హార్ట్‌ బ్రేక్ లాంటిది ఏమీ లేదు. మీ ప్రియమైనవారు తమ స్వంత కథనాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడతారని మీరు కనుగొంటారు. దీని అర్థం మీరు ఒంటరిగా తక్కువ అనుభూతి చెందడం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కష్టమైన కాలాలను ఎదుర్కొంటున్నారని కూడా ఇది మీకు గుర్తు చేస్తుంది.

6. బ్రేకప్ తర్వాత ఎనర్జీ

6. బ్రేకప్ తర్వాత ఎనర్జీ

బ్రేకప్ తర్వాత కొంత ఎనర్జీ వస్తుంది. అయితే దానిని గుర్తించడం ముఖ్యం. దానిని సక్రమంగా వాడుకోవడం అంతకంటే ముఖ్యం. సంబంధాన్ని ముగించిన తర్వాత వచ్చే కొత్తదనం భలే సరదాగా ఉంటుంది. దానిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. బ్రేకప్ తర్వాత ఇది మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తుంది.

7. ఫ్లర్టింగ్

7. ఫ్లర్టింగ్

మీరు ఒంటరిగా ఉన్న వెంటనే, అపరాధభావం లేకుండా ఎవరినైనా ఫ్లర్ట్ చేయవచ్చు. ఎవరితోనైనా.. సరసాలు ఆడొచ్చు. ఎవరినైనా రొమాంటిక్ గా ఆటపట్టించొచ్చు. నచ్చిన వారితో డేటింగ్ చేయవచ్చు. మీరు ఎవరికీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన విధంగా లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు. మీరు చాలా కాలం పాటు ఒంటరిగా ఉండకపోతే, ఇది మొదట చాలా బాధగా అనిపించవచ్చు. కానీ మీరు త్వరలోనే దీనికి అలవాటు పడతారు. ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తారు.

8. నిజమైన స్నేహితులెవరో తెలుసుకోవచ్చు

8. నిజమైన స్నేహితులెవరో తెలుసుకోవచ్చు

మంచి స్నేహితుల ఉండటం కంటే మరేది ముఖ్యం కాదు. వారు జీవితంలో ఇచ్చే మద్దతుకు సరిసాటి మరోటి రాదు. విడిపోయినప్పుడు, విషయాలు కఠినమైనవి అయినప్పుడు మీ కోసం నిజంగా ఎవరు ఉన్నారో మీరు త్వరగా కనుగొంటారు. మీ కోసం వచ్చే వ్యక్తులను విలువైనదిగా పరిగణించండి. వారికి అవసరమైనప్పుడు వారికి అదే మద్దతును అందించడం మర్చిపోవద్దు.

9. ఒక బంధంలో ఏమి కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుస్తుంది

9. ఒక బంధంలో ఏమి కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుస్తుంది

ఒంటరిగా ఉండటం వల్ల భాగస్వామిలో మీకు ఏమి కావాలో సరిగ్గా తెలియకపోవచ్చు. బంధం నుండి విడిపోయిన తర్వాత మీకు మీదైన సమయం దొరుకుతుంది. ఒక సంబంధంలో మీకు అసలు ఏమి కావాలో తెలుస్తుంది. ఇది మీ తదుపరి సంబంధం కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

10. సృజనాత్మకంగా ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది

10. సృజనాత్మకంగా ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది

ప్రపంచంలోని కొన్ని గొప్ప సాహిత్యం, సంగీతం మరియు కళలు ఒక బంధం నుండి విడిపోయిన బాధలో నుండి వచ్చినట్లు గుర్తించవచ్చు. అలాంటి ఉదాహరణలు మనకు చాలానే కనిపిస్తాయి. విడిపోయిన తర్వాత వచ్చే భావాలను సరైన క్రమంలో వాడుకుంటే దాని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీ ఫీలింగ్స్ ను ఆర్ట్ గా మార్చుకోవచ్చు. దీని వల్ల మీలో ఓ సృజనాత్మకమైన వ్యక్తి దాగి ఉన్నట్లు మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తికి సరైన ప్రోత్సాహం అందిస్తే.. అద్భుతాలు జరుగుతాయని గుర్తించవచ్చు.

English summary

Benefits of breaking up in Telugu

read on to know Benefits of breaking up in Telugu
Story first published:Monday, September 5, 2022, 11:19 [IST]
Desktop Bottom Promotion