మగవారంటే మీకు భయమా?

By: Deepti
Subscribe to Boldsky

మీకు మగవారంటే చెప్పలేని భయం వలన ఇప్పటివరకూ ఏ బంధం ఏర్పర్చుకోలేకపోతే మీకు ఆండ్రోఫోబియా ఉండి ఉండవచ్చు. హుందాగా ఉండే మగవారి చుట్టూ కూడా మీకు అకారణంగా ఆందోళనగా అన్పిస్తోందా?

ఈ భయంలో రకాలున్నాయి. కొంతమంది స్త్రీలకు శారీరకంగా హింసించబడతామేమో అని భయం, మరికొంతమందికి మానసికంగా బాధకి గురవుతామనే భయం.

కొంతమంది మగవాళ్లు.. మహిళలంటే.. ఎందుకు వణికిపోతారు, భయపడారు ?

కొందరిలో ఈ భయం చిన్నప్పుడు మొదలైతే, మరికొందరిలో టీనేజ్ దాటాక కూడా మొదలవ్వచ్చు. ఈ భయంకి ముఖ్యకారణం మగవారంటే అపాయకరం అనే భావన బాగా మనసులో ఇంకిపోవటం.

నిపుణులు ఏమంటున్నారంటే

నిపుణులు ఏమంటున్నారంటే

నిపుణుల ప్రకారం చాలామంది స్త్రీలు మంచి, హుందాగా ఉండే పురుషులతో, ఒక ఆరోగ్యకర బంధంలో, సమయం గడపటం వల్ల ఈ భయాలను అధిగమించగలుగుతున్నారు.

తోబుట్టువుల మాటేంటి?

తోబుట్టువుల మాటేంటి?

ఇలా భయపడే కొంతమంది మహిళలు తమ ఇంట్లో ఉండే మగవారిని (తండ్రి, అన్నాదమ్ముళ్ళు, కజిన్స్) చూసి భయపడరు కానీ కుటుంబానికి బయట మరే పురుషులైనా తప్పించుకోవాలనే చూస్తారు.

మీకు మీ భార్య అంటే భయమా...? ఐతే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..!

ఇది ఎలా మొదలవుతుంది?

ఇది ఎలా మొదలవుతుంది?

ఈ ఫోబియా చిన్నప్పుడు జరిగే శారీరక లేదా మానసిక హింసాత్మక ఘటనల వల్ల వచ్చే బెదురు నుంచి మొదలవ్వవచ్చు. అలాంటిదేదైనా జరిగితే, మెదడు ఆ సంఘటనను గుర్తుంచుకుని మళ్ళీ ఆ అపాయాలకు దూరంగా ఉండమని మనసులో భయాన్ని సృష్టిస్తుంది.

ఏది రిస్క్ ను పెంచుతుంది?

ఏది రిస్క్ ను పెంచుతుంది?

చిన్నప్పుడు ఇలాంటి హింసలకు గురైన స్త్రీలలో ఈ భయం పెరగటానికి అధిక అవకాశాలు ఉన్నాయి.

పురుషుల ఆధిపత్యాన్ని నిందించాలా?

పురుషుల ఆధిపత్యాన్ని నిందించాలా?

పురుషాధిపత్యం ఉన్న ఇళ్ళల్లో, సాధారణంగా మహిళలు ఈ రకపు భయాన్ని పెంచుకుంటారు. తండ్రి మరీ హింసాత్మకంగా ఉండే ఇళ్ళలో, కూతుళ్ళలో ఈ భయం రావటం సహజమే.

ఇది వంశపారంపర్యమా?

ఇది వంశపారంపర్యమా?

అరుదైన కేసుల్లో, ఈ ఫోబియా తర్వాత తరానికి కూడా పాకుతుంది. అంటే మీ భయాలు జన్యుపరం కూడా కావచ్చేమో.

మగవారు అక్రమ సంబంధాల పై ఎందుకు మోజుపడతారు?

లక్షణాలు

లక్షణాలు

మీకు ఈ భయం వున్నదని మీకెలా తెలుస్తుంది? ఎవరైనా మగవారు దగ్గర్లో ఉన్నప్పుడు లేదా సంభాషిస్తున్నప్పుడు, సరియైన కారణం లేకుండా మీకు ఆందోళనగా, చెమటలు పట్టి, వికారంగా వాంతి వచ్చేట్లు అన్పిస్తుందా?

కొంతమంది స్త్రీలలో ఛాతీ నొప్పి, వేగంగా శ్వాస కూడా కన్పిస్తాయి. కొంతమంది ఎదురుగా ఉన్న మగవారు తమపై దాడి చేస్తున్నారనే ఊహల్లోకి కూడా వెళ్ళిపోతామని చెప్పారు.

మరి ఏం చేయాలి?

మరి ఏం చేయాలి?

సరియైన చికిత్స తీసుకోకపోతే, ఇది డిప్రెషన్, ఒంటరితనానికి కూడా దారితీయవచ్చు. దానివల్ల మీ సామాజిక బంధాలు, వృత్తిపై కూడా ప్రభావం పడుతుంది. నిపుణుల వైద్యసాయం తీసుకోవడం తప్పనిసరి.

మీరేం జీవితాంతం ఒంటరిగా ఉండిపోవక్కర్లేదు. ఈ గ్రహంపై ఉన్న అందరు మగవాళ్ళు ఒకలానే ఉండరు. ఏదో ఒకరోజు ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని అందంగా మార్చేస్తాడేమో చూడండి!

English summary

Are You Scared Of Men For No Reason?

What causes androphobia? Do you feel anxious for no reason even in the company of a gentleman? Read on!
Story first published: Thursday, July 6, 2017, 17:02 [IST]
Subscribe Newsletter