మీ బాయ్ ఫ్రెండ్ అమాయకుడేమీ కాదు సుమా!

By Deepti
Subscribe to Boldsky

మీరు ప్రేమలో ఉన్నప్పుడు, అతను చేసే ప్రతి పని అందంగానే కన్పిస్తుంది. పైగా అతను మీరంటే పడిచచ్చిపోవటం చూసి మీ కల నెరవేరినట్టు అన్పిస్తుంది

కానీ అందానికి, పరిణతిలేనితనానికి మధ్య సన్నని గీత ఉంటుంది. మీరు గమనించారా? లేకపోతే, మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతని ప్రవర్తనని గమనించండి.

మీ బాయ్‌ఫ్రెండ్‌ను భర్తగా మార్చేందుకు శిక్షణ ఇవ్వండి..!

ఇలా అందంగా, ముద్దుగా అన్పించే విషయాలు ఎక్కువకాలం నిలవవు. కొంతకాలం తర్వాత అవి మీకు చికాకుగా కూడా అన్పించవచ్చు. అందుకని, ఈ కింది పాయింట్లు తెలుసుకుని మీరు ప్రేమించిన వ్యక్తి వాటిని, మిమ్మల్ని అర్థం చేసుకునేంత ఎదిగాడో లేదో తెలుసుకోండి.

అతను తాగుతాడు… అదీ..అదుపులేకుండా!

అతను తాగుతాడు… అదీ..అదుపులేకుండా!

అన్ని సమయాల్లో మద్యం మత్తులో ఉండి, చిన్నపిల్లాడిలా ప్రవర్తించటం వల్ల మీరు అతనితో జీవితం పంచుకోలేరు. అతను కవితలు రాసినా, మిమ్మల్ని అనుక్షణం పొగిడినా, ఆ మత్తు వదిలిపోయిన రోజున మీకు అవన్నీ అందంగా కన్పించటం మానేస్తాయి.

అతను అందర్నీ ఎగతాళి చేస్తాడు

అతను అందర్నీ ఎగతాళి చేస్తాడు

మీకు అది ముందు హాస్యం అన్పించినా, తర్వాత మీ భావాలకు అదే సెన్సాఫ్ హ్యూమర్ బాధకలిగిస్తుంది ! ఎదుటివారిని అల్లరి చేయటం, ఎగతాళి చేయటం, తక్కువచేసి మాట్లాడటం ఇవన్నీ పరిణతి ఉన్న మనిషి చేసేవి కావు ! అతను ఎదగాలి !

ఆన్ లైన్ డేటింగ్ దుర్వినియోగ ప్రభావాలు

అతను డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తాడు

అతను డబ్బును నీళ్ళలా ఖర్చు చేస్తాడు

బాగా అన్పిస్తోంది కదా, వింటుంటే? కానీ భవిష్యత్తులో ఆ లక్షణమే మిమ్మల్ని రోడ్డెక్కేలా చేయవచ్చు. ఈరోజు అతను మీకు రేపటి గురించి ఆలోచన లేకుండా, బహుమతులు కొనితేవడంలో ఖర్చు పెట్టవచ్చు, కానీ అతను మీ ఇద్దరి భవిష్యత్తు కోసం కూడా కొంచెం పొదుపు చేసే అలవాటు ఉండడం మంచిది, మీకు ఉద్యోగం ఉన్నా కూడా !

అతను పదే పదే ఫోన్ చేసి పిచ్చిప్రశ్నలు అడుగుతాడు !

అతను పదే పదే ఫోన్ చేసి పిచ్చిప్రశ్నలు అడుగుతాడు !

అతను హాఠాత్తుగా ఫోన్ చేసి, అన్నం ఎలా వండాలో అడిగితే మీకు ముద్దుగా అన్పించచ్చు. సరే, ఆ ప్రశ్నవరకూ ఓకె. కానీ పదేపదే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడేమో హెచ్చరిక !

అతను అలుగుతాడు !

అతను అలుగుతాడు !

ఇక ఇది చిన్నపిల్లల మంకుతనమే. కేవలం పిల్లలే తమ వాదన సరి అని నిరూపించుకోటానికి, కావాల్సింది దక్కించుకోటానికి ఇలా చేస్తారు. మీరు డేటింగ్ చేసే అబ్బాయి ఒక ఎదిగిన వ్యక్తి, ఒక పెద్దయిన వ్యక్తి ఇలా ప్రవర్తించకూడదు. స్పష్టంగా వివరించగలగాలి !

అతను తన అందానికి మరీ ప్రాముఖ్యత ఇస్తాడు

అతను తన అందానికి మరీ ప్రాముఖ్యత ఇస్తాడు

అతను హుందాగా, మంచిగా కన్పించటం ముఖ్యమే కానీ దాని అర్థం సమయమంతా అద్దం ముందు గడపమని కాదు. తనకి తాను లేని ప్రాముఖ్యతనిచ్చుకునే పిచ్చి నుండి బయటపడి అతను ఎదగాలి !

అతనికి మీ నాన్నంటే భయం !

అతనికి మీ నాన్నంటే భయం !

అవునా, అయితే ఇక అతను మీ నాన్నతో ఏం మాట్లాడి, మీ పెళ్ళి గురించి ఒప్పిస్తాడనుకుంటున్నారు? అతను ఇందులో కూడా వయసుకి తగ్గట్టు ప్రవర్తించాలి !

అప్పటి వరకూ అతన్ని బాయ్ ఫ్రెండ్ గా భావించకండి..!?

మీరు సీరియస్ గా ఉన్నప్పుడు అతను జోకులేస్తాడు

మీరు సీరియస్ గా ఉన్నప్పుడు అతను జోకులేస్తాడు

లేదు, ఇదేం ముద్దొచ్చే విషయం కాదు ! అతనికి సమయం ప్రకారం నడుచుకోవటం రాదు. అతను మీరెంత సీరియస్ గా మాట్లాడుతున్నారో, అసలు పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని, చర్చించే విధంగా ఉండాలి.

మీకు మూడ్ లేనప్పుడు మిమ్మల్ని బలవంతపెడతాడు

మీకు మూడ్ లేనప్పుడు మిమ్మల్ని బలవంతపెడతాడు

మీకు ఈరోజు ఇవన్నీ ప్రేమగా కన్పించవచ్చు కానీ కొన్ని రోజుల్లోనే మీ సహనం చచ్చిపోయి, అతన్ని కొట్టాలనిపించవచ్చు.

అతితెలివిగా ప్రవర్తిస్తాడు

అతితెలివిగా ప్రవర్తిస్తాడు

అతితెలివిగా ప్రవర్తిస్తూ, మిమ్మల్ని మెప్పించటానికి,మాయ చేస్తూ, తెగ కష్టపడిపోతూ ఉంటే మీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ప్రయాణించలేరని అర్థం.

అయితే ఇక చూడండి, మీ ప్రియుడు బాధ్యత కలిగిన వ్యక్తి లాగా ఉన్నాడా? మీ భాగస్వామి కాగలడా?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Do You Think He's Cute? No, He's Immature!!

    When you are in love, everything your guy does seems so cute. And the very thing that he is going crazy for you seems like a dream come true. Is he cute or
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more