ఆన్ లైన్ డేటింగ్ దుర్వినియోగ ప్రభావాలు

By: Deepti
Subscribe to Boldsky

ఒక పరిశోధన ప్రకారం, ఆన్లైన్ డేటింగ్ భాగస్వామి నుంచి నియంత్రణ, అనుమానపు పర్యవేక్షణలు, బెదిరింపులు, వత్తిడి, డిజిటల్ మాధ్యమాలను వాడి బలాత్కారం, బలప్రయోగం- వంటివి ఎదుర్కొనే అమ్మాయిలు, అబ్బాయిల కంటే ఎక్కువ మానసిక సమస్యలు,పరిణమాలు ఎదుర్కోవాల్సి వస్తోందని తేలింది.

కాలిఫోర్నియా-సాంటా బార్బరా యూనివర్శిటీ, సహాయక శాస్త్రవేత్త,రచయిత లారెన్ రీడ్ మాటల్లో, "డిజిటల్ డేటింగ్ యువత అందరికీ దుష్పరిణామంగా మారినా, లైంగికత కూడా ప్రభావం చూపిస్తోంది," అని అన్నారు.

online dating abuse

ఈ ఫలితాల ప్రకారం యువతులు ఎక్కువ డిజిటల్ లైంగిక దాడులలో బాధితులుగా మారుతున్నారు.

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

వారు చెప్పినదాని ప్రకారం, వారు "సెక్సువల్ గా మెసేజ్ లకు ఒత్తిడి చేసినప్పుడు (నగ్నంగా లేదా లైంగిక చర్యతో ఫోటో పంపమన్నప్పుడు), బెదిరింపు మెసేజ్, అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని వెతకడం, ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నామని తెలుసుకోవటం వంటి వాటికి, ఎక్కువ మానసికంగా ఘర్షణకి గురవుతున్నట్లు, బాధపడుతున్నట్లు తెలిపారు.

online dating abuse

యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రొఫెసర్ రిచర్డ్ తోల్మాన్ మాట్లాడుతూ, "అబ్బాయిలు అమ్మాయిలను తమ లైంగిక సుఖవస్తువులుగా చూస్తారు, అదే ఈ డిజిటల్ లైంగిక దాడులకు కారణం. అబ్బాయిలు అమ్మాయిల కన్నా లైంగిక శక్తులు తమవే అని భావిస్తారు, " అని వివరించారు.

మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా బలపడటానికి 6 బాలి వుడ్ డేటింగ్ టిప్స్

online dating abuse

జర్నల్ ఆఫ్ అడోలెసెన్స్ లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, శాస్త్రవేత్తల బృందం డిజిటల్ డేటింగ్ దుర్వినియోగం అనుభవిస్తున్న 703 యూఎస్ హైస్కూల్ విద్యార్థులలో లైంగికత ప్రభావం పరీక్షించారు.

online dating abuse

అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమైన స్థాయిలలోనే డిజిటల్ పర్యవేక్షణ, నియంత్రణ, డిజిటల్ దాడులకు గురౌతున్నట్లు తెలిపారు.

కానీ నేరుగా బెదిరింపులు, పుకార్లు వ్యాప్తి చేస్తామనే డిజిటల్ దాడికి దిగినప్పుడు మాత్రం అమ్మాయిలు వారి భాగస్వామిని బ్లాక్ చేసేసి ,ఇంకెప్పుడూ మాట్లాడకుండా నిరోధిస్తున్నట్లు తమ అనుభవాలు పంచుకున్నారు.

English summary

Effects Of Online Dating Abuse

Girls who experience problematic behaviours from an online dating partner are more prone to suffering severe emotional consequences than boys.
Story first published: Monday, July 10, 2017, 17:00 [IST]
Subscribe Newsletter