మీ బాయ్ ఫ్రెండ్ త‌ల్లిని మెప్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డానికి 10 కార‌ణాలు

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న‌కు ఇష్ట‌మైన‌వారితో సంబంధాన్ని కొన‌సాగించ‌డం, వాళ్ల‌తో క‌లిసి మ‌న అనుభ‌వాల‌న్నీ పంచుకోవ‌డం లాంటివ‌న్నీ జీవితానికి మ‌ధుర ఆనందాల‌ను మిగిలిస్తాయి. మ‌న‌కు న‌చ్చిన‌వారితో ఆనంద క్ష‌ణాల‌ను పంచుకోలేక‌పోతే ఇక జీవితం అర్థ‌వంతంగా అనిపించ‌దు క‌దా!

సాధార‌ణంగా అమ్మాయి, అబ్బాయిలు క‌లిసి సంబంధాన్ని క‌లిగి ఉంటారు. వారిద్దురూ ఏదైనా ఒక మంచి క్ష‌ణంలో ప‌రిచ‌యంలో అవుతారు. మెల్ల‌గా స్నేహం పెరిగి ఇష్టాయిష్టాలు న‌చ్చితే సంబంధంలో కొన‌సాగుతున్నారు. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డి పెళ్లి దాకా వెళ‌తారు. పైకి చాలా సుల‌భంగా ఉంది క‌దా! దిగిన‌వారికి అస‌లు లోతేమిటో తెలుస్తుంది.

ఇండియన్ బాయ్ ఫ్రెండ్ ను ఆకర్షించడానికి 10 సింపుల్ టిప్స్

ముఖ్యంగా భార‌త్‌లో అమ్మాయితో అబ్బాయి సంబంధాల‌ను కొన‌సాగించ‌డం చాలా క్లిష్టంగా నడిచే వ్య‌వ‌హారం. అమ్మాయిల‌కు ఇది మ‌రీ క‌ష్టం. మీరు ఏ అబ్బాయితో నైనా రిలేష‌న్‌షిప్‌లో ఉండి మీ బంధాన్ని త‌దుప‌రి ద‌శ‌కు తీసుకెళ్లాల‌ని భావిస్తే ఇరు వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాల‌ను ఒప్పించాల్సి ఉంటుంది. మీరు ప్రేమించిన అబ్బాయి మీ త‌ల్లిదండ్రుల‌ను ఇంప్రెస్ చేసి ఉన్న‌ట్ల‌యితే ఇప్పుడు అత‌డి త‌ల్లిదండ్రుల‌ను మీరు ఇంప్రెస్ చేయాల్సిన స‌మ‌యం మొద‌లైన‌ట్టు.

impress your boyfriend parents

సాధార‌ణంగా మ‌న దేశంలో పిల్ల‌లు ఇత‌ర వ్య‌క్తితో సంబంధంలో ఉన్నార‌ని తెలిస్తే త్వ‌ర‌గా ఒప్పుకోరు. ఇక అమ్మ‌లైతే అంత త్వ‌ర‌గా జీర్ణించుకోలేరు. ఎంత సంప్ర‌దాయ‌క‌రంగా అలంక‌రించుకున్నా... ఎంత సంస్కార‌వంతంగా క‌నిపించినా మీ ప్రియుడి త‌ల్లిగారిని మెప్పించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది. ఎన్ని చేసినా ఆమె మీరంటే ఇష్టం లేన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తే ఏం చేయాలి? మీ రిలేష‌న్‌షిప్‌ను ఆమె కోసం మ‌ధ్య‌లో వ‌దిలేయ‌డ‌మే ప‌రిష్కార‌మా?

మీ బాయ్ ప్రెండ్ కు మూడ్ రావాలంటే , నాటీగా మెసేజ్ చేయండి...

మీ ప్రియుడితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు మీ సంబంధంపై మీకు గ‌ట్టి న‌మ్మ‌క‌మున్న‌ప్పుడు ఇత‌రులు మీ బంధాన్ని ఆమోదించాల్సిన అవ‌స‌రం లేద‌న్న సంగ‌తిని గుర్తుంచుకోండి. మీ ప్రియుడి అమ్మ‌గారికి మీరు న‌చ్చ‌క‌పోతే పెద్ద‌గా ఆందోళ‌న ప‌డ‌కండి.

మీ ప్రియుడి త‌ల్లిగారిని మెప్పించాల్సిన అవ‌స‌రం అంత‌గా లేద‌ని చెప్ప‌డానికి 10 కార‌ణాలు వివిరిస్తున్నాం...

ఆమె స‌మ‌స్య ... మీది కాదు..

ఆమె స‌మ‌స్య ... మీది కాదు..

మీ ప్రియుడి త‌ల్లి మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌క‌పోతే అది ఆమె స‌మ‌స్య‌. మీ స‌మ‌స్య కాదు. ఆమె చెప్పింది క‌దా అని మీలో లోపాలను వెతుక్కునే ప్ర‌యత్నం చేయ‌కండి. మీలో ఎలాంటి ప్ర‌త్యేక‌త లేక‌పోతే వేరే అబ్బాయితో సంబంధంలో ప‌డేవారు కాద‌న్న సంగ‌తిని గుర్తుంచుకోండి.

ఆమె ఆమోదం అవ‌స‌రంలేదు

ఆమె ఆమోదం అవ‌స‌రంలేదు

మీరు ఆమె అబ్బాయితో సంబంధంలో ఉన్నారు. ఆమెతో కాదు! కాబ‌ట్టి చిల్ అవ్వండి. ఆమె మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని మీ బాయ్ ఫ్రెండ్ మీతో బ్రేక‌ప్ చెప్ప‌డు.

అంద‌రినీ మెప్పించ‌లేరు

అంద‌రినీ మెప్పించ‌లేరు

మీరు ఎంత ప్ర‌యంత్నించినా అంద‌రినీ మెప్పించ‌లేరు. కాబ‌ట్టి ఎక్కువ‌గా ప్ర‌య‌త్నించ‌డం మానివేయండి. మీ చుట్టు జ‌రిగే ప‌నులు వాటంత‌ట అవే అవుతుంటాయి. కంగారు ప‌డ‌కండి.

ఆమె అభిప్రాయాన్ని మార్చ‌లేరు

ఆమె అభిప్రాయాన్ని మార్చ‌లేరు

మీరు ఎంత తీయ‌గా మాట్లాడినా స‌రే ఆమెకు మీరు త‌న కొడుకును త‌న నుంచి వేరు చేసిన అమ్మాయి లాగే క‌నిపిస్తారు. ఆమెలో ఉన్న ఆ భావ‌న పోగొట్టేందుకు చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది.

మీ సంబంధంలో వేలుపెట్టేందుకు

మీ సంబంధంలో వేలుపెట్టేందుకు

మీరు మీ కాబోయే అత్తగారిని బాగా మెప్పించాల‌ని ప్ర‌యత్నిస్తే అది బెడ‌సి కొట్టే ప్ర‌మాద‌ముంది. మీ పెళ్లికి ఆమె ఆమోదం కావాల‌ని ఆమె అనుకోగ‌ల‌దు. అది మీ బంధానికే చేటు తేగ‌ల‌దు. మీ బంధానికి ఎవరి ఆమోదం అవ‌స‌రం లేద‌న్న విష‌యం ఆమె గ్ర‌హించ‌గ‌లిగేలా చేయాలి.

ప్ర‌తి దాన్ని ప్రశ్నిస్తారు

ప్ర‌తి దాన్ని ప్రశ్నిస్తారు

మీ కుటుంబ విలువ‌ల గురించి ప్ర‌తి విష‌యాన్ని ఆమె మిమ్మ‌ల్ని ప్ర‌శ్నించ‌వ‌చ్చు. ఆమె మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డ‌క‌పోతే మిమ్మ‌ల్ని జ‌డ్జ్ చేసే అవ‌కాశం ఉంది. అది మీకు కాస్త ఇబ్బందిగా అనిపించవ‌చ్చు.

మీ భాగ‌స్వామికి మీకిచ్చే విలువ‌

మీ భాగ‌స్వామికి మీకిచ్చే విలువ‌

మీ భాగ‌స్వామి మీకు ఇచ్చే విలువ చాలా ముఖ్యం. మీ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ బ‌ల‌ప‌డేందుకు న‌మ్మ‌కం పునాది. అప్పుడే ఇత‌రుల‌ను మెప్పించాల‌నే ధోర‌ణి తొల‌గిపోతుంది.

కొడుకుల ప‌ట్ల ర‌క్ష‌ణ ఎక్కువ‌

కొడుకుల ప‌ట్ల ర‌క్ష‌ణ ఎక్కువ‌

త‌ల్లుల‌కు స‌హ‌జంగానే వారి కొడుకుల ప‌ట్ల ర‌క్ష‌ణ ఎక్కువ‌. వాళ్లు త‌మ ఆధీనంలో త‌ప్ప ఇంకెవ‌రి ద‌గ్గ‌ర ఉండ‌లేర‌ని భావిస్తారు. అది ఆమె అభిప్రాయం. మీకు అన్వ‌యించుకోన‌వ‌సరం లేదు.

వేడెక్కించ‌కండి

వేడెక్కించ‌కండి

మీ కాబోయే అత్త‌గారితో స‌రైన బంధం ఏర్ప‌డ‌నప్పుడు దాన్ని మ‌రింత లాగ‌కండి. మీ ప్రియుడే స‌మ‌స్య‌ను ఎదుర్కోనివ్వండి. ఈ విష‌యాన్ని మ‌రింత వేడెక్క‌నిస్తే మొద‌టికే ప్ర‌మాదం.

మీకు తోడుగా నిలుస్తాడ‌ని ...

మీకు తోడుగా నిలుస్తాడ‌ని ...

మీ బాయ్ ఫ్రెండ్ మీకు తోడుగా నిల‌బ‌డ‌తాని న‌మ్మండి. అలా న‌మ్మితే మీ బంధం రాను రాను మ‌రింత బలంగా మారుతుంది.

English summary

10 Reasons You Don't Need To Impress Your Boyfriend’s Mother

Do you need to impress your boyfriend’s mother? Usually relationships involve the girlfriend and boyfriend. So, Read this!
Subscribe Newsletter