మీ మొదటి డేటింగ్ ఫెయిల్ అయితే మీరు ఏమీ చెయ్యాలో అని ఆలోచిస్తున్నారా ?

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీ మొదటి డేటింగ్ ఫెయిల్ అయితే మీరు ఏమీ చెయ్యాలో అని ఆలోచిస్తున్నారా ?

మీ మొదటి కలయిక (సమావేశం) అద్భుతంగానూ, కాస్త భయంగానూ కూడా ఉండవచ్చు. మీరు ఎవరినో కలసి మీ గూర్చి కొంత విషయాన్ని చెప్పి, అలాగే ఆ వ్యక్తి గూర్చి కూడా కొంత విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు.

మొదటి సంభాషణ తరువాత, మీరు కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళడమా, లేదా, అనేది మీరు ఒకరికి ఒకరు ఎలా భావిస్తున్నారు అనే విషయం మీద ఆధారపడి వుంటుంది.

డేటింగ్ చేయడానికి ముందు మహిళలకోసం కొన్ని సూచనలు

ఇది ఊహించిన విధంగా పనిగాని అవ్వలేదంటే, మీరు ఒక అవకాశం కోల్పోయారని కాదు, మీరు దాని గూర్చి ఎక్కువ ఆలోచించకుండా ముందుకు వెళ్లాలి. కానీ అలా చెయ్యడం కన్నా చెప్పడం తేలిక. ఆ కలయిక / సమావేశం ఫెయిల్ అయితే కొంతమంది తిరస్కరిస్తారు, మరికొంతమంది నిజంగానే తప్పు జరిగిందా అని ఆలోచిస్తారు. మీ మొదటి సమావేశం ఫెయిల్ అయ్యాక ఏమీ చెయ్యకూడదో అనే కొన్ని విషయలను గూర్చి ఇక్కడ ఉన్నాయి.

ఫేస్బుక్ లో పోస్టులు పెట్టవద్దు :

ఫేస్బుక్ లో పోస్టులు పెట్టవద్దు :

"ఓరి దేవుడా, ఈరోజు ఒక చెడ్డ డేటింగ్ జరిగింది" అని ఫేస్బుక్ లో పోస్ట్ చెయ్యడం ద్వారా మీలో ఉన్న నిరాశని బయటకు పెట్టేందుకు సహాయపడవచ్చు కానీ అది అనవసరమైనది.

ఆ వ్యక్తి అతని మనస్సు మార్చుకొని తిరిగి మీ దగ్గరకు వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ?

ఆ ఫోస్ట్ ని అతను చూశాక, వెనక్కి రాకపోవచ్చు, అతను మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో లేకపోయినా సరే ! అలాగే మీకు చెడ్డ డేటింగ్ జరిగిందని మీ ఫ్రెండ్స్ కి, ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు.

మిమ్మల్ని మీరే నిధించుకోవడం :

మిమ్మల్ని మీరే నిధించుకోవడం :

మొదటి డేటింగ్ లో అతను మీ పై అసక్తి లేకపోవడానికి మీరే కారణమన్నట్లుగా మిమ్మల్ని మీరే నిధించుకోవల్సిన అవసరం లేదు. అతనికి నచ్చకపోవడం మీ తప్పు కాదు. కాబట్టి మీకు మొదటి డేటింగ్ లో పరాభవం ఎదురైతే, మరొకరితో డేటింగుకు సిద్ధమవ్వండి.

మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మరొకరితో డేటింగ్ చేస్తుంటే?!

మగవారిని నిందించకండి :

మగవారిని నిందించకండి :

మొదటి డేటింగ్ తర్వాత అతను మీతో కలసి ఉండేందుకు మీకు గాని ఫోన్ చెయ్యకపోతే "మగవాళ్లకు మర్యాదలేని వారని, కృతజ్ఞత లేనివారని" అనుకోవాల్సిన పనిలేదు. అందులో కొందరు మంచివాళ్లు కూడా ఉండవచ్చు. మీరు త్వరలో అలాంటి మంచితనాన్ని కూడా చూడవచ్చు.

మీరు తగిన అర్హత లేదని నిర్ణయించుకోకండి :

మీరు తగిన అర్హత లేదని నిర్ణయించుకోకండి :

కొన్ని సంబంధాలు విఫలమయ్యాయని (లేదా) కొన్ని డేటింగ్స్ పెయిల్ అయ్యాయని - మీకు ప్రేమను పొందేందుకు అర్హత లేదని అర్థం కాదు. మీరు ఒక తప్పు భాగస్వామిని ఎంచుకున్నారని దాని అర్థం.

మాజీ ప్రియుడిని వెనక్కి పిలవడం :

మాజీ ప్రియుడిని వెనక్కి పిలవడం :

మీరు మొదటి డేటింగ్ లో పెయిల్ అయ్యారని, మీ మాజీ ప్రియుడిని తిరిగి పొందేందుకు, అతన్ని వెనక్కి పిలవడం వంటి తప్పులను చెయ్యకండి. అది చాలా పెద్ద తప్పు. మళ్ళీ మీ జీవితంలోకి అలాంటి పాత ఇబ్బందులు పడవద్దు.

మీ స్ధాయిని అంచనా వేసుకోండి :

మీ స్ధాయిని అంచనా వేసుకోండి :

అవతలి వ్యక్తి మీరు అధిక స్థాయిని, అంచనాలను కలిగి ఉన్నారని ఊహించి వెనుతిరిగితే - మీరు వెంటనే మీ స్థాయిని తగ్గించుకోనవసరం లేదు. నిజానికి, మీలాంటి స్థాయి వారితో కలిసి బ్రతికే వారి కోసం వేచి చూడటంలో ఇది సహాయం చేస్తుంది.

డేటింగ్ పిల్లలు...డౌటింగ్ పేరెంట్స్!

డేటింగ్ ని వదిలేయ్యడం :

డేటింగ్ ని వదిలేయ్యడం :

కేవలం ఒకటి లేదా రెండు డేటింగులు చెడిపోవడం వలన మీరు డేటింగ్ పై ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇది ఏదో ఒకరోజు పనిచేస్తుంది.

English summary

What Not To Do If Your First Date Goes Bad?

Are you wondering what to do if your first date goes bad? Well, things may move further or they may not depending upon many factors. Read this!
Story first published: Wednesday, August 16, 2017, 18:26 [IST]
Subscribe Newsletter