Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఒక అమ్మాయికి చాలా మంది అబ్బాయిలతో స్నేహం కలిగి ఉంటే దాని అర్థం ఏమిటి ?
ఒక అమ్మాయికి చాలా మంది అబ్బాయిలతో స్నేహం కలిగి ఉంటే దాని అర్థం ఏమిటి ?
మీ ప్రేయసికి చాలా మంది అబ్బాయిలతో స్నేహం కలిగి ఉంటే, అది చెడ్డవిషయమా ? చాలామంది అబ్బాయిలతో స్నేహం కలిగి ఉన్నటువంటి ప్రేయసిని - మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు మొదట్లో అభద్రతా భావాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే, అలాంటప్పుడు మీరు మీ బంధం గూర్చి ఆందోళన చెందటం చాలా సహజమైన విషయం.
కానీ, మీరు మీ ప్రేయసి యొక్క అనుకూల అంశాలను అర్థం చేసుకుంటే, మీరు ఊపిరి తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. నిజానికి, సామాజికంగా చురుకుగా ఉన్న ఒక అమ్మాయితో మీరు డేటింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలను గురించి తెలిస్తే, మీరు కూడా మంచి అనుభూతిని పొందుతారు.

ఆమె మగవారిని మరింతగా అర్థం చేసుకోవచ్చు.
నిజానికి, అబ్బాయిలతో స్నేహం కలిగి ఉన్న అమ్మాయిలకి - మగవాళ్లు ఎలా ఆలోచిస్తారో, ప్రవర్తిస్తారో, ఎలా పనిచేస్తారో అనే విషయాల గూర్చి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిమల్ని బాగా అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా సహాయపడవచ్చు.

ఆమె భద్రత గురించి మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు :
ఆలస్యం అయితే, ఆమె స్నేహితుల్లో ఎవరో ఒకరు ఆమెను సురక్షితంగా ఇంటి దగ్గర వదిలేస్తారు. ఆమె ఆరోగ్యం బాగోలేనట్లయితే, మీరు ఆమెను చేరుకోడానికి ముందే ఎవరైనా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు, అలాగే మీరు ఆమెని జాగ్రత్తగా చూసుకునే వరకూ సహకరిస్తారు. ఇది మీపై భారాన్ని కొంచెం తగ్గిస్తుంది.

మీరు సురక్షితంగా / భద్రంగా ఉంటారు :
మీరు సురక్షితంగా ఉంటారు, ఆమె ఇతర వ్యక్తులతో కాస్త చనువుగా ఉన్నట్లుగా మీకు స్పష్టంగా తెలిసిన, మీరు ఆమెపై భరోసాను కలిగి ఉంటారు. ఆమె ఇతరులతో స్నేహంగా మాత్రమే ఉంటుంది, కానీ ఆమె హృదయాన్ని దొంగిలించింది మాత్రం మీరే. కాబట్టి, మీరు అటువంటి హామీని / భద్రతను కలిగి ఉంటారు.

మీకు మద్దతు (సపోర్టు) కూడ దొరుకుతుంది :
మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆమె స్నేహితుల దగ్గర నుండి మంచి సపోర్టును పొందవచ్చు. మీరు ఉద్యోగం మారలనుకున్నప్పుడు, ఆమె స్నేహితులు మీకు ఇతర మంచి కంపెనీలను సూచించవచ్చు. ఈ విధంగా, మీరు మీ జీవితంలో ఎక్కువ సపోర్టును పొందవచ్చు.

గొడవలు ఎక్కువగా రావు :
ఆమె తన సమయాన్ని జాబ్ కోసం, స్నేహితుల కోసం కేటాయించడం వల్ల మీతో గొడవపడటానికి ఆమెకు తీరిక ఉండదు. పనిలేని వ్యక్తి బుర్రలో చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు. అలా పాత గొడవల గూర్చి ఆరాతీసి మీకున్న మంచి సమయాన్ని చెడగొట్టరు.

ఆడ స్నేహితులతో కలిసి ఉండేందుకు మీకు అనుమతినిస్తారు :
అవును, మీరు మీ ఆడ స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు మీ మీద అనుమానపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. నిజానికి, ఆమె వారితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.

సరైన అభిప్రాయలను కలిగి ఉండటం :
మగవారి గూర్చి బాగా తెలిసిన ఆడవాళ్లు, పెద్ద మనసును, సరైన అభిప్రాయలను కలిగి ఉంటారు. వారు మగవారి సమస్యల గూర్చి మరింతగా తెలుసుకుంటారు, సానుభూతిని కలిగి ఆత్మీయంగా ఉంటారు. మరోసారి ఆలోచించకుండ, మీరు ఆమెతో ముందుకు కొనసాగవచ్చు.



Click it and Unblock the Notifications