మీ భాగస్వామి అతిగా మాట్లాడుతుంటే…

By: Deepti
Subscribe to Boldsky

సాధారణంగా మీ భాగస్వామి మాట్లాడే ప్రియమైన మాటలు వింటే, మీకు ఎంతో ఆనందంగా ఉంటాయి. కానీ మీ ప్రియుడు/ప్రియురాలు రోజంతా మాట్లాడుతూనే ఉంటే ఎలా? మీ మెదడు తినేస్తున్నట్టు అనిపిస్తుంది,కదా?

మీతోనే కాక మీ స్నేహితులతో కూడా అదే పనిగా మాట్లాడుతుంటే, మీకు ఎంత ఇబ్బందిగా, సిగ్గుగా ఉంటుంది? మీ స్నేహితులు మిమ్మల్ని బుర్రతినే పార్టీగా ముద్ర వేసేస్తారు!

మగవారు అక్రమ సంబంధాల పై ఎందుకు మోజుపడతారు?

అవును, ఎలాంటి మాటకారి అయినా అంతసేపు మాట్లాడితే వినడం కష్టం. కానీ మీ భాగస్వామి ఇవేమీ పట్టించుకోకపోతే? ముందు మీ ప్రియురాలు/ప్రియుడు అంత ఎందుకు మాట్లాడుతున్నారో విశ్లేషించండి. దానికి మార్గాలు ఇవిగో, చదవండి!

అతను లేదా ఆమె బహిర్ముఖులు (Extrovert)

అతను లేదా ఆమె బహిర్ముఖులు (Extrovert)

కొంతమంది మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు, మరికొంతమంది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. వారికి మాట్లాడితేనే సంతోషంగా ఉంటుంది.

కానీ అంతర్ముఖులు కొంచెం ఎక్కువ మాట్లాడినా, ఎక్కువమందిని కలిసినా తొందరగా అలసిపోతారు. అందుకని ఒకవేళ మీ భాగస్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటే అతను లేదా ఆమె బహిర్ముఖులు అవ్వచ్చు.

మీ భాగస్వామి అహం ఉన్న వ్యక్తా?

మీ భాగస్వామి అహం ఉన్న వ్యక్తా?

మీ భాగస్వామి చాలాసమయం తనగురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటే అతను లేదా ఆమె అహం ఉన్న వ్యక్తి కావచ్చు.

కొంతమందికి తామే ప్రపంచానికి మూలం అనుకునే ఊహల్లో తేలే మనస్తత్వం ఉంటుంది. వారు ప్రతి విషయంలో, ప్రతి సంభాషణలో తమకి తాము అతి ప్రాధాన్యత ఇచ్చుకుంటుంటారు.

టీనేజర్స్ కన్యత్వం కోల్పోకముందే తెలుసుకోవాల్సిన విషయాలు

మీ భాగస్వామి చక్కగా వ్యక్తీకరించగలరు!

మీ భాగస్వామి చక్కగా వ్యక్తీకరించగలరు!

కొంతమందికి మాట్లాడే కళ ఉంటుంది. వారు సరైన పదాలు ఎంచుకుని వాక్యాలు అందంగా మలచగలరు. అలాంటి వారు సగటుకన్నా ఎక్కువ తమ ప్రతిభను నిరూపించుకోవాలనే ఆత్రుతతో మాట్లాడతారు.

అది అభద్రతాభావమా?

అది అభద్రతాభావమా?

కొంతమందికి తమ అసలు ఫీలింగ్స్ ను దాచటానికి, అభద్రతా భావాలను కప్పి ఉంచటానికి ఇతరులతో ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది.

అది మానసిక వత్తిడా?

అది మానసిక వత్తిడా?

కొంతమంది తమ మానసిక ఒత్తిడిని బయటకి వెళ్ళగక్కటానికి ఇతరులతో ఎప్పుడూ తమ సమస్యల గురించి మాట్లాడుతుంటారు. కానీ అది వారు కేవలం అధిక వత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు.

వారితో ఎలా వేగాలి?

వారితో ఎలా వేగాలి?

మొదట ఎందుకు వారు అతిగా మాట్లాడుతున్నారో కారణం తెలుసుకోండి. తర్వాత మీతోనే అలా ఉంటున్నారా, అందరితో అంతేనా తెలుసుకోండి.

ఒకవేళ మీ భాగస్వామి అందరితో అలానే ఉంటే, వారికి థెరపీ అవసరం కావచ్చు. అంతేకాక మీరు బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా అతిగా మాట్లాడుతుంటే, మీరు వారికి మీ దగ్గర సమయంలేదని స్పష్టంగా చెప్పవచ్చు. మీ అసౌకర్యం గురించి చెప్పటం మర్యాద లేకపోవటం కాదు.

English summary

When Your Partner Talks Too Much...

When your partner talks too much for hours together, it is quite natural to feel bored. What to do then? Read this first!
Story first published: Saturday, July 8, 2017, 17:00 [IST]
Subscribe Newsletter