కొందరు వయస్సు 40, 50 దాటినా పెళ్లి మాత్రం వద్దంటారు! ఎందుకు?

Posted By: Staff
Subscribe to Boldsky

మీకు 25 సంవత్స్రరాల వయసు రాగానే వివాహం చేసుకోమని స్నేహితులు, కుటుంబ సభ్యులు తొందరపెడుతుంటారు.ఇంకొంతమంది జీవితంలో ఎప్పుడు స్థిరపడతావని అడుగుతుంటారు. స్థిరపడటం అంటే వివాహమ అని వారి అర్ధం.

కానీ మీకు మాత్రం వివాహం ముఖ్యం కాదు అనుకునేవారయితే మీరు ఈ బంధంలోకి బలవంతంగా వెళ్ళక్కర్లేదు.మీరు పెళ్ళి అనే చట్రంలో ఇమడలేము అనుకుంటే కేవలం ఇతరుల బలవంతం పెళ్ళి చేసుకోవాలి అనుకోకూడదు.

మీకు ఇష్టం లేకపోతే వివాహం చేసుకోక్కర్లేదు.కానీ మీరు ఒంటరి జీవితాన్ని జీవితాంతం ఆస్వాదించగలరా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి .

పెళ్ళి చేసుకోకపోయినా ఓకే అనడానికి 7 కారణాలివిగో:

1. వయసైపోతోంది కాబట్టే..

1. వయసైపోతోంది కాబట్టే..

మిమ్మలని పెళ్ళి చేసుకోమని బలవంత పెట్టిన స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు పెళ్ళయ్యాకా ఆ వివాహ బంధం ఇబ్బందుల్లో ఉన్న, లేదా ఇతర సమస్యలొచ్చినా అప్పుడు కనీసం మీ ముఖం కూడా చూడరు. మీకు వయసయిపోతోంది కాబట్టి పెళ్ళి చేసుకోమని వీరందరూ బలవంతపెడతారంతే.

2.వివాహం అనేది ఒక లేబుల్ మాత్రమే.

2.వివాహం అనేది ఒక లేబుల్ మాత్రమే.

మనం సమాజం, తల్లి తండ్రుల ఆమోదంతో ఒకరికి కమిట్ అయ్యాము అని చెప్పే లేబుల్ మాత్రమే ఇది. కాబట్టి ఆ లేబుల్ దాటి ఆలోచించండి.

3.వివాహం అనేది అన్నీ సరిగ్గా ఉంటేనే వర్కవుట్ అయ్యే ఆప్షన్.

3.వివాహం అనేది అన్నీ సరిగ్గా ఉంటేనే వర్కవుట్ అయ్యే ఆప్షన్.

ఇద్దరికీ సరిపడకపోవడం లాంటి కారణాల వల్ల ఇది ఫెయిల్ అయితే జీవితం నరక ప్రాయం అవుతుంది. ఒక్కోసారి ఇది మీ మనస్సు మీద మాయని గాయాన్ని ఏర్పరుస్తుంది.

4. అంతా మీ అద్రుష్టం

4. అంతా మీ అద్రుష్టం

మీకు వచ్చే భాగస్వామి మిమ్మల్నీ అర్ధం చేసుకునేవారయ్యి, మీ ఇరు కుటుంబాల సహకారం ఉంటేనే వివాహం విజయవంతమవుతుంది.మీ ఇరు కుటుంబాలకి ఒకరంటే ఒకరికి పడకపోయినా లేదా మీ భాగస్వామి మీ స్వేచ్చకి అడ్డుపడేవారయితే వివాహం మీకు పీడకలగా మిగుల్తుంది.

5. కలసి మెలసి ఎలా ఉంటారు

5. కలసి మెలసి ఎలా ఉంటారు

మీరు ఎవరితోనయినా పీకల్లోతు ప్రేమలో ఉంటే తప్ప ఒకరితో దశాబ్దాలపాటు కలిసి ఉండలేరు.

6. వివాహం మీ ఆనందాన్ని హరించెస్తుంది?

6. వివాహం మీ ఆనందాన్ని హరించెస్తుంది?

మీకు జీవితంలో కొన్ని లక్ష్యాలుండి కేర్ ఫ్రీ లైఫ్ గడపాలనుకుంటే వివాహం మీ ఆనందాన్ని హరించెస్తుంది.

7. పెళ్లికంటే బిడ్డను దత్తత తీసుకోవడం ఉత్తమం:

7. పెళ్లికంటే బిడ్డను దత్తత తీసుకోవడం ఉత్తమం:

వివాహం యొక్క పరమార్ధం పిల్లా పాపలతో సంతోషంగా ఉండటమే.మీరు కనుక ఇప్పటికే సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఒక బిడ్డని దత్తత తీసుకోండి.

పెళ్ళి మీకు ఆనందాన్ని ఇస్తుందని నమ్మితేనే వివాహ బంధంలోకి ప్రవేశించండి అంతే తప్ప బంధువులు, స్నేహితుల బలవంతం మీద కాదు.

English summary

Why It's Ok To Never Get Married

Yes, it is ok to never get married if you don't feel like. But ask yourself whether you will be able to find joy living alone for your whole life. Here are some reasons why its ok to never get married.
Subscribe Newsletter