Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
లావుగా ఉన్నంత మాత్రాన నిరాశ వద్దు!
ప్రతిఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు భాగస్వామి తప్పక దొరుకుతారు. మీరు కేవలం అధిక బరువు ఉన్నందువల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి, ఈ నమ్మకాన్ని వదిలేస్తే, ఇక అలా ఆలోచించటం మానేయండి.
బంధాలనేవి ఆకారం, అందం చూసి రాకూడదు! మీ భాగస్వామి అతనికి కావాలసిన అమ్మాయి ఆకారం గూర్చి ఎక్కువ చింతిస్తున్నట్లయితే, మీకు అలాంటి వ్యక్తి అవసరం లేదు.
ఆరోగ్యంగా ఉండటం కోసం బరువు తగ్గాలనుకోవటం మంచిదే. అంతేకానీ, సన్నగా కన్పిస్తేనే మిమ్మల్ని గుర్తిస్తారు అనుకుంటే, అబ్బాయిలు నిజంగానే మీ బలహీనతను అవకాశంగా మార్చుకుంటారు.
బంధాల గురించి జరిగిన అనేక సర్వేలలో, పురుషులు ఆడవారి మొత్తం వ్యక్తిత్వం చూసి ఆకర్షితులమవుతామని తెలిపారు. అదికూడా జీవితకాలపు బంధాలకు. ఈ కారణం చాలకపోతే, కేవలం అధిక బరువు కారణంగా మీరు ఎందుకు సర్దుకుపోకూడదో మరిన్ని కారణాలు చదవండి.

ప్రేమ శారీరకం కాదు!
జీవితకాల బంధాల విషయానికి ఒచ్చేసరికి, ప్రేమ పాత్ర తగ్గి, అర్థం చేసుకోవటం పాత్ర పెరుగుతుంది.
ప్రేమ, అనుబంధం అనేవి ఇద్దరు భాగస్వాముల శారీరక రూపాలను దాటి వెళ్తాయి. అందుకని ఈ విషయం తెలుసుకున్న ఇంగితం ఉన్న అబ్బాయి కోసం నిరీక్షించండి. తొందరపడవద్దు!

అతను మీ శరీరాన్ని ఎగతాళి చేస్తుంటే, జీవితాంతం అతనితో కలిసి ఎలా జీవించగలరు?
మీ తినే అలవాట్లు, బరువు వంటి విషయాలని హేళన చేసే అతని వెనక పడితే, జీవితం మొత్తం సంతోషంగా ఎలా ఉంటారు? ప్రసక్తే లేదు! ఇకనైనా కళ్ళు తెరవండి!
బరువు తగ్గాక, అతను మీ విషయంలో మరోదాని గురించి ఎగతాళి చేయవచ్చు! అలాంటి అలవాటున్న వ్యక్తికి ఒక కారణం కాపోతే మరొకటి.

అతనేమన్నా మీకు సాయం చేస్తున్నాడనుకుంటున్నాడా?
సరే, అతను అందంగా ఉన్నాడు, మీ ప్రేమను అంగీకరించి మీకేదో సాయం చేస్తున్నాడనుకుంటున్నాడు. మీకు అది సమ్మతమేనా? లేదు, మీరింత తొందరపడక్కర్లేదు. ఏ బంధమైనా ఎవరికీ దానం చేసేది కాదు. అతనికి మీరు నచ్చితేనే అతను ప్రేమిస్తాడు. లేకపోతే మీ జీవితంలో మీరు ముందుకు సాగండి.

మీరు అందరికీ కనువిందు చేయాల్సిన అవసరం లేదు
ఒక అబ్బాయి మిమ్మల్ని అతని స్నేహితులకు పరిచయం చేయటానికి సిగ్గుపడితే, అది కూడా కేవలం ఆ అధిక కిలోల వలన, అతను ఎదగాలని అర్థం. మీకూ మిమ్మల్ని గర్వంగా అందరికీ చూపే వ్యక్తి దొరుకుతాడు.

మీరు ఎవరితో పోటీపడక్కర్లేదు
ఇతర అందమైన, సన్నగా ఉండే యువతులు మీకు పోటీ కానక్కర్లేదు. మీరు నిరాశలో కూరుకుపోకుండా ఉండాల్సిన మరో కారణం ఇది. ఆ అబ్బాయి మీ వెనక కాకుండా, మరో అమ్మాయిల వెనక తిరుగుతుంటే, మీరు పై పై హంగులు తప్ప ఇంకేం చూడలేని ఆ వ్యక్తిని వదిలించుకోవాలని అర్థం. ఎంత అదృష్టవంతులు మీరు !

జీవితంలో బంధాలు మాత్రమే కాదు ముఖ్యం
మీ జీవితం ఒక అబ్బాయి ఉన్నా, లేకపోయినా అందంగానే ఉండవచ్చు. ఈ బంధాలు అనేవి జీవితంలో ఒక భాగం అంతే. వీటికి మరీ ఎక్కువ వెచ్చించాల్సిన అవసరం లేదు.

మీ బరువు ఎంత ఉన్నా మీ స్థాయి, ఆలోచనలను ఉన్నతంగా ఉంచుకోవచ్చు
మీ విలువ కేవలం శారీరక స్థాయి వద్ద ఆగిపోనక్కర్లేదు. అందుకని, మీకు కావాల్సినవి, అబ్బాయిలో కోరుకునే లక్షణాలు కేవలం మీరు అధిక బరువు పెరిగారనే కారణంతో కిందకి పడిపోనక్కర్లేదు.



Click it and Unblock the Notifications