ఆమె మీతో క‌ల‌కాలం ఉంటుంద‌న‌డానికి 6 నిద‌ర్శనాలివే!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మీరు ఒక‌మ్మాయితో డేటింగ్ లో ఉన్న‌ప్పుడు ఆమె మీతోపాటు క‌ల‌కాలం ఉంటుందా లేదా మ‌ధ్య‌లోనే ఉంటుంద‌నే విష‌యం తెలుసుకోవ‌డ‌మెలా అని ఆలోచిస్తున్నారా? స‌ంబంధంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా ఇలాంటి సందేహాలు వ‌స్తుంటాయి.

మీరు డేటింగ్ చేసే అమ్మాయి ప్ర‌తి క‌ద‌లిక ఆమె స్వ‌భావాన్ని, ఆమెకు మీ ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను తెలుపుతాయి. క‌ల‌కాలం ఆమె ఇలాగే కొన‌సాగిస్తుందో లేదో సులువుగానే అంచ‌నా వేయొచ్చు. మ‌రి అలాంటి సంగ‌తులేమిటో చూద్దామా...

1.ఆమె స‌పోర్ట్ ఎప్పుడూ

1.ఆమె స‌పోర్ట్ ఎప్పుడూ

మీరు అడిగినా అడ‌గ‌క‌పోయినా ఆమె స‌పోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరేదైనా స‌మ‌స్య‌లో ఉంటే ఆమెకు చేతైనంత స‌హాయం చేస్తుంది. ఆమె మ‌ద్ద‌తు బాగా ఉంటుంది. ఏ స‌మ‌యంలోనైనా స‌హాయంగా ఉంటుంది.

2.త‌ల్లి లాగా ...

2.త‌ల్లి లాగా ...

మీ త‌ల్లి లాగా ఆమె ఎప్పుడూ సంర‌క్షిస్తుంటుంది. మీ ఆహారం, వైద్యం గురించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. మీరు స్నేహితుల‌తో బ‌య‌ట‌కు వెళుతుంటే ఎక్క‌డ‌కు వెళుతుంది ఓ కంట క‌నిపెడుతు ఉంటుంది. మిమ్మ‌ల్ని విసిగించ‌దు కానీ మీ యోగ‌క్షేమాలు క‌నుక్కునేందుకు క‌నీసం ఒక‌టో రెండో మెసేజీల‌ను పంపిస్తుంది. మీ సమ‌స్య‌ల గురించి ప‌ట్టించుకొని ప్ర‌తి దాన్ని త‌న‌దైన దానిలా తీసుకుంటుంది.

3. ఆమెను మీరు గుడ్డిగా న‌మ్మొచ్చు...

3. ఆమెను మీరు గుడ్డిగా న‌మ్మొచ్చు...

ఆమెను మీరు గుడ్డిగా న‌మ్మొచ్చు. ఆమె స్నేహితులంతా మీకు తెలిసిన‌వారే. వాళ్ల గురించి ఎలాంటి దాప‌రికాలు లేకుండా చెబుతుంది. ఆమె జీవితంలోని ప్ర‌తి విష‌యం మీకు స్ప‌ష్టంగా తెలిసి ఉంటుంది. విశ్వాసానికి ఆమె ప్ర‌తీక‌గా నిలుస్తుంది.

4.ఎల్ల‌ప్పుడూ నిజాయ‌తీగా ..

4.ఎల్ల‌ప్పుడూ నిజాయ‌తీగా ..

ఆమె మీ ప‌ట్ల ఎల్ల‌ప్పుడూ నిజాయ‌తీగా ఉంటుంది. మీరు స‌రిగ్గా క‌నిపించ‌క‌పోయినా, మంచి బ‌ట్ట‌లు వేసుకోక‌పోయినా వెంట‌నే చెప్పేస్తుంది. మీతో ఎప్పుడూ అబద్ద‌మాడ‌దు. నిజాయ‌తీగా ఉండేందుకే ప్ర‌య‌త్నిస్తుంది. మీతో ఒక‌సారి అబ‌ద్ధ‌మాడినా అది తాత్కాలిక‌మే. చాలా కాలంపాటు నిజాన్ని దాచ‌లేక ఉండ‌లేదు.

5.గ‌మ్మ‌తైన ఆక‌ర్ష‌ణ...

5.గ‌మ్మ‌తైన ఆక‌ర్ష‌ణ...

మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో తెలియ‌ని గ‌మ్మ‌తైన ఆక‌ర్ష‌ణ ఆవ‌రించి ఉంటుంది. మీ ఇద్ద‌రి కెమిస్ట్రీ బాగా పండుతుంది. ఆమె సాన్నిహిత్యం మీకు ఆనందాన్ని క‌లిగిస్తుంది. ఆమె ప‌క్క‌న ఉంటే మీకు బోర్ అనేదే ఉండ‌దు. మీకు ఆమె ప్రాణ స్నేహితురాలిగా మిగులుతుంది. మీ ఇద్ద‌రు బాగా క‌లిసిపోగ‌ల‌రు.

6.స్వేచ్ఛ ఇస్తుంది...

6.స్వేచ్ఛ ఇస్తుంది...

ఆమె మీకు త‌గినంత స‌మ‌యం ఇస్తుంది. దాంతో పాటే స్వేచ్ఛ ఇస్తుంది. ప్ర‌తిసారీ మిమ్మ‌ల్ని అంటిపెట్టుకొని ఉండాల‌ని చూడ‌దు. వ‌రుస‌గా 10 సార్లు కాల్ చేయ‌దు. మీరు స్నేహితుల‌తో బ‌య‌ట ఉన్న‌ప్పుడు మీకంటూ త‌గినంత స‌మ‌యం ఇస్తుంది.

English summary

6 Times she proves that she is a keeper

How do you know if the girl you are dating is a keeper or a player? Anyone can cheat, anyone can fall out of love, people walk out of relationship all the time but how would you know? How can you tell if the one you are dating is a keeper? There should be some way to find out whether the girl you are dating is keeper.
Subscribe Newsletter