మీరు మీ మాజీ ప్రేమికుల గురించి కలలు కంటున్నారా? మానసిక వైద్యులు ఏమని చెబుతున్నారంటే

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ గతం ఇప్పుడు నిజం కాకపోవచ్చు. కానీ, ఆ జ్ఞపకాలు మాత్రం మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి వెంటాడుతూ ఉంటాయి. ఆ యొక్క అనుభవాలు, మీ యొక్క కొత్త సంబంధ బాంధవ్యాల చిత్తశుద్ధి పై మాత్రమే ప్రభావం చూపించవు. వీటికి తోడు మీ యొక్క ప్రస్తుత సంబంధ బాంధవ్యాలను విచ్ఛిన్నం చేసే అవకాశం కూడా ఉంది. మీ యొక్క జ్ఞాపకాలు మీ ప్రస్తుత జీవితంపై ప్రభావం చూపించకుండా ఉండాలంటే, మీరు ఎన్నో చేయవచ్చు. కానీ, మీరు మీ యొక్క మాజీ ప్రేమికులను కలలు కనే విషయాన్ని పూర్తిగా నిషేధించడం అనేది అసాధ్యం అనే చెప్పాలి.

మీరు మీ గత సంబంధబాంధవ్యాల గురించి ఆలోచించడం పూర్తిగా మానివేసి ఉండి ఉండవచ్చు. కానీ, అప్పుడప్పుడు వారి గురించి మీరు కలలు కనే అవకాశం ఉంది. కానీ, ఇది మీ అధీనంలో లేని విషయం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది. ఇలా జరగడం వెనుక అసలు కారణం ఏమిటి అనే ప్రశ్నలు సాధారణంగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు నోయిడా కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ అవని తివారి వీటిని విశ్లేషించే ప్రయత్నం చేసారు. గత సంబంధబాంధవ్యాలు గురించి కలలో రావడం వెనుక అసలు అర్ధాన్ని వివరించారు.

దీని వెనుక సంకేతాత్మకమైన అర్ధం ఉంది :

దీని వెనుక సంకేతాత్మకమైన అర్ధం ఉంది :

" ప్రతి ఒక్క కలలో, ప్రయత్నించినా లేదా విజయవంతమైన ఎదో ఒక కోరిక అనేది ఉంటుంది. చేతనంగానో, అచేతనంగానో ప్రతి ఒక కల వెనుక ఒక రహస్య అర్ధం ఉంటుంది. ప్రతి కోరికను తీర్చుకోవాలి అనే ఒక అర్ధం ధ్వనిస్తుంది " అని ప్రముఖ మానసిక వైద్యులు ఫ్రాయిడ్ చెప్పారు. మనం ఎప్పుడైతే కలల గురించి మాట్లాడటమే అవి సాధారణంగా అందరికి వచ్చేవే. సాహిత్య వివరణలు, సంకేతాత్మకమైన అర్ధాలు ఎన్నో వీటి వెనుక ఉంటాయి. మీరు గనుక మీ మాజీ స్నేహితుడు లేదా భాగస్వామి లేదా ప్రేమికుల గురించి ఆలోచిస్తున్నట్లైతే వాటి వెనుక వివిధ కోణాలు సందర్భర్ధానికి తగినట్లుగా ఉండవచ్చు.

అవి మీ యొక్క సఫలీకృత అవసరాన్ని తెలియజేస్తుంది.

అవి మీ యొక్క సఫలీకృత అవసరాన్ని తెలియజేస్తుంది.

ఇది వారితో మీకు ఉన్న సాన్నిహిత్యాన్ని అచ్చంగా తెలియజేస్తుంది. మీరు దేనిగురించి అయితే కల గంటున్నారో, అందులో ఎదో వెలితి ఉందని, అది నెరవేరడానికి ఆశపడుతున్నారని ఇది సూచిస్తుంది. ఆ పని ఆ వ్యక్తిని సంకేతాత్మక అర్ధం వచ్చేలా సూచించవచ్చు లేదా ఆవ్యక్తి సంకేతాత్మక అర్ధం వచ్చేలా ఆ పనిని సూచించవచ్చు.

సంబంధబాంధవ్యాల్లో మీరు ఎదో కోల్పోతున్నారు అనే భావన మీలో ఉండవచ్చు :

సంబంధబాంధవ్యాల్లో మీరు ఎదో కోల్పోతున్నారు అనే భావన మీలో ఉండవచ్చు :

మీరు గతంలో సంబంధ బాంధవ్యంలో ఉండేటప్పుడు ఎలా ఉండేవారు లేదా కలిసి ఏమి చేసేవారు అనే విభిన్న విషయాలకు సంబంధించి ఏదైనా మీరు కోల్పోతున్నారు అనే భావన మీలో కలిగి ఉండవచ్చు. మీరు గతంలో చేసిన పనులు ఇప్పుడు చేయలేకపోతున్నాను అనే భావన మీలో ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే మీరు వారిని కోల్పోయాము అనే భావన మీలో ఉండి ఉండవచ్చు.

నెరవేరని అవసరాన్ని కూడా ఇది తెలియజేస్తుంది :

నెరవేరని అవసరాన్ని కూడా ఇది తెలియజేస్తుంది :

మరో వైపు దీనర్ధం నెరవేరని అవసరం అయి కూడా ఉండవచ్చు. మీరు కొన్ని పనులను వారితో కలిసి చేయాలి; అని భావించి ఉండవచ్చు. కానీ, మీరు వారితో అవి చేయకపోయి ఉంటారు లేదా ఎక్కువసార్లు చేసి ఉండరు. అవి మానసికమైనటువంటివి, భావోద్వేగ పరమైనటువంటివి, సహాయసహకారాలు అందించేవి , ఇద్దరికీ ఎదుగుదలకు సహాయపడేవి లేదా శృంగారపరమైనవి అయినా కావొచ్చు. ఈ చర్యలు అన్ని వాటంతటకు అవే వ్యక్తీకరిస్తాయి లేదా సంకేతాత్మకమైన అర్ధం వచ్చేలా చేస్తాయి.

ఏదైనా చర్య లేదా గుణం మీ యొక్క ప్రస్తుత భాగస్వామిలో కావాలని కోరుకున్నప్పుడు :

ఏదైనా చర్య లేదా గుణం మీ యొక్క ప్రస్తుత భాగస్వామిలో కావాలని కోరుకున్నప్పుడు :

మూడవది, ఏదైనా చర్య లేదా గుణం మీ యొక్క ప్రస్తుత భాగస్వామిలో మీరు కావాలని కోరుకొని ఉంటారు. కానీ, అది మీకు దక్కకపోయి ఉండవచ్చు. ఇటువంటి సమయంలో మీ మాజీ ప్రేమికుల్లో అటువంటి గుణం లేకపోయినప్పటికీ కూడా, వారి గురించి మీకు కలలు రావొచ్చు. శృంగారపరంగా బాగా ఉత్సహంగా మీ గత భాగస్వామి వ్యవహరించినట్లు లేదా మిమ్మల్ని ఎంతో బాగా సంరక్షించినట్లు ఇలా ఎన్నో కలలు మీకు వాస్తు ఉంది ఉండొచ్చు. కానీ ఈ గుణాలు కూడా మీ మాజీ ప్రేమికులలో ఉండకపోయి ఉండవచ్చు. ఏదైతే మీ జీవితంలో కోరుకుంటున్నారో అది మీకు దక్కనప్పుడు ఇలాంటి కలలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ మాజీ భాగస్వామి కూడా మీ ప్రస్తుత జీవితంలో లేకపోవడంతో వారు కూడా మీ కలలోకి వస్తూ ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి సాహసోపేతమైన యాత్రలు తన మాజీ భాగస్వామితో చేసినట్లు కలలు కని ఉండవచ్చు. కానీ ,విచిత్రం ఏమిటంటే, ప్రస్తుత భాగస్వామిలో కానీ లేదా మాజీ భాగస్వామిలో అటువంటి లక్షణం లేకపోయి ఉంటుంది. కానీ, వారు వారి యొక్క కల ద్వారా ఏమి వ్యక్తీకరించదలిచారంటే , తన జీవితంలో ఎలా అయితే మాజీ భాగస్వామి లేదో, అలానే ఆ యాత్రలు కూడా లేవు. అంటే దీనర్ధం ఇక్కడ ఏంటంటే, సంకేతాత్మకమైన అర్ధం వచ్చేలా తన జీవితంలో ఏవైతే లేవో ఆ రెండింటిని సరిసమానమైన దృష్టితో చూసేలా ఇక్కడ కల కనడం జరిగింది.

ఇందుకు వ్యతిరేకంగా కూడా మీరు భావిస్తూ ఉండవచ్చు :

ఇందుకు వ్యతిరేకంగా కూడా మీరు భావిస్తూ ఉండవచ్చు :

ఇందుకు వ్యతిరేకంగా కూడా మీరు భావిస్తూ ఉండవచ్చు. మీ యొక్క గత సంబంధబాంధవ్యాలు అంత బాగా లేకపోయి ఉంటే లేదా అత్యంత బాధాకరంగా గనుక మీ జీవితం అప్పుడు గడిచి ఉంటే, అటువంటి సమయంలో మీరు మీ యొక్క మాజీ భాగస్వామి పై ప్రతికూల విధంగా ఆలోచించే అవకాశం ఉంది. నా దగ్గరకు వచ్చే ఒకానొక ఖాతాదారురాలు ఎప్పుడూ తన మాజీ భర్తతో మూసి ఉంచిన ఒక చిన్న గదిలో ఉన్నట్లు కలలు కనేది. ఇది ఏమని సూచిస్తుంది అంటే, అతడు ఆమె యొక్క వృత్తిపరమైన ఎదుగుదలను అస్సలు సహించలేకపోయాడని అర్ధం. ఏ సంబంధబాంధవ్యాల్లో అయితే భాగస్వాములు అసంబద్ధంగా వ్యవహరిస్తారో, అటువంటి సమయంలో ఇలాంటి భయపెట్టే కలలు వస్తూ ఉంటాయి మరియు అవి పీడకలలుగా మారి మిమ్మల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి.

English summary

Dreaming about your ex? A psychiatrist tells what it means

Dreaming about your ex? A psychiatrist tells what it means,Even if your past doesn't stay 'real', the memories can re-appear to haunt. Projecting those experiences onto a new relationship not only affects your own sanity but also could be devastating for your current relationship. You could do a lot not to impose the m
Story first published: Wednesday, February 28, 2018, 16:30 [IST]