For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అనుకోకుండా సంబంధ బాంధవ్యాలు విచ్ఛిన్నం అయితే అప్పుడు ఎలా వ్యవహరించాలి ?

  By R Vishnu Vardhan Reddy
  |

  సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. అంతర్జాల వినియోగం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. మనకు ఇష్టమైన వారిని, మన మనస్సుకు నచ్చిన వారిని వెతకడం, వీటి వల్ల చాలా సులభతరం అవుతోంది. స్నేహితుల కోసం లేదా సంబంధ బాంధవ్యాలను ఏర్పాటుచేసుకోవడమై, అంతర్జాలంలో వెతికేవారి సంఖ్య కోట్లల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ, అంతర్జాల ప్రేమకు కూడా కొన్ని అవాంతరాలు, అడ్డంకులు ఉన్నాయి. మొదటిది, అవతలి వ్యక్తి యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే విషయం అంత త్వరగా అర్ధం కాదు. వారు ఎంతో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ ఉండవచ్చు. అద్భుతంగా మాట్లాడవచ్చు, మీతో చక్కగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ, అవన్నీ ఖచ్చితంగా నిజమా కాదా, అనేదే ఇక్కడ సమస్య.

  అంతర్జాలంలో పుట్టే ప్రేమ కొద్దిగా ప్రమాదకరమైనది మరియు మనస్సుని గాయపరిచే విధంగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఈ సంబంధ బాంధవ్యాలు అనూహ్యంగా మాయమైపోతుంటాయి, తెగిపోతుంటాయి. దీనినే ఆంగ్లంలో ఘోస్టింగ్ అని అంటారు. అంటే దీనర్ధం సంబంధ బాంధవ్యాలు అనుకోకుండా అంతమవ్వడం లేదా ఒక రకమైన భావోద్వేగంగా అతకని స్నేహం ప్రదర్శించడం లేదా తమ భాగస్వామిని దూరం పెట్టడం, వారితో ఏ రకమైన సంభాషణ కానీ, లేదా ఏ ఇతర మాటలు గాని లేకుండా వ్యవహరించడం అని అర్ధం.

  How To Deal With Ghosting

  మీరు గనుక సంబంధ బాంధవ్యాలు లేదా ఈ రకమైన స్నేహాల్లో మరీ ఎక్కువగా ఉండకపోయినప్పటికీ, ఇతర వ్యక్తులు మీతో గనుక కొద్దిగా ఇలా గనుక వ్యవహరిస్తే, మన మనస్సు ఎంతో కలత చెందుతుంది. ఏదైనా పూర్తిగా సమసిపోవాలి, అంతేగాని ఇలా తెగి తెగనట్లు మన తప్పులేకపోయినా మనల్ని దూరం పెట్టడం అనేది మనల్ని ఎంతగానో బాధించే అంశం. ఇటువంటి సందర్భాల్లో, ఈ నిజాన్ని మనం అర్ధం చేసుకొని వీటి నుండి ఎలా బయటపడాలి అనే విషయం ఆలోచించాలి. ఇలా చేయడం కష్టతరమైన విషయం అయి ఉండవచ్చు. కానీ అసాధ్యం కాదు. ఈ రకమైన ఘోస్టింగ్ అనే సమస్య తమకు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయమై ఇప్పుడు మనం కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోబోతున్నాం.

  మిమ్మల్ని ఎవరో ఆ స్థితిలో పెట్టారు అనే విషయాన్ని ముందు మీరు గుర్తించండి :

  మిమ్మల్ని ఎవరో ఆ స్థితిలో పెట్టారు అనే విషయాన్ని ముందు మీరు గుర్తించండి :

  మిమ్మల్ని ఎవరో దూరం పెట్టారు లేదా మీతో మాట్లాడటానికి మీ భాగస్వామి ఇష్టపడటంలేదు అనే విషయాన్ని గుర్తించడానికి లేదా అది జరిగింది అని నమ్మడానికి కొద్దిగా సమయం పడుతుంది. మీ భాగస్వామి మీకు సందేశాలు పంపడం లేదా అని మీ ఫోన్ ని మీరు తరచూ తనిఖీ చేసుకుంటూ ఉంటారు. వారి నుండి సందేశం రావాలని మీరు ఆశిస్తారు. అంతేకాకుండా మీ భాగస్వామి వ్యవహారం అంతా బాగానే ఉందా అనే అనుమానం మీలో కలుగుతుంది. వారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మరియు మీకు వచ్చిన సందేశాలు ఏంటి అనే విషయాలను ఏమైనా చూసారా అనే కొత్త అనుమానం మీలో మొదలవుతుంది.

  ఈ రకమైన సందర్భం ఎదురైనప్పుడు సాధారణంగా మీ భాగస్వామి కి ఒకసారి కాల్ చేయాలి. ఇలా చేయడం ద్వారా వారి యొక్క స్వభావాన్ని తెలుసుకోవచ్చు. వారు కనుక అప్పటికి మిమ్మల్ని దూరం పెడుతుంటే, వారు మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నారని అర్ధం చేసుకోవాలి. సంబంధ బాంధవ్యం తెగిపోబోతుంది అని తెలియజేయజేసే లక్షణం ఇది.

  మీతో సంబంధ బాంధవ్యాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నారు అనే నిజాన్ని మీరు అంగీకరించాలి :

  మీతో సంబంధ బాంధవ్యాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నారు అనే నిజాన్ని మీరు అంగీకరించాలి :

  మీరు ఎప్పుడైతే ఈ నిజాన్ని అంగీకరిస్తారో, అప్పుడు మాత్రమే మీరు ఇలాంటి సందర్భాల్లో చక్కగా వ్యవహరించగలరు. మిమ్మల్ని ఎంతో ప్రేమించే వ్యక్తి అనూహ్యంగా మీకు దూరం అయ్యాడు అనే విషయం జీర్ణించుకోవడం అంత సులభమైన విషయం ఏమి కాదు. కానీ, అలా చేయడం వల్ల ఈ సమస్య కొద్దిగా సులభంగా పరిష్కారం అవుతుంది. త్వరగా ఈ సమస్య నుండి బయటపడి కొత్త జీవితం ఏర్పడటానికి మార్గం దొరుకుతుంది.

  వేటాడటానికి లేదా వెంటాడడానికి దూరంగా ఉండండి :

  వేటాడటానికి లేదా వెంటాడడానికి దూరంగా ఉండండి :

  మీరు ప్రేమలో ఉన్నప్పుడు అది అంతర్జాలంలో కావొచ్చు లేదా నిజ జీవితంలో కావొచ్చు. వారి కోసం అన్ని విషయాలను తెలిసుకోవాలి అని వెంటాడకండి. ఎప్పుడైతే మీ భాగస్వామి ఒక తప్పు చేశాను మిమ్మల్ని ఎంచుకొని అని భావిస్తారో అప్పుడు వ్యక్తిగతంగా లేదా ఆన్ లైన్ లో మిమ్మల్ని దూరం పెట్టడం ప్రారంభిస్తారు. ఇక అప్పటి నుండి మిమ్మల్ని ఈ సమస్యలన్నీ వెంటాడుతుంటాయి. ఈ రెండు సందర్భాలు మిమ్మల్ని ఎంతగానో కృంగదీస్తాయి. కాబట్టి వేటాడకండి ఒకవేళ మిమ్మల్ని గనుక ఎవరైనా వెంటాడితే పట్టించుకోకండి వదిలేయండి.

  గతాన్ని ఒకేసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి :

  గతాన్ని ఒకేసారి క్షుణ్ణంగా పరిశీలించి అర్ధం చేసుకోడానికి ప్రయత్నించండి :

  మిమ్మల్ని ఎప్పుడైతే వ్యక్తులు అనూహ్యంగా దూరం పెడతారో, అప్పుడు వారి నుండి "ఇలా ఎందుకు జరిగింది" అనే విషయమై వివరణ ఎప్పటికి రాదు. మీరే ఇలా ఎందుకు జరిగింది అనే విషయమై ఆలోచించవలసి ఉంటుంది మరియు దీనికి ఎదో ఒక ముగింపు పలకాలి. కొన్ని సందర్భాల్లో ఆ కారణం మిమ్మల్ని దిగ్బ్రాంతికి గురిచేయవచ్చు. అది మీ మధ్య జరిగిన వాదన కావొచ్చు, మీ మధ్య అవగాహనా లోపం అయి ఉండవచ్చు లేదా మీ మధ్య పొసగపోకపోవడం వల్ల కూడా మీ సంబంధ బాంధవ్యాలు అనూహ్యంగా అంతానికి దారితీసి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఎదుటి వ్యక్తి చాలా పిరికివాడై ఉండవచ్చు. అందుకనే ఏమిచేయాలో అర్ధం కాక సంబంధ బాంధవ్యాన్ని ఇలా మర్యాదపూర్వకంగా అంతం చేయాలని భావించి ఉండవచ్చు.

  మిమ్మల్ని మీరు నిందించుకోకండి :

  మిమ్మల్ని మీరు నిందించుకోకండి :

  సమర్ధవంతమైన భాగస్వామిని వెతకడానికి మీలో మీకు ఎంతో దైర్యం ఉండాలి. ఆ స్థాయికి చేరాలంటే ఎంతో అవగాహన కూడా ఉండాలి. ఎప్పుడైతే మీ సంబంధబాంధవ్యయానికి అనూహ్యంగా తెరపడుతుందో, అటువంటి సమయంలో మీకు మీరే అనేక ప్రశ్నలు వేసుకొనే అవకాశం ఉంది. కానీ, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఎప్పుడు గాని నిందించుకోకండి.

  అంతర్జాలంలో సమర్ధవంతమైన ప్రేమికులు ఎంతో మంది ఉంటారు మరియు ఒక వ్యక్తితోనే జీవితాంతం గడపటం కొన్ని సందర్భాల్లో కష్టతరమే అవ్వొచ్చు. వ్యక్తులు ఎప్పుడుగాని తర్వాత దక్కబోయే ఉత్తమ విషయం ఏమిటి అనేది ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ ఆలోచనాధోరణి మరోరకంగా ఉన్నా కూడా వచ్చిన నష్టం ఏమి లేదు. కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీకు తగిన భాగస్వామి ఎవరో వెతకటం ప్రరంభించండి. ఖచ్చితంగా మీ ఆలోచనకు సరిపోయేవారు, మీ మనస్సుకు నచ్చినవారు దొరుకుతారు.

  ఆనందంగా గడపండి మరియు మీ పై మీరు దృష్టిని కేంద్రీకరించండి :

  ఆనందంగా గడపండి మరియు మీ పై మీరు దృష్టిని కేంద్రీకరించండి :

  ఏ విషయాన్ని మరీ ఎక్కువగా ఆందోళన కలిగించే రీతిలో ఆలోచించకండి. ఆ సందర్భం వెళ్తున్న దాన్నిబట్టి అందుకు తగ్గట్లు వ్యవహరించడం నేర్చుకోండి. మీ పై మీరు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించండి. వ్యక్తిగతంగా గడపడానికి సమయాన్ని కేటాయించండి మరియు మీ తరపు మాట్లాడే వ్యక్తి కోసం, మీకు తోడుగా ఉండే వ్యక్తి కోసం, మీ ప్రక్కన నిలబడి మీతో అడుగులో అడుగు వేసే వ్యక్తి కోసం వేచి చూడండి.

  English summary

  How To Deal With Ghosting

  With the advent of technology and the internet, it has become increasingly easy to find that special someone. There are millions today on the lookout for a friend, a relationship or their next fling, on the web. Read on to know how to deal with ghosting.
  Story first published: Thursday, February 8, 2018, 9:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more