For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నమ్మించి గొంతు కోసింది #mystory197

స్వప్నను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లయ్యాక తనను మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. నేను శ్యామ్ ను కూడా చాలా నమ్మాను. కానీ వాడు ఇలా నన్ను మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు.

|

తన పేరు స్వప్న. నా స్వప్న సుందరి తనే. తనది ఒక మారుమూల గ్రామం. ఆమె అందానికి ఎవరైనా దాసోహం అవుతారు. ఆటల్లో పాటల్లో, చదువులో ఆ గ్రామంలో తనే నంబర్ వన్. నేను కాలేజీ చదివే రోజుల్లో స్వప్న నాకు పరిచయం అయ్యింది. తను పరిచయం అయిన మరుక్షణమే నాకు తనపై ప్రేమ పుట్టింది. కానీ తనకు ఆ విషయం చెప్పాలంటే నాకు భయం వేసింది.

నా బెస్ట్ ఫ్రెండ్ శ్యామ్ కు చెప్పాను

నా బెస్ట్ ఫ్రెండ్ శ్యామ్ కు చెప్పాను

నేను ఆ విషయాన్ని ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ శ్యామ్ కు చెప్పాను. అరేయ్... నువ్వుఎందుకు భయపడతావుభయ్ వెంటనే ఆ అమ్మాయికి అసలు విషయ చెప్పు అన్నాడు. సరే అన్నాను. కొన్ని రోజుల తర్వాత తన మనస్సులో నేను ఉన్నానని తెలుసుకున్నాను. తర్వాత స్వప్నకు అసలు విషయం చెప్పాను. తను కూడా నా ప్రేమను అంగీకరించింది.

ఎమ్మెస్సీ ఫైనలియర్ లో ఎంగేజ్ మెంట్

ఎమ్మెస్సీ ఫైనలియర్ లో ఎంగేజ్ మెంట్

మా ఇద్దరి ప్రేమను మా ఇళ్లలో కూడా చెప్పాం. చదువు అయిపోగానే పెళ్లి చేస్తామన్నారు. ఎమ్మెస్సీ ఫైనలియర్ లో మాకు ఎంగేజ్ మెంట్ వైభవంగా జరిగింది. తర్వాత నాకు యూఎస్ వెళ్లే అవకాశం వచ్చింది. మా ఇంట్లో వాళ్లు, స్వప్న ఇంట్లో వాళ్లు నేను యూఎస్ వెళ్లేందుకు అంగీకరించలేదు.

లక్షల్లో వేతనం, భార్యతో చాటింగ్

లక్షల్లో వేతనం, భార్యతో చాటింగ్

నేను ఒక్కణ్నే కొడుకుని. కానీ స్వప్న మాత్రం నువ్వు యూఎస్ వెళ్లు... తర్వాత వచ్చాక పెళ్లి చేసుకుందాం అంది. నేను కూడా తన మాట కాదనలేక సరే అన్నాను. అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకున్నాను. మంచి జాబ్. లక్షల్లో వేతనం.. మరోపక్క రోజూ ఇండియాలో నాకు కాబోయే భార్యతో చాటింగ్ అలా జీవితం హ్యాపీగా కొనసాగేది.

ఏడాది పాటు ఫోన్లలోనే

ఏడాది పాటు ఫోన్లలోనే

ఆ టైమ్ లో మా ఇంట్లో వాళ్లంతా చాలా బెంగ పెట్టుకున్నారు. నా గురించే ఆలోచించారు. నాకు ఏమన్నా అవుతుందేమో అని బాధపడ్డారు. నేను అక్కడికి వెళ్లాక కూడా రోజూ స్వప్నతో చాటింగ్ లో ఉండేవాణ్ని. ఏడాది పాటు మా ప్రేమ ఫోన్లలోనే నడిచింది. ఆ ఏడాది కాలంలో మరింత దగ్గరయ్యాం. త్వరలో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం.

నా జీవితంలోకి తుపాన్ వచ్చింది

నా జీవితంలోకి తుపాన్ వచ్చింది

నాకు ఒక రోజు ఉదయమే ఫోన్ వచ్చింది. అప్పుడు నా జీవితంలోకి తుపాన్ వచ్చింది. అప్పుడు ఇండియాలో రాత్రి సమయం. ఒరేయ్.. స్నప్న వేరే వ్యక్తితో లేచిపోయింది అన్నారు మా ఇంట్లో వాళ్లు. నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పారు. స్వప్న నా ఫ్రెండ్ శ్యామ్ పెళ్లి చేసుకున్నారని తెలిసింది.

శ్యామ్ ను చాలా నమ్మాను

శ్యామ్ ను చాలా నమ్మాను

స్వప్నను నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. పెళ్లయ్యాక తనను మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. నేను శ్యామ్ ను కూడా చాలా నమ్మాను. కానీ వాడు ఇలా నన్ను మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. జీవితం మనం ఊహించినట్లుగా ఎప్పుడూ ఉండదని నాకు అర్థమైంది. తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కానీ తను నన్ను నమ్మించి గొంతు కోసింది.

విధి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది

విధి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది

సరే అంతా మన మంచికే అనుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాను. కొన్ని సందర్భాల్లో విధి ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నాకు ఇప్పుడు బంగారంలాంటి పెళ్లాం వచ్చింది. నిజంగా స్వప్నను చేసుకుని ఉండి ఉంటే అంత ఆనందంగా ఉండేవాణ్ని కాదేమో. కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను.

English summary

i love her but she loves someone else

i love her but she loves someone else
Story first published:Saturday, July 14, 2018, 15:35 [IST]
Desktop Bottom Promotion