For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను నష్టజాతకురాలిని.. నీ జీవితంలోకి రాను అంది.. తనకోసం నేను వెతకని చోటు లేదు - #mystory177

|

తన పేరు శాంతి. నేను ముద్దుగా బేబీ అని పిలుస్తుంటాను. అందరు అమ్మాయిలు అబ్బాయిలకు కాలేజీలో చదువుకునేటప్పుడు పరిచయం అవుతారు. కానీ తాను నా కాలేజీ చదువు మొత్తం పూర్తయిన రోజు పరిచయం అయ్యింది. అవి నేను బీటెక్ చదివే రోజులు.

బీటెక్ ఫైనలియర్ లో మా కాలేజీలో ఫేర్ వెల్ పార్టీ అరెంజ్ చేశారు. ఇక ఈ రోజు పూర్తైతే ఇక కాలేజీకి రావాల్సిన అవసరం లేదు అనుకున్నాను. ఫైనల్ ఎగ్జామ్స్ ఒక్కటీ రాస్తే ఓ పని అయిపోతుంది అనుకున్నాను.

ప్లాట్ అయిపోయాను

ప్లాట్ అయిపోయాను

ఫేర్ వెల్ పార్టీలో నన్ను ఒక అమ్మాయి పలకరించింది. ఆ మధురమైన స్వరం నాలో ఏవేవో భావనలను రేపింది. తను పిలవగానే వెనక్కి చూశాను. తన అందానికి ప్లాట్ అయిపోయాను. ఏమండీ... ఇక్కడ సుమన్ ఎవరు? దీప్తి మేడం పిలుస్తోంది అంది. నేనే అన్నాను. అలా తనతో పరిచయం ఏర్పడింది.

కళ్లు తిప్పుకోలేని రూపం

కళ్లు తిప్పుకోలేని రూపం

తనది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. తను థర్డ్ ఇయర్ స్టూడెంట్. నాది మెకానికల్ బ్రాంచ్. తను పరిచయం అయ్యాక మళ్లీ బీటెక్ ను నాలుగేళ్లు చదువుదామా అనిపించింది. కళ్లు తిప్పుకోలేని రూపం నా కళ్లల్లో కదలాడుతూ ఉండేది.

మాతో పాటు సినిమాకు

మాతో పాటు సినిమాకు

ఇక ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు రోజూ ఏదో వంకతో తనతో మాట్లాడేవాణ్ని. ఆ కొన్ని రోజులు నేను ప్రతి క్షణం తనతో గడిపేందుకు ప్రయత్నించాను. తను చాలా చురుకైనది. నేను తన పక్కను ఉన్నప్పుడు నా కళ్లు తనని చూస్తున్నాయని తను కనిపెట్టేది. ఇక మా ఫైనలియర్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాక మేమంతా సినిమాకు వెళ్లాం. తనకు మా బ్యాచ్ అమ్మాయిలు ఫ్రెండ్స్ కావడం వల్ల తను కూడా మాతో పాటు సినిమాకు వచ్చింది. తను నా పక్కనే కూర్చొంది.

ఇంకెప్పటికీ చెప్పలేనని

ఇంకెప్పటికీ చెప్పలేనని

నాలో ఏదో తెలియని ఒక ఆందోళన మొదలైంది. ఈ రోజు తనతో నా మనస్సులోని మాట చెప్పకుంటే ఇంకెప్పటికీ చెప్పలేనని నాకు అర్థం అయ్యింది. అందుకే ధైర్యం చేసి నా మనస్సులో ఉన్న మాట చెప్పాను. తను వెంటనే నా చెయ్యిపట్టుకుంది. నాలో ఎక్కడలేని ఆనందం కలిగింది.

కాసేపు చాట్

కాసేపు చాట్

తర్వాత తన నంబర్ ఇచ్చింది. సినిమా మధ్యలోనేను మేమిద్దరం కాసేపు చాట్ చేసుకున్నాం. ఇక ఆ రోజు మూవీ పూర్తయ్యాక ఇంటికెళ్లాక తనతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడాను. కొన్ని రోజుల తర్వాత నేను అదే కాలేజీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంటెక్ కాలేజీలో జాయినయ్యాను. తను బీటెక్ ఫైనలియర్ లో ఉండేది. రోజూ తనని నేను బైక్ పై డ్రాప్ చేసేవాణ్ని.

వాళ్ల నాన్న చనిపోయారని

వాళ్ల నాన్న చనిపోయారని

ఒక రోజు వాళ్లనాన్నకు ఆరోగ్యం బాగోలేదని కాస్త ముందుగానే ఆటోలో ఇంటికెళ్లింది. నాకు ఆ విషయం తెలిసి ఇంటికి వెళ్లాను. వాళ్ల నాన్నకు హార్ట్ ఎటాక్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసి నేను అక్కడికి వెళ్లాను. వాళ్ల నాన్న చనిపోయారని తెలిసింది.

చాలా బాధేసింది

చాలా బాధేసింది

దీంతో తను బీటెక్ ఫైనల్ పరీక్షలు కూడా రాయలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లింది. నేను రోజు వెళ్లి మాట్లాడే వాడిని. నాతో ఎప్పుడూ కూడా తన పర్సనల్ విషయాలు చెప్పేది కాదు నా బేబీ. నాకు తన వ్యక్తిగత జీవితం తెలిసి చాలా బాధేసింది. వాళ్లది చాలా పేద కుటుంబం. శాంతి వాళ్ల అమ్మ ఏదో చిన్నచిన్న పనులు చేసేది. అలా వారి కుటుంబం గడిచేది.

ఒంటరిగా వదిలేస్తే

ఒంటరిగా వదిలేస్తే

నాన్న చనిపోవడంతో శాంతి పూర్తిగా దుఃఖంలో మునిగిపోయింది. ఎంత ఓదార్చినా వినలేదు. కొన్ని రోజులు అలా ఒంటిరిగా వదిలేస్తే తన గుండెల్లోని భారం అంతాతగ్గుతుందనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నేను శాంతి వాళ్ల ఇంటికి వెళ్లాను.

చూడగానే గట్టిగా హత్తుకున్నా

చూడగానే గట్టిగా హత్తుకున్నా

ఇల్లు తాళం వేసింది. ఖాళీ చేసి వెళ్లిపోయారని పక్కింటోళ్లు చెప్పారు. ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌. ఫ్రెండ్స్‌ని అడిగితే ఎవరికీ తెలియదు అని చెప్పారు. సోషల్ మీడియాలో తను లేదు. తన ఆచూకీ కోసం నేను దాదాపు రెండేళ్లు శ్రమించాను. చివరకు హైదరాబాద్ లో తను ఈ మధ్యే కలిసింది. తనను చూడగానే గట్టిగా హత్తుకున్నా.

నష్టజాతకురాలిని

నష్టజాతకురాలిని

ఎందుకిలా చేశావ్ శాంతి అని అడిగాను. నేను నష్టజాతకురాలిని. నేను నీ జీవితంలోకి వస్తే నీకు అన్నీ కష్టాలే వస్తాయి అంది. నా వల్ల నీకు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలనే ఇలా చేశాను అంది. నువ్వు నా దేవతవు శాంతి అన్నాను. తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. హ్యాపీగా ఉన్నాం.

English summary

my relationship was perfect but it cost me my identity

my relationship was perfect but it cost me my identity