న్యూ క‌పుల్స్ ఇలా చేస్తే రిలేష‌న్‌షిప్ దెబ్బ తినొచ్చు!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న‌లో చాలా మంది ప్రేమ అవ‌స‌రం లేద‌ని, ప్రేమ‌కు వ్య‌తిరేకుల‌మ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతుంటారు. పైకి అలా అన్నా నిజానికి లోలోప‌ల ఎవ‌రి నుంచైనా ప్రేమ‌ను కోరుకుంటాం. వాస్త‌వేమిటంటే మ‌న‌మంతా ప్రేమ‌, ఆప్యాయ‌త‌, అనురాగాల‌కు దూరంగా ఉండి ఉంటే నిజ‌మైన ప్రేమ‌ను ఎవ‌రైనా చూపిస్తూ ఉంటే దానికి స‌రిగ్గా స్పందించ‌క‌పోవ‌చ్చు.

మ‌న‌లో చాలా మంది రిలేష‌న్‌షిప్‌లోకి ఎంట‌ర్ అవ్వ‌గానే నిజ‌మైన ప్రేమ అంటే ఎమిటో తెలియ‌కుండా గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటాం. కొత్త బంధంలోకి అడుగుపెట్టిన‌ప్పుడు చాలా సంద‌ర్భాల్లో పొర‌పాట్లు చేసే అవ‌కాశం ఉంటుంది. తెలియ‌నిత‌న‌మో, గంద‌ర‌గోళ‌మో మొత్తానికి పొర‌పాట్లు దొర్లుతూనే ఉంటాయి.

కొత్త‌గా రిలేష‌న్‌షిప్ మొద‌లుపెట్టాక ఎలాంటి పొర‌పాట్లకు ఆస్కారం ఉంటుందో అవి జ‌ర‌గ‌కుండా ఎలా చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం..

ఎల్ల‌ప్పుడూ వారివెంటే...

ఎల్ల‌ప్పుడూ వారివెంటే...

ఒక కొత్త రిలేష‌న్‌షిప్‌లోకి అడుగుపెట్ట‌గానే మ‌న భాగ‌స్వామిని ఎల్ల‌ప్పుడూ వెన్నంటే ఉండాల‌ని కోరుకుంటాం. వాళ్ల‌తో కాల్స్‌ప‌రంగా, మెసేజీల‌ప‌రంగా రోజులో 24 గంట‌లు గ‌డ‌పాలనుకుంటాం. రెండు రోజుల‌కోసారైనా వాళ్ల‌ని క‌ల‌వాల‌నుకుంటాం. ప్ర‌తి రాత్రి గంట‌సేపు వారితో మాట్లాడ‌నిదే నిద్ర ప‌ట్ట‌దు. ఒక‌వేళ ఏదైనా రాత్రి ఫోన్ రాక‌పోతే ఇక మిమ్మ‌ల్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నే భావ‌న‌లో ప‌డిపోతారు. కొత్త‌లో మాట్లాడుకునేందుకు ఎన్నో విష‌యాలు ఉంటాయి. ప్ర‌తి రోజు ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోవ‌డం వ‌ల్ల ఎన్నో కొత్త సంగ‌తులు తెలుస్తుంటాయి. వాళ్ల‌ని ప్ర‌తి సారీ అంటిపెట్టుకొని ఉండాల‌ని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ల‌ని వ‌దిలి ఒక్క క్ష‌ణం ఉండాల‌ని అనిపించ‌దు.

స్నేహితుల‌తో కాస్త స‌మ‌యం..

స్నేహితుల‌తో కాస్త స‌మ‌యం..

మీ స్నేహితుల‌తో, కుటుంబ‌స‌భ్యుల‌తో స‌మ‌యం గ‌డ‌పాడాన్ని త‌గ్గించుకుంటారు. ఇది అన్నింటికంటే అత్యంత పెద్ద పొర‌పాటు. వాళ్ల‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డ‌కుండా ఉంటే మీకంటూ జీవితంలో స‌మ‌యం కేటాయించుకోవ‌డం లేద‌ని అర్థం. మీ భాగ‌స్వామి కోసం కాస్త స‌మ‌యాన్ని కేటాయించుకోవ‌చ్చు. ఐతే అదే స‌మ‌యంలో మీ స్నేహితుల‌తోనూ కొంచెం స‌మ‌యం గ‌డ‌పాలి.

మౌనం వీడండి...

మౌనం వీడండి...

అనుబంధంలో కొన‌సాగుతున్న‌వారికి ఏదో ఒక రోజు త‌మ భాగ‌స్వామి గురించి మీకు ఇష్టం లేని విష‌యం తెలియ‌వ‌చ్చు. అది విని ఊరికే ఉండ‌టం పొర‌పాటే అవుతుంది. దీనికన్నా దాని గురించి చ‌ర్చించ‌డం మంచిది. మౌనంగా ఉంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు. అందుకే ఇద్ద‌రూ చ‌ర్చించుకుంటే స‌మ‌స్య‌ల‌కు పరిష్కార‌మార్గం దొరుకుతుంది.

వ్య‌క్తిత్వంలో మార్పులు వ‌ద్దు...

వ్య‌క్తిత్వంలో మార్పులు వ‌ద్దు...

కొత్త‌గా రిలేష‌న్‌షిప్‌ను మొద‌లుపెట్టిన వారు త‌మ భాగ‌స్వామిలో కొన్ని మార్పులు కోరుకుంటారు. అది శారీర‌కంగా కావ‌చ్చు లేదా వ్య‌క్తిత్వ ప‌రంగా కావ‌చ్చు. కొంత వ‌ర‌కు ఇది బాగానే ఉన్నా.. వాళ్ల అస‌లైన స్వ‌రూపాన్ని మాత్రం మార్చే ప్ర‌య‌త్నం చేయ‌వద్దు. మీ భాగ‌స్వామికి గట్టిగా న‌వ్వే అల‌వాటు ఉంద‌నుకోండి, మీరూ వారితో క‌లిసి న‌వ్వులో మ‌మేక‌మ‌వ్వండి. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ఉండ‌నివ్వండి. ఒక వేళ మీరు ష‌రుతులు పెడితే మిమ్మ‌ల్ని మెప్పించేందుకు వాళ్లు న‌టించాల్సి రావచ్చు. అది మీ సంబంధానికి ఏమంత మంచిది కాదు.

English summary

Quit making these mistake in a new relationship

Here is a list of mistakes that we make in a new relationship and it is about we stop making such mistakes. Take a look!
Story first published: Thursday, February 1, 2018, 9:00 [IST]
Subscribe Newsletter