For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానవ సంబంధాల కధలు: ఫోటోలోని వ్యక్తులు ఎందుకు నవ్వుతూ వుంటారు?

|

ఆమె ఎల్లప్పుడూ నన్ను, ఫోటోలు తీసేటప్పుడు ప్రతి ఒక్కరూ చిరునవ్వులు ఎందుకు చిందిస్తారని అడుగుతూ ఉంటుంది. నేనందుకు సమాధానంగా, జీవితాంతం మధుర స్మృతులుగా నిలిచిపోయే ఫోటోలను తిరిగి చూసుకున్న ప్రతిసారి, పెదవులపై ఒక చిరునవ్వు ఉదయించడానికి ఇది ఒక కారణమవ్వాలని అని చెప్పాను. మన పెదవుల చివర్ల మధ్యన ఉండే దూరం, మన సంతోషకరమైన క్షణాలకు కొలమానంగా చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భాలను పదిలపరచుకునే విలువైన అవకాశం మనకు ఫోటోలు మాత్రమే ఇస్తాయి. మనము ప్రేమలోని దూరాన్ని కొలుస్తున్నప్పుడు, చందమామంత దూరం అని చెప్తాము, కానీ నేను ఎప్పుడు నీ ఫోటోలను చూసినా, నవ్వే నీ పెదవుల మధ్య దూరాన్ని చూస్తూ, ఆ చిరునవ్వులకు కారణమైన తీపి జ్ఞాపకాలను తడుముతూ, నా మనసు గతంలోకి జారిపోతుంది.

ఈ రోజుకీ నేను, ఆమె నవ్వుతూ, తుళ్ళుతూ ఉన్నప్పుడు, ఆమె ముఖంలో కనిపించే భావాలను, చాలా ఇష్టంగా గుర్తు చేసుకుంటాను. మా ప్రేమ మార్గంలో, నవ్వుల బాటలు పరచిన ఆమెకు, నా ప్రేమను మాటల ద్వారా తెలియజేసినప్పుడు కూడా తనలో ఆనందాన్ని తన దరహాసంతోనే చేసింది. ఆమెను ఆకట్టుకోవడానికి, నేను ప్రేమను వ్యక్తం చేసే, వివిధ పదజాలాలు మరియు ఆలోచనలు మరియు మార్గాలు, అన్వేషిస్తూ గడిపాను. నేటివరకు, నా ప్రేమను వ్యక్తపరచడానికి మాటలను మార్గంగా నేను ఎన్నుకుని, ఆ ఊసులన్నీ కేవలం ఆమెతోనే కలబోసుకున్నాను. ఈ నిమిషం దాకా నా ఊహలు, ఊసులు అన్నీ ఆమె చుట్టూనే పరిభ్రమించాయి. నా సంతోష ప్రేమ రాగాలను, ఊపిరి పాటగా మార్చిన ఆమెకు ఎప్పటికీ నేను ఆరాధకునిగా ఉంటాను.

Relationship Stories; Why People Smile While Being Photographed?

మా ప్రేమను కేవలం మా మధ్య సంబంధంతోనే ఆవిష్కరించలేము. ఇది ఎవరి ఊహకు అందనంత ఎత్తులో ఉంది. మేము ఒకరికొకరు కలిగి ఉండాలని తాపత్రయ పడలేదు. మా తాపాత్రయమంతా, మా సంతోషం కోసమే! మా ప్రేమలిని పవిత్రత కోసమే!

మా మధ్య ఓరచూపులను పంచుకున్నాం. నిశ్శబ్ద కాంక్షలతో కూడిన చూపులు! పరిపూర్ణతతో కూడిన చూపులు! మేము ఎప్పుడూ కలిసి అనుకోకపోయినప్పటికీ, కలిసే ఉండేవాళ్ళం. మా మధ్య మాటల్లేకపోయినప్పటికి, అవగాహన ఉండేది. మేము నిశ్శబ్ద ప్రేమికుల గుంపులో ఒకరం. ఒకరితో ఒకరు అరుదుగా మాట్లాడుకున్నా కానీ, మా మధ్య దూరం ఎంతున్నా కానీ, మా మధ్య ప్రేమ ప్రవహించేది. మా మధ్య శృంగార సంబంధం లేకపోయినప్పటికీ, చూపులను పంచుకోవడానికి చూసే ఎదురుచూపులే, శృంగారికి మించిన భావప్రాప్తినిచ్చేవి. మేము ఎప్పుడూ ఒకరినొకరు తాకలేదు, ముద్దుపెట్టుకోలేదు, కలిసి పడుకోలేదు, శృంగారం జరపలేదు.

మా మధ్య ఉన్నదల్లా, ఒక భావన, ఒక భక్తి, ఒక కోరిక, ఒక భావోద్వేగం, ఆనందపు జల్లు, చూపుల కలయిక మాత్రమే! ఇది నాలో పరిపూర్ణత నింపేది. ఏ విధమైన భారం లేని ప్రేమలో ఉన్నా! ప్రేమంటే ఏమిటో తెలియని నాకు, ప్రేమభావనకున్న లోతు మాత్రం సముద్రమంత అని తెలిసొచ్చింది.

మా ప్రేమకు ఎటువంటి సంకేతాలు లేవు, సరిహద్దులు లేవు. స్పర్శ కోసం మా ప్రేమ అర్రులు చాచలేదు. మా ప్రేమలో ఎటువంటి దురుద్దేశాలు లేవు. మా ప్రేమ సున్నితమైనది. ఇతర మాదిరిగా కాక, మా ప్రేమలో పరిణితి ఉంది.

నేను ఉన్న స్థితిలో, నేను చేయగలిగేదల్లా, ఆమెతోనే ఎప్పుడూ ఉండటమే! ఎప్పుడూ ఆమె ఓరచూపులు విసిరిన క్షణాలను మననం చేసుకోవడం తప్ప, వేరే పనంటూ లేదు నా మనసుకు. నా ఏకైక లక్ష్యం, పగలు-రాత్రి ఆమెను చూస్తూ ఉండటమే. అలా అయితేనే, నా మనసుకు స్వాంతన, శక్తి, ప్రేమ చేకూరుతాయి. కానీ ఆమె స్పర్శను ఇప్పటికీ నేను అనుభూతి చెందలేదు. దానికై నేను అప్పుడు వెంపర్లాడనప్పటికి, ఇప్పుడు మాత్రం అమృతం వలే, తన ప్రేమ నాపై కురిపించాలని నేను కోరుకుంటున్నాను. "ఫోటోలు తీయించుకునేటప్పుడు ఎందుకు అందరూ చిరునవ్వును అలంకరించుకుంటారు?" అని అడుగుతున్న ఆమె, నాకు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా, నవ్వుతూ ఉన్న ఆమె ఫోటోలే, నా ఆనందానికి ఊతగా మారాయి.

ఇది వెలుగు చూడటానికి వేచి ఉన్న, నా ప్రేమ అంతరంగ తరంగం. దీనిని మాకు పంపిన వ్యక్తి తన ఉనికిని అజ్ఞాతంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా, మీరు మాతో మీ కథను పంచుకోవాలనుకుంటున్నట్లైతే, మాకు వ్రాయండి.

మీ సంబంధంలో, పరిష్కారం దొరికని ప్రశ్నలను ఏమైనా ఉంటే, మాకు వ్రాయండి. మీరు boldsky@oneindia.co.in కు మీ ప్రశ్నలు పంపండి.

English summary

Relationship Stories; Why People Smile While Being Photographed?

She always asked about the logical reason as to why people smile while being photographed and I used to tell her that those photographs are memories and every time they go back to see them, they have a reason to smile. The corners of your smile are the length of your happy moments and photos contain those precious bits.
Story first published: Monday, August 27, 2018, 19:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more