గతంలో జరిగిన ఈ విషయాల గురించి మీ భాగస్వామి కి ఎప్పటికి తెలియకూడదు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

నిజాయితీగా ఉండటమే ఉత్తమమైన మార్గమని అందరూ చెబుతారు. కానీ, అందువల్ల కలిగే పరిణామాల గురించి ఎవ్వరు మాట్లాడారు. మనం అందరం నిజాయితీగానే ఉండాలని అనుకుంటాం. మనం ప్రేమించే వ్యక్తులతో న్యాయంగానే మెలగాలని భావిస్తాం. కానీ మనం న్యాయంగా ఉంటున్న సమయంలో ఎదుటి వ్యక్తికి గనుక నష్టం కలుగుతూ ఉన్న లేదా బాధ కలుగుతూ ఉంటే అది సరైన పద్దతి కాదు. అలానే సంబంధబాంధవ్యాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండటం అతి ముఖ్యమే కాదు అవసరం కూడా. కానీ, మనకు ఎప్పుడైతే ఆలా ఉన్నప్పుడు జరిగే పరిణామాల గురించి ముందే తెలుస్తుందో, అప్పుడు కూడా నిజాయితీగా ఉండాలా అనేదే అసలు ప్రశ్న. అలా ఉండటం ముఖ్యమా కాదా అనే విషయం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

Things that your partner must never know about your past relationships

మనస్సుకు నచ్చిన వ్యక్తి మనకు తారసపడినప్పుడు, ఇక కొత్త జీవితం తనతో మొదలై జీవితాంతం తనతోనే ఉండాలని భావించినప్పుడు, వారితో ఎవ్వరైనా ఏదైనా పంచుకోవాలని భావిస్తారు. రహస్యాలన్నింటిని చెప్పేద్దాం అని అనుకుంటారు. కానీ, గతంలో జరిగిన రహస్యాల గురించి కూడా చెప్పేద్దాం అని కొంతమంది అనుకుంటారు. కానీ, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి చెప్పకూడదు అనే విషయాన్ని చాలా కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. మనం అందరం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజాయితీగా ఉండటం, నిజాలే చెప్పడం మంచి పద్దతే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మీరు సంబంధ బాంధవ్యాలలో ఉన్న వ్యక్తులతో నిజాయితీగా కొన్ని విషయాల్లో ఉండనవసరం లేదు. ఇలాంటి విషయాల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చేవి ఏమిటంటే, మీరు ప్రేమించే వ్యక్తి మీ గత ప్రేమికులు గురించి తెలుసుకోవాలని భావిస్తారు.

Things that your partner must never know about your past relationships

మీ భాగస్వామి కొన్ని విషయాలను, ముఖ్యంగా మీ గత సంబంధ బాంధవ్యాల గురించి ఎప్పటికి తెలుసుకోకూడదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీకు ఆ ప్రశ్న ఎదురైనప్పుడు, మీరు గనుక అబద్దం చెప్పకూడదు అని భావించినట్లతే, ఆ ప్రశ్నను దాటివేయండి కానీ అందుకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని బయటపెట్టకండి.

మీరు మీ ప్రేమికుడితో ఎప్పటికి చెప్పకూడని విషయాలేంటో చూద్దాం.

Things that your partner must never know about your past relationships

మీరు ఎంతమంది అబ్బాయిలతో ప్రేమలో ఉన్నారు :

ఈ ఒక్క ప్రశ్న మీ పై చెడు అభిప్రాయాన్ని కలిగించవచ్చు లేదా మిమ్మల్ని కృంగదీసే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న మీ సంబంధ బాంధవ్యాల పై ప్రతికూల ప్రభావాలు కూడా చూపవచ్చు. మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎప్పుడైతే ఒక అబ్బాయి ఇలాంటి ప్రశ్న అడుగుతాడో అప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అతడి యొక్క ఉద్దేశ్యాన్ని మీరు ముందే పసిగట్టాలి. నిజమైన వ్యక్తి ఎప్పుడు కానీ, మీ గతం గురించి తెలుసుకోవాలని అనుకోరు. మీ వర్తమానం మరియు భవిష్యత్తు పై మాత్రమే దృష్టి పెడతారు. ఇలాంటి ప్రశ్నలు మీకు ఎదురైనప్పుడు వీటిని అంత సులభంగా తీసుకోకండి. ఇటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మీరు నిజాయితీగా అస్సలు వ్యవహరించనవసరం లేదు.

Things that your partner must never know about your past relationships

మీరు ఇప్పటికీ మీ గత ప్రేమికులను కోల్పోయినట్లు భావిస్తున్నారా ?

మీరు కోల్పోతున్నారు అని చెప్పడంలో పెద్ద నష్టం ఏమి లేదు కానీ, వారిని మళ్ళీ తమ జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకోవడంలేదు అని చెప్పడం మాత్రం మర్చిపోకండి. కొన్ని లక్షల సార్లు మీ గత ప్రేమికుడిని కోల్పోయాను అని మీకు అనిపించవచ్చు. ఎవరైనా వ్యక్తిని మనం కోల్పోయినంత మాత్రాన వారిని ఖచ్చితంగా మళ్ళీ మన జీవితంలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వారితో మీరు కొన్ని అద్భుతమైన క్షణాలు గడిపి ఉండవచ్చు. మీరు ఆ సమయాన్ని ఆ క్షణాన్ని కోల్పోయి ఉండవచ్చు కానీ, అటువంటి వ్యక్తిని పూర్తిగా కోల్పోయినట్లు మీరు భావించనవసరం లేదు. కాబట్టి మీ ప్రేమికుడుకి తనని కాకుండా మీరు ఎవరినో కోల్పోయారు అనే విషయం అతనికి తెలియాల్సిన అవసరం లేదు.

Things that your partner must never know about your past relationships

మీ గత ప్రేమికులు ఎవరైనా మీ పై చేతులు వేశారా :

మీ ప్రస్తుత ప్రేమికుడికి, మీ గతంలో జరిగిన ఏ ఒక్క విషయం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మీ గత ప్రేమికుడు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టి ఉంటే ఆ విషయం మీ ప్రస్తుత ప్రేమికుడికి గనుక తెలిస్తే మీ గత ప్రేమికుడిని మీ ప్రస్తుత ప్రేమికుడు ద్వేషించడం మొదలుపెడతాడు. అటువంటి ద్వేషాలు అవసరం లేదు గనుక మీరు నిజాలు చెప్పనవసరం లేదు. మీరు గతాన్ని వదిలివేయాలి అని అనుకుంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే, అందుకు సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞాపకాలను కూడా వదిలివేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Things that your partner must never know about your past relationships

మీ గత ప్రేమికుడితో కలిసి మీరు వేసిన వ్యూహాలు :

మీ గత ప్రేమికుడితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు లేదా వ్యూహాలు రచించి ఉండవచ్చు. కానీ, అవన్నీ మీ ప్రస్తుత ప్రేమికుడికి తెలియాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు కొత్త భవిష్యత్తు ప్రణాళికలు వేయండి. " నేను మీతో కూడా అలానే చేద్దాం అని అనుకుంటున్నాను " అని ఎప్పుడు చెప్పకండి. ఇలా చెప్పడం ద్వారా మనస్పర్థలు ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి.

English summary

Things that your partner must never know about your past relationships

When we finally find someone worthy, someone with whom we can share everything with, we decide to share all our secrets and some of the secrets often contain memoirs from our past that should never be shared with anyone at any cost. We all need to understand that being honest, being truthful is alright but then there are times when you don’t have to be honest like when you are in a new relationship and there are things that your lover wishes to know about your past lovers.
Story first published: Saturday, January 27, 2018, 17:00 [IST]