For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RRR డైరెక్టర్ రాజమౌళి రియల్ లైఫ్ లవ్ స్టోరీ తెలిస్తే కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు.. ఎందుకంటే...

|

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఏ సినిమా అయినా తీయబోెతున్నాడంటే... ఆ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయనకు అండగా ఉండేది కేవలం ఆయన కుటుంబమే. అందులోనూ తన భార్య రమా రాజమౌళి ఆయనకు ప్రధాన వెన్నెమకలా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎందుకంటే మన జక్కన్న తీసే సినిమాలలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె చాలా కీలక పాత్ర పోషిస్తారు. పోషిస్తూ ఉన్నారు కూడా. అయితే సినిమాలకు ముందు రాజమౌళి వ్యక్తిగత జీవితంలోకి రమా ఎలా ప్రవేశించిందో అనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. చాలా మందికి వీరి వ్యక్తిగత విషయాలు.. ముఖ్యంగా వీరి ప్రేమ గురించి తెలీదు. మరో ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక ఎలా అయితే ఒకేరోజు పుట్టారో... అలాగే ఈ ఇద్దరు ఆలుమగలు ఒకే సంవత్సరం ఒకే తేదీన (అక్టోబర్ 10, 1973)న జన్మించడం విశేషం. కాకపోతే అందులో లవ్ స్టోరీ వేరు.. వీరి లవ్ స్టోరీ పూర్తిగా వేరు.. ఈ సందర్భంగా వారి ప్రేమ ఎప్పుడు మొదలైంది... ఎలా మొదలైందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం...

రంగమ్మత్త ప్రేమ పెళ్లి జరిగి పదేళ్లు పూర్తయ్యిందట... అయినా ఏ మాత్రం జోరు తగ్గని అనసూయ...

ఆదర్శ దంపతులు

ఆదర్శ దంపతులు

రాజమౌళి, రమ దంపతులను ఆదర్శ దంపతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళితో రమకి వివాహం కాకముందే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారట. అప్పటికే తనకు కార్తీకేయ జన్మించాడు.అయితే రమ తన కుమారుడితో కలిసి ఒంటరిగా జీవించడం ప్రారంభించింది.

అలా పరిచయమైంది..

అలా పరిచయమైంది..

అలా ఒకరోజు దర్శక ధీరుడు రాజమౌళికి రమతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత అంతే వేగంగా వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందట. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

అచ్చం సినిమాల్లో ట్విస్ట్ లా..

అచ్చం సినిమాల్లో ట్విస్ట్ లా..

అయితే వీరి ప్రేమ కథలోనూ సినిమాల్లో లాగానే ఓ ట్విస్ట్ ఉంది. రమ సొంత చెల్లెలు కీరవాణి భార్య వల్లి కావడం విశేషం. రాజమౌళి కుటుంబంతో ఉన్న బంధుత్వం ఉన్న కారణాంగానే ఆమెకు తనతో తొలిసారిగా స్నేహం ఏర్పడిందట. వీరి వివాహం కూడా ఎంతో నిరాడంబరంగా జరిగింది. అది కూడా ఎంఎం కీరవాణి చేతుల మీదుగా ఆయన ఇంట్లోనే జరిగిందట.

పిల్లలు వద్దనుకున్నారు..

పిల్లలు వద్దనుకున్నారు..

వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా ఎంతో మందికి ఆదర్శంగా అనిపించేలా ఉండటం విశేషం. అప్పటికే రమకు సంతానం ఉంది కాబట్టి.. వీరి పిల్లలు వద్దనుకున్నారట. అయితే ఓ పాపను మాత్రం దత్తత తీసుకున్నారు. ఆమెనే నేటి ఎస్.ఎస్.మయూఖ.

ఆదర్శ కుటుంబం...

ఆదర్శ కుటుంబం...

వీరి ప్రేమ వివాహానికి ఎలాంటి అభ్యంతరం చెప్పని వీరి కుటుంబాన్ని కూడా అందరూ అభినందించి తీరాలి. ఎందుకంటే వారు తీసుకున్న ఓ మంచి నిర్ణయమే వారి విజయానికి దారి తీసింది. ఇప్పటికీ మన జక్కన్న మీ విజయ రహస్యం ఏంటి అని ఎవరైనా ఏ ఇంటర్వ్యూలో అడిగినా.. తన కుటుంబమే తన విజయానికి కారణమని చెబుతుంటారు.

ఈ ఏడు రాశుల వారు ప్రేమలో చాలా అదృష్టవంతులవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి..

రమా రాజమౌళి..

రమా రాజమౌళి..

ఇవే ప్రశ్నలను రమా రాజమౌళిని పలు ఇంటర్వ్యూలలో అడగగా, ఆమె కూడా ఇంచుమించు అలాంటి సమాధానమే ఇచ్చింది. ‘‘మేమంతా ఒక కుటుంబం. మేమంతా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉంటాం‘‘ అని చెప్పారు.

ఏనాడు చెప్పలేదు..

ఏనాడు చెప్పలేదు..

ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన దర్శక ధీరుడు జక్కన్న వ్యక్తిగతంగా తన జీవితంలో రమను ఆహ్వానించడం... ఆమెతోనే జీవిత బంధాన్ని పంచుకోవడం.. ఆమెతో వివాహ బంధం సాగిస్తున్న తీరు నిజంగానే ఎందరికో ఆదర్శమనే చెప్పాలి. అయితే వీరిద్దరూ తమ జీవితం అందరికీ ఆదర్శం మాత్రం ఏనాడు చెప్పలేదు. కనీసం అలాంటి మాటలను భవిష్యత్తులో కూడా కచ్చితంగా చెప్పరు.

గొప్ప ప్రేమ కథ...

గొప్ప ప్రేమ కథ...

రమ, రాజమౌళి ప్రేమ కథ తెలుసుకున్న తర్వాత... వీరిది కచ్చితంగా ఒక గొప్ప ప్రేమ కథ అని మీరు కూడా భావిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఆదర్శ ప్రేమ జంటకు హ్యాట్సాఫ్ అనాల్సిందే...

English summary

Epic love story of Bahubali director Rajamouli and Rama

Here we talking about Epic love story of bahubali director rajamouli and rama in telugu. Read on