For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నన్ను అందరూ వదిలేస్తున్నారు... నాలో ఏదైనా లోపమా...’

|

ఈ లోకంలో అత్యంత బలమైనది.. కులం, మతం, ప్రాంతం వంటి పట్టింపు లేనిది.. అద్భుతమైన ఫ్రెండిషిప్. మనలో ఎవరికైనా సడెన్ గా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.. మనం మన రిలేటివ్స్ వద్దకు వెళ్లడం కంటే.. ఫ్రెండ్స్ దగ్గరికే వెళితే కచ్చితంగా సాయం దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు.

ఒకవేళ సాయం దొరక్కపోయినా.. భరోసా అయినా గ్యారంటీగా దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే స్నేహం కన్నా మించినది ఈ లోకంలో ఏదీ లేదని అన్నాడో గొప్ప కవి. అందుకే కష్టమైనా.. నష్టమైనా.. బాధైనా.. సంతోషమైనా.. ఎప్పుడూ మన వెంటనే నీడలా వెన్నంటే ఉండి.. మనల్ని ప్రోత్సహించే వారే స్నేహితులు.

అలాంటి స్నేహితులు తన జీవితంలో ఒక్కరు కూడా లేరని.. తనను అర్థం చేసుకోలేక.. తనతో ఉండే స్నేహితులు కొద్ది క్షణాల్లోనే దూరమవుతున్నారని, చివరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తనను వదిలేసినట్టు ఓ వ్యక్తి తన సమస్య గురించి ఇలా చెప్పుకున్నాడు... ఇంతకీ తనలో ఉన్న లోపాలేమిటి? ఎందుకని తన నుండి అందరూ దూరంగా వెళ్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అమ్మాయిలు ఇలా మెసెజ్ చేస్తే... మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే...!అమ్మాయిలు ఇలా మెసెజ్ చేస్తే... మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే...!

రిలేషన్ దూరం..

రిలేషన్ దూరం..

హాయ్ ‘నా పేరు సోము. నా వయసు 25 సంవత్సరాలు. నా జీవితంలో ఇప్పటివరకు ఒక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా లేడు. నాతో ఫ్రెండ్ షిప్ చేసే వారంతా ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. నాతో అందరిలా కలిసి ఉండలేకపోతున్నారు.

రీసెంట్ గా బెస్ట్ ఫ్రెండ్..

రీసెంట్ గా బెస్ట్ ఫ్రెండ్..

నా నుండి ఎంతమంది ఫ్రెండ్స్ దూరమైనా.. నాకు ఎలాంటి బాధ అనిపించలేదు. కానీ రిసెంట్ గా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయాడు. నేను నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని ఎంత ప్రాధేయపడ్డా నా మాట అస్సలు లెక్క చేయకుండా వెళ్లిపోయాడు.

నేను సెల్ఫిష్..

నేను సెల్ఫిష్..

నేను చాలా విషయాల్లో స్వార్థపూరితంగా ఉంటానని తను అనుకుంటూ ఉండేవాడు. అయితే తను అలా ఎందుకు అనుకునే వాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నా ఫీలింగ్స్ చెప్పుకోడానికి నాతో ఎవ్వరూ లేరు.

నాలో లోపమా..

నాలో లోపమా..

నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను వదిలి సడెన్ గా దూరంగా వెళ్లిపోవడంతో.. నేను చాలా ఫీలవుతున్నాను. నా లైఫ్ లో ఏదో కోల్పోయినట్టు.. నాకు చాలా వెలితిగా అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి.. నాలో ఏదైనా లోపముందా? దాని గురించి నేనెలా తెలుసుకోవాలి' అని ఓ యువకుడు తన బాధలను చెప్పుకొచ్చాడు. దీనికి నిపుణులు ఏమి సమాధానం చెప్పారో చూద్దాం.

‘ఆ కార్యం' గురించి మగాళ్లకు వచ్చే కామన్ డౌట్స్ ఇవే...! ముఖ్యంగా దాని సైజు గురించే...!‘ఆ కార్యం' గురించి మగాళ్లకు వచ్చే కామన్ డౌట్స్ ఇవే...! ముఖ్యంగా దాని సైజు గురించే...!

పరిస్థితులకు తగ్గట్టు..

పరిస్థితులకు తగ్గట్టు..

ఈ లోకం ఏ బంధమైనా.. సంబంధమైనా.. కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. అలాంటి సమయంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించాలి. అలాంటివి చేయకపోతే మీకు చాలా మంది దూరమవుతారు.

ఫ్రెండ్స్ లేకుంటే..

ఫ్రెండ్స్ లేకుంటే..

మీ ఫ్రెండ్స్ లేకుంటే మీరు ఒంటరిగా ఉన్నట్టు ఫీలవుతున్నట్టు భావిస్తున్నారు. కాబట్టి అలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుడా మీ కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

టైం వేస్ట్ చేయొద్దు..

టైం వేస్ట్ చేయొద్దు..

మీ గురించి పట్టించుకోని వాళ్ల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి సమయంలో మీ దగ్గర ఉన్న స్కిల్స్ తో కొత్త వారితో స్నేహం చేయండి. కొత్త పనుల్లో నిమ్మగమవ్వండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వారు దొరకొచ్చు.

కొత్త కోర్సులు..

కొత్త కోర్సులు..

ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మీరు ఇంట్లో ఒంటరిగా గడపొద్దు. బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. మీకు నచ్చిన కొత్త పనుల్లో లేదా కోర్సుల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు మరికొంత మంది కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుని, వారితో స్నేహం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఇతరులతో రిలేషన్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వీటన్నింటికీ మీకు ఓపిక చాలా ఎక్కువగా ఉండాలని విషయాన్ని మరచిపోవద్దు.

English summary

I don't have a single best friend is something wrong with me?

Here we are talking about the i don't have a single best friend is something wrong with me? Read on
Story first published: Thursday, April 1, 2021, 14:14 [IST]