For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ప్రేమికులిద్దరూ పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు... కానీ అంతలోనే...

|

ప్రేమ విషయంలో మనం నిత్యం లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, సలీమ్ అనార్కలి, రోమియో జూలియట్ వంటి పేర్లను ఎక్కువగా వింటూ ఉంటాం. మన నిజ జీవితంలో మరియు చాలా సినిమాల్లో ప్రేమ కథలను ఇప్పటికే చూసే ఉంటాం. అయితే మీకు తెలుగులో వచ్చిన 'కిక్', 'సత్యభామ' వంటి సినిమాలు మీకు గుర్తున్నాయా?

అందులో తమ ప్రేమ గురించి తెలిపేందుకు హీరో, హీరోయిన్లు తెగ కష్టపడుతుంటారు. కిక్ సినిమాలో రవితేజ గతాన్ని మర్చిపోతే ఇలియానా తన ప్రేమను గుర్తు చేసేందుకు నానా తంటాలు పడుతుంది. అయితే సత్యభామ సినిమాలో ఈ సీన్ కాస్త రివర్స్ అవుతుంది. ఇందులో ప్రియురాలు అయిన భూమిక తన గతాన్ని మరచిపోతే హీరో శివాజీ తన ప్రేమను గుర్తు చేసేందుకూ ఎన్నో కష్టాలు పడతాడు. అయితే జపాన్ దేశంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగిందట.

తన ప్రేయసి ఓ ప్రమాదంలో గతం మర్చిపోయి తనని గుర్తు పట్టకపోయినా... ఆ ప్రేమికుడు మాత్రం వెనకడుగు అనేదే వేయకుండా ఆ అమ్మాయినే ప్రేమించాడట. తనలో తిరిగి ప్రేమను పుట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడట. అతను చేసిన ప్రయత్నాలను చూస్తే ప్రేమపై ఎందరికో ఉన్న నమ్మకాన్ని నిలబెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు...

పెళ్లి గురించి ఎన్నో కలలు..

పెళ్లి గురించి ఎన్నో కలలు..

జపాన్ కు చెందిన లీ హువాయూ, మారుయామా రెండున్నర సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి ప్రేమ గురించి వారి కుటుంబసభ్యులందరికీ కూడా బాగా తెలుసు. వారి ఇంట్లో తల్లిదండ్రులు వీరి ప్రేమకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో వారు పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు.

జీవితంలో స్థిరపడి...

జీవితంలో స్థిరపడి...

24 ఏళ్ల వయస్సులో ఉన్న వీరిద్దరూ జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో తమ పెళ్లి జరుగుతుందని సంతోషంగా ఉన్నారు.

తన ప్రేయసికి ప్రమాదం..

తన ప్రేయసికి ప్రమాదం..

వారిద్దరి ప్రేమను చూసి కాలం తట్టుకోలేకపోయింది. అందుకే వారి ప్రేమ కన్నెర్ర జేసింది. లీ ప్రేయసిని ప్రమాదానికి గురి చేసింది. కారు రూపంలో మారుయామాను ఢీకొట్టి తీవ్ర గాయాల పాలు చేసింది. అలా ఆమె ఆసుప్రతిలోకి చేరి కోమాలోకి వెళ్లిపోయింది.

ఆ తర్వాత గతాన్ని మర్చిపోయి..

ఆ తర్వాత గతాన్ని మర్చిపోయి..

అయితే ఆమె అదృష్టవశాత్తు కోమా నుండి బయటకు వచ్చింది. అయితే గతం అంతా మర్చిపోయింది. అప్పటివరకు తాను ఎవరో కూడా ఆమెకు గుర్తు లేదు. అది ఎంతలా అంటే అద్దంలో తనను తాను చూసి కూడా గుర్తుపట్టలేనంతగా మరచిపోయింది. ఇక వారి కుటుంబ సభ్యులను, తన ప్రేమికుడిని కూడా ఆమె గుర్తు పట్టలేదు.

ప్రేమికుడి ప్రయత్నం..

ప్రేమికుడి ప్రయత్నం..

తన ప్రియురాలు గతం మరచిపోయిన లీ ఏ మాత్రం అధైర్యపడలేదు. ఆమె తన ప్రేమను మరచిపోయిందేమో.. కానీ నేను తన ప్రేమను మరచిపోలేదు కదా అని అనుకుంటూ ముందడుగు వేశాడు. గతంలో తన ప్రేయసితో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటూ, ఆమెకు కూడా తన ప్రేమ గుర్తు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.

డాక్టర్ల హెచ్చరిక..

డాక్టర్ల హెచ్చరిక..

ఆమెను ప్రేమ పేరుతో ఎక్కువగా ఇబ్బంది పెడితే తన ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించారు. దీంతో లీ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. అయితే లీ ఆఖరిగా మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు.

తన ప్రేయసి మాటలు బాధపెట్టినా...

తన ప్రేయసి మాటలు బాధపెట్టినా...

చాలా సార్లు తన ప్రేయసిని మళ్లీ ప్రేమలో పడేసేందుకు లీ చేసిన ప్రయత్నాలతో ఆమె విసుగు చెందింది. తనని మర్చిపోమని, తన లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని, లీని సంతోషంగా గడపమని కూడా చెప్పిందట. అయినా ఆ నిజమైన ప్రేమికుడు అందుకు ఒప్పుకోలేదు.

గతం గురించి నాకు తెలుసు..

గతం గురించి నాకు తెలుసు..

ఆమెతో ఇలా అన్నాడు. గతం గురించి నీకు తెలియదు ‘‘గతంలో నువ్వు ఎలా ఉండేదానివో నా ఒక్కడికే బాగా తెలుసు. అప్పుడే నేను నిన్ను ఇష్టపడ్డారు. నువ్వు ఇలా ఉన్నా కూడా నాకు ఇష్టమే.. నీ ప్రవర్తన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు‘‘ అని చెప్పాడట. అయితే మన ఇద్దరం కలసి కొత్త జ్ఞాపకాలను నృష్టించుకోవచ్చు అని చెప్పుకొచ్చాడట.

ప్రతిరోజూ కొత్త పద్ధతి..

ప్రతిరోజూ కొత్త పద్ధతి..

అలా తనని ప్రతిరోజూ కొత్త పద్ధతుల ద్వారా ఆకట్టుకునేందుకు.. తనని ప్రేమలో పడేసేందుకు ప్రయత్నించే వాడట. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమె గురించి, తన గురించి చెబుతూ తమ ప్రేమ ఎలా మొదలయిందో.. ప్రమాదం జరగక ముందు ఏమేమీ జరిగిందో వివరించేవాడట.

ఆ రోజు రానే వచ్చింది..

ఆ రోజు రానే వచ్చింది..

ఇలా తనపై నిత్యం ప్రేమ కురిపిస్తున్న ప్రేమికుడి నిజాయితీని మెచ్చుకుని.. ఓ రోజు ఆమె అతనికి ప్రపోజ్ చేయడానికి సిద్ధమైంది. ఇంత ముఖ్యమైన సమయంలో నన్ను విడవకుండా నాతోనే ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నువ్వు నన్ను బాగా అర్తం చేసుకున్నావు. నా మతిమరుపు ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినా... అవేమీ పట్టించుకోలేదు. ఇప్పటికీ నేను అన్ని విషయాలు మరచిపోయే అవకాశం ఉంది.

జీవితాంతం తోడుగా ఉంటావా?

జీవితాంతం తోడుగా ఉంటావా?

అయినా కూడా నువ్వు నాకు జీవితాంతం తోడుగా ఉంటావా అని తన ప్రేయసి అడిగితే.. లీ సంతోషంగా ఇలా సమాధానం ఇచ్చాడు. ‘నీ మతిమరుపు వల్ల నేను మరోసారి నీతో ప్రేమలో పడేందుకు అవకాశం దొరికింది‘‘ అని అన్నాడు. అందుకు స్పందించిన మారుయామా ‘‘అమ్నీషియా వల్ల నేను మరోసారి తన ప్రేమలో పడేందుకు అవకాశం దొరికింది. నేను ఎన్నిసార్లు గతం మర్చిపోయినా లీ నన్ను వదలడు. నన్ను తనతో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేసుకుంటాడనే పూర్తి నమ్మకం నాకు ఉంది‘ అంటూ తన ప్రియుడి గురించి గర్వంగా చెప్పింది.

ప్రేమికులందరికీ స్ఫూర్తిదాయకం..

ప్రేమికులందరికీ స్ఫూర్తిదాయకం..

నిజమైన ప్రేమికులందరికీ ఈ ప్రేమ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దీన్ని బట్టి నిజమైన ప్రేమకు ఎల్లప్పుడూ మతిమరుపు అనేదే ఉండదు అని చెప్పొచ్చు.

English summary

Man Makes Fiance Fall in love with him every day after she suffers amnesia

Here we talking about the Man Makes Fiance Fall in love with him every day after she suffers amnesia. Read on
Story first published: Monday, January 6, 2020, 14:23 [IST]