For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవితంలో ఫ్రెండ్స్ దూరం అవడానికి కారణాలేంటి ?

By Swathi
|

ఫ్రెండ్ షిప్ కి ప్రతి ఒక్కరూ ప్రాణమిస్తారు. చిన్నప్పటి నుంచి జీవితంలో భాగస్వామి వచ్చే వరకు ఫ్రెండ్సే లోకమని భావిస్తాం. ఎలాంటి కారణం లేకుండా జీవితంలోకి వచ్చేవాళ్లే ఫ్రెండ్స్. సంతోషసమయాల్లో, కష్టసమయాల్లో మనతో ఉండేవాళ్లే.. అసలైన మిత్రులు. జీవితంలో స్నేహితులు లేకపోతే.. ఆ జీవితం అసంపూర్ణంగానే ఉంటుంది. జీవితంలోని ప్రతి అధ్యాయంలో.. ఒక్కో రకం ఫ్రెండ్స్ మన లైఫ్ లో ఎదురవుతారు.

మన తల్లిదండ్రులతో షేర్ చేసుకోని కొన్ని విషయాలను కేవలం ఫ్రెండ్స్ తోనే చెప్పుకోగలం. ఇంకా చెప్పాలంటే మంచి స్నేహితులు మన జీవితంలో భాగమైపోతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వాళ్లు కీలక పాత్ర పోషిస్తారు. మీ ముఖంలో చిరునవ్వు చూడ్డానికైనా.. బాధను పంచుకోవడానికైనా.. స్నేహితులు ఎప్పుడూ మీతోనే ఉంటారు.

అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది వాళ్ల ప్రాణస్నేహితులను కూడా దూరం చేసుకుంటారు. ఎన్నో ఏళ్లు ఒకే మంచం, ఒకే కంచం, ఒకే బెంచ్ అంటూ.. కలిసి తిరిగిన స్నేహితులు విడిపోతారు. ఎందుకు ? ఏ కారణాల వల్ల ఫ్రెండ్స్ విడిపోతారు ? ఫ్రెండ్స్ దూరం కాకుండా ఉండటానికి ఏం చేయాలి ?

ప్రాధాన్యతలు మారడం

ప్రాధాన్యతలు మారడం

పెరిగి పెద్ద అయ్యే కొద్దీ.. పనిచేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఒకప్పుడు వాళ్లే ప్రపంచం అనుకున్న స్నేహితులను కలవడానికి కూడా సమయం ఉండదు. కానీ ఈ విషయం ముందే గుర్తించి.. ఫ్రెండ్స్ ని కలవడానికి అప్పుడప్పుడు సమయం కేటాయించడం వల్ల మీ స్నేహం కలకాలం ఉంటుంది.

ప్రేమ

ప్రేమ

కొన్నిసార్లు ప్రేమ స్నేహాన్ని నాశనం చేస్తుంది. రిలేషన్ లోకి ఇద్దరు వచ్చారంటే.. ఫ్రెండ్ షిప్ మరిచిపోతారు. ఈ విషయాన్ని తర్వాత గ్రహించినా ఫలితం ఉండదు.

భాగస్వామి

భాగస్వామి

సండే, హాలిడేస్ లో కేవలం మీ ఫ్యామితోనే గడపాలని భావిస్తారు. అలా కాకుండా.. మీ ఫ్రెండ్స్ ని కూడా కలవడానికి సమయం కేటాయించాలి. మీ భాగస్వామితో పరిచయం ఏర్పడేలా చేయాలి. దీనివల్ల ఫ్యామిలీకి దగ్గరైతే.. మీ ఫ్రెండ్ షిప్.. లైఫ్ లాంగ్ కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నిర్ణయాలు

నిర్ణయాలు

జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని విషయాల్లో ఫ్యామిలీ ప్రోత్సాహం కోల్పోతారు. అదే సమయంలో ఫ్రెండ్స్ సలహాలు కూడా నచ్చవు. అలాంటప్పుడే.. వాళ్ల నిర్ణయాలు మీకు నచ్చనప్పుడు ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు.

విషపూరితమైన స్నేహాలు

విషపూరితమైన స్నేహాలు

కొంతమంది స్నేహితులు మీ జీవితంలో చాలా గ్రేట్ గా ఉంటారు. కానీ కొంతమంది మీకు విషపూరితంగా ఉంటారు. వాళ్ల ద్వారా మీపై చాలా చెడుప్రభావం ఉంటుంది. దీనివల్ల అలాంటి ఫ్రెండ్స్ జీవితంలో లేకపోవడమే మంచిదని భావిస్తారు.

డబ్బుకి విలువ ఇవ్వడం

డబ్బుకి విలువ ఇవ్వడం

చాలామంది మనుషుల కంటే.. డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫ్రెండ్స్ తో బయటకువెళ్లేటప్పుడు ఎంత డబ్బు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తారు. కానీ ఫ్రెండ్ షిప్ మధ్యలో డబ్బు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి సందర్భాలే.. స్నేహితులు విడిపోవడానికి కారణమవుతాయి.

కోల్పోవడం

కోల్పోవడం

మనందరికి స్కూల్, కాలేజ్, 20లలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాస్తవానికి అనేక కారణాల వల్ల.. కొన్ని ఏళ్లు గడిచేకొద్ది ఫ్రెండ్స్ ని కోల్పోతూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని మార్పుల ద్వారా చిన్ననాటి స్నేహాలను కూడా జీవితాంతం మనతోనే పెట్టుకోవచ్చు. మరి మీ ఫ్రెండ్ షిప్ ని లైఫ్ లాంగ్ కాపాడుకుంటారా..

English summary

7 Reasons Why We Lose Friends

7 Reasons Why We Lose Friends. Friends are the people who come into our life for no reason and they just stay with us in all our happy and hard times. A life without friends is a life lived incomplete.
Story first published: Thursday, June 9, 2016, 12:32 [IST]
Desktop Bottom Promotion