TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మిమ్మల్ని ఇష్టపడేలా ఎదుటి వారిని ఆకర్షించడం ఎలా? 7 చిలిపి పనులు
ఆహా.... !! మీరు ఒక రోజున, మొదటి సారిగా మీ ప్రియురాలిని చూసినప్పుడు మీరు అద్భుతమైన భావనను పొందుతారు !
మనమున్న కాలేజీలో (లేదా) ఆఫీసులో ఎవరినో ఒకరిని మనమందరం ఇష్టపడతాము. అది మన జీవితంలో ఒక భాగముగా ఉంటుంది. మిగతా వారందరి కన్నా మరింత ఆకర్షణీయంగా ఉండే వ్యక్తి మన మధ్యలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలాంటి వారిని మనము ఇంకొంచె ఎక్కువగా గమనిస్తూ ఉంటాము, మరియు ఒక చిన్న అవకాశం గాని దొరికితే వారితో మాట్లాడటానికి ఎదురు చూస్తూ వుంటాము. మన ఇంట్లో కూడా వారి గురించి ఆలోచిస్తూ ఉంటాము.
మీకు నచ్చిన అమ్మాయి మనసు గెలవడం ఎలా ?
మనలో చాలామంది సిగ్గు పడతాము, వారి దగ్గరికి నేరుగా వెళ్లి వారితో మాట్లాడటానికి, మరియు వారి దృష్టిని ఆకట్టుకోడానికి చాలా రకాల మార్గాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాము. అలాంటి ప్రత్యేకమైన వారి దృష్టిని ఆకట్టుకునేందుకు, మనము చేసే కొన్ని చిలిపి పనులు గురించి ఇక్కడ ప్రస్తావించాము.
1) వారికి ఇష్టమైన రంగులనే ధరిస్తాము :
మనము ఎవరినైనా ఇష్టపడినట్లయితే, మనము
వారి ఇష్టాలు, అయిష్టాలను గురించి తెలుసుకోవడానికి, వారిపై కొంతవరకూ పరిశోధనలు చేస్తామని స్పష్టంగా అందరికీ తెలుసు. వారికి ఇష్టమైన రంగులు గల బట్టలను మనము వేసుకుంటాము, అవి చూడటానికి హాస్యాస్పదంగా ఉన్నా సరే ! ఇది వారి దృష్టిని ఆకర్షించేందుకు హామీని ఇస్తుంది.
2) గ్రూపు యాక్టివిటీస్ లో చాలా చురుకుగా పాల్గొంటాము :
మనము లోలోపల ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉండి, గ్రూపు యాక్టివిటీస్లో పెద్ద అభిమానం లేకపోయినా, అలాంటి సందర్భములో మనము ప్రేమించే వ్యక్తి యొక్క దృష్టిని ఆకర్షించేదిగా ఉన్నట్లయితే - మనము అందులో పాల్గొంటాము; మన ప్రతిభ సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ కూడా.
3) వారికిష్టమైన ప్రదేశాలలో వారిని కలవడం :
మనము వారి యొక్క దృష్టిని ఆకట్టుకునేందుకు, వారికి ఇష్టమైన ప్రదేశాలను ముందుగానే తెలుసుకుని - వారు అనుకున్న ప్రణాళికలోనే, మీరు సందర్శించేటట్లుగా ప్లాన్ చేయడం. ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఆకర్షించేదిగా ఉండటమే కాకుండా మీ ఇద్దరి ఒకే రకమైన అభిరుచులను కలిగి ఉన్నట్లుగా వారు భావిస్తారు.
4) సోషల్ మీడియాలో ఫోటోలను పోస్టు చేయడం :
మనము అకస్మాత్తుగా సోషల్ మీడియాకి వ్యసనపరులుగా మారి, సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్టులను - పోస్టు చేసుకోవడం వలన మీరు ఇష్టపడే వ్యక్తికి మీ పై ఆసక్తిని పెంచేందుకు వీలుగా ఉంటుంది. వారు ఏదో విధంగా చివరికి మీ ఫొటోను ఇష్టపడినట్లయితే, అప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ ఫలించినట్లే.
5) మీరు ఇష్టపడ్డ వ్యక్తి యొక్క గ్రూపు నుండి వేరే ఎవరినైనా ఫ్రెండ్గా చేసుకోవడం :
మీరు ఇష్టపడే వ్యక్తి యొక్క స్నేహితులతో మీరు స్నేహంగా ఉండటం వల్ల ఆ వ్యక్తికి మరింత దగ్గరవడానికి మరియు ఆ వ్యక్తి యొక్క దృష్టిని మీపై మరల్చడానికి అవకాశం ఉంటుంది. మీరు స్నేహం చేసే వ్యక్తి మీకు ఇష్టం లేకపోయినా సరే, మీ మీరు ఇష్టపడే వ్యక్తికి సన్నిహితంగా మరింత దగ్గరవటం కోసం - మీ వ్యక్తి మిమ్మల్ని గుర్తించేంతవరకు మీరు ఏదైనా చేస్తారు.
6) వారిలానే మీరు కూడా అదే తరగతులను తీసుకోవడం :
మీరు అభిమానించే వ్యక్తి తరహాలోనే అవే తరగతులను మీరు కూడా తీసుకోవడం, అందువల్ల మీరు వారిని చూడటానికి అవకాశాన్ని పొందుతారు (లేదా) వారితో కాసేపు సమయాన్ని గడిపేందుకు మంచి అవకాశంగా ఉండును.
7) మీ వ్యక్తిగత వివరాలను బయట పెట్టడం వల్ల, మీరు కోరుకునే వ్యక్తి వాటిని ఉపయోగించుకోవచ్చు :
మీరు ఇష్టపడే వ్యక్తి - మీ మీద ఆసక్తిని పెంచుకునేందుకు తెగించి, మిమ్మల్ని సంప్రదించడానికి అనేక మార్గాలను వెతకవచ్చు. అలాంటి సమయంలో మీ ఫోన్ నెంబరును అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉంచడం వల్ల మీకు మరింత దగ్గరవుతారు.