విరాట్ కోహ్లి అనుష్కశర్మ పెళ్లికి ముందు ఏం చేశారో తెలుసా?

Written By: Bharath
Subscribe to Boldsky

క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హిరోయిన్ అనుష్క శర్మ పెళ్లి అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. వీరి లవ్‌స్టోరీ గురించి కూడా మనకు తెలుసు. కానీ అందులో చాలా ట్విస్ట్ లున్నాయి. ఒక సమయంలో వీరి ప్రేమ పీక్ కు వెళ్లింది. మరో సమయంలో వీరి లవ్ బ్రేకప్ అయ్యింది. మొత్తానికి ఈ మధ్యే ఒక ఇంటివారైన ఈ జంట గురించి కాసేపు ముచ్చటించుకుందామా.

వీరు మొదట కలిసింది ఇలా

వీరు మొదట కలిసింది ఇలా

సీనీ నటి అనుష్క శర్మతో కోహ్లి అనుబంధం గురించి ప్రపంచమంతా తెలిసినదే. అయితే వీరిద్దరూ ప్రేమ ఎప్పుడు ఎలా మొదలైందనే విషయం చాలా మందికి తెలియదు. విరాట్ కోహ్లీకి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు మొదటి పరిచయం ఒక యాడ్ లో ఏర్పడింది.

స్నేహం ప్రేమగా మారింది

యాడ్ చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో తొలిసారి వీరిద్దరూ పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరు తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు.

హనీమూన్ ఫేజ్

హనీమూన్ ఫేజ్

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ అనుబంధం గురించి ఆ క్రికెట్ మ్యాచ్ లో బయటపడింది. పుణేలో జరిగినఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్ లో వీరిద్దరి ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది. అలాగే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ అనుష్కల ప్రేమ గురించి అందరూ మాట్లాడుకున్నారు.

ఫ్లైయింగ్ కిస్

ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన అనుష్కకు విరాట్ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. బ్యాట్ ద్వారా ఫ్లైయింగ్ కిస్ ఆమెకు విసిరాడు. దానికి ఆమె ఎంతో సిగ్గుపడిపోయింది. ఆ మ్యాచ్ లో కొంత గ్యాప్ దొరికినా విరాట్ ఆమె వైపు చూస్తూ నవ్వేవాడు. అదే సంవత్సరంలో, బాంబే వెల్వెట్ సెట్లో కూడా అనుష్కను విరాట్ కలుసుకున్నాడు.

మధ్యలో కాస్త బ్రేక్

మధ్యలో కాస్త బ్రేక్

వీరిద్దరి ప్రేమ గురించి అంతటా మారుమోగిపోతుంటే వీరు సడన్ గా ఒక్కసారిగా వారి ప్రేమకు బ్రేక్ అయినట్లు నమ్మించారు. అయితే నిజంగా వీళ్ల మధ్య గ్యాప్ వచ్చిందా లేదా అనే విషయం తెలియదు. ఆ మధ్య ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో కూడా అన్ ఫాలో చేసుకున్నారు. అయితే కొద్ది నెలల తర్వాత మళ్లీ ఈ జంట సరదాగా షికార్లు చేస్తూ కనిపించింది.

రెడ్ కార్పెట్ పై

రెడ్ కార్పెట్ పై

విరాట్, అనుష్కలు ముంబై లో వోగ్ మెడిసిన్ అవార్డుల ప్రదానం ఫంక్షన్ లో మొదటిసారి రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చారు. జూలై 21, 2015 న ఇలా వీరు కనువిందు చేశారు. అప్పటి నుంచి వీరిద్దరిపై మీడియా ఫోకస్ కూడా ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ లో గాసిప్స్ చక్కర్లు కొట్టడం ఎక్కువైపోయింది.

విభేదాలు

విభేదాలు

విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య కొన్ని కారణాల వల్ల విభేదాలు వచ్చిన మాట వాస్తవమే. ఒక మెన్స్ మ్యాగజైన్ కోసం అనుష్క సెక్సీ ఫొటో షూట్ చేయడం విరాట్ కు నచ్చలేదంట. అలాగే ఇంకా కొన్ని కారణాల వల్ల ఇద్దరూ బ్రేకప్ తీసుకున్నారు. ఇద్దరూ ఫోన్లో చాలా సేపు వాదించుకున్నారు.

మొత్తానికి మళ్లీ కలిశారు.

విరాట్ జెంటిల్మన్

విరాట్ జెంటిల్మన్

విరాట్ అనుష్క నుంచి విడిపోయిన తర్వాత కూడా ఆమెను ఎక్కడ ఒక్క మాట అనలేదు. అతనికి ఆమె అంటే పిచ్చి ప్రేమ. క్రికెట్ లో అతను పర్ఫామెన్స్ చూపకపోవడానికి అనుష్కనే కారణం అని కొందరు అంటే దానికి సరైన సమాధానమే ఇచ్చాడు కోహ్లీ. అందరూ అన్నీ మూసుకునేలా సోషల్ మీడియాలో అప్పుడు పోస్ట్ చేశాడు.

పెళ్లికి చాలా అడ్డంకులు

పెళ్లికి చాలా అడ్డంకులు

అనుష్క శర్మ విరాట్ తో పెళ్లికి మొదట అంగీకరించలేదు. తన కెరీర్ పాడవుతుందని కాస్త ఆగి పెళ్లి చేసుకుందామని విరాట్ తో చెప్పింది. దీనికి విరాట్ కూడా కాదనలేకపోయాడు. ఇక వీరిద్దరూ ముంబైలో యువరాజ్-హజెల్ వివాహంలో గోరీ నల్ ఇష్క్ మిట్టా సాంగ్ కు డ్యాన్స్ ఆ మధ్య వార్తల్లో కూడా నిలిచారు.

మహిళా దినోత్సవం సందర్భంగా

మహిళా దినోత్సవం సందర్భంగా

2017 మహిళా దినోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అదిరిపోయింది. విరాట్ కోహ్లి తన తల్లి ఫొటోను, అనుష్క శర్మ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మా అమ్మ తర్వాత ఆమె

మా అమ్మ తర్వాత ఆమె

నాకు మా అమ్మ తర్వాత అనుష్క శర్మనే. ఆమె అంటే నాకు చాలా గౌరవం అంటూ విరాట్ పోస్ట్ చేశాడు. ఈ ఇద్దరూ నేను అత్యంత్య ప్రాముఖ్యం ఇచ్చే మహిళలు అంటూ పోస్ట్ చేశాడు. అలాగే ప్రతి మహిళకు మహిళాదినోత్సవం శుభాకాంక్షలు అని పోస్ట్ చేశాడు.

 ఆర్మీ ఆఫీసర్‌ కూతురిననే చెప్పుకుంటా

ఆర్మీ ఆఫీసర్‌ కూతురిననే చెప్పుకుంటా

నేను విరాట్ కోహ్లి భార్యనైనా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నైనా ఆర్మీ ఆఫీసర్‌ కూతురిననే చెప్పుకునేందుకు ఇష్టమంది అనుష్క శర్మ. మా నాన్నఅజయ్‌ కుమార్‌ శర్మ ఆర్మీ ఆఫీసర్‌. నా చదువంతా ఆర్మీ స్కూల్లోనే సాగింది. నేను మొదట్లో జర్నలిస్ట్‌ అవ్వాలనుకున్నా. ఆ తర్వాత యాక్టింగ్‌ను ఎంచుకున్నా. ఇప్పుడు విరాట్ కోహ్లి భార్యను కూడా. అయినా నేను ఒక ఆర్మీ ఆఫీసర్‌ కూతురుగా చెప్పుకునేందుకే ఇష్టపడతా.

English summary

all about virat anushkas love story

Everything You Need To Know About Virat Kohli & Anushka Sharma's Love Story